– కల్తీ లిక్కర్ లాభాల నుండి లాకప్ వరకు – జోగి గాధ!
(చాకిరేవు)
లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారిని తంబళ్లపల్లి కోర్టుకు తరలించారు. తన ఇబ్రహీంపట్నం ఫ్రెండ్స్ మోడల్ కల్తీ లిక్కర్ స్కాంతో వైకాపా హయాంలో బాగా ఆర్జించారు జోగి బ్రదర్స్. దానిని మొలకలచెరువులో ప్రయోగించి ప్రస్తుత ప్రభుత్వం మీద బురద చల్లడానికి కుట్ర పన్నాడు. అక్కడి నుండి ఆఫ్రికా పంపిస్తామని ఫ్రెండ్స్ కు చెప్పారు.
ఫ్రెండ్స్ మొత్తం యూపీఏ లావాదేవీలతో సహా.. మీటింగ్ పాయింట్ల గురించి గుట్టు విప్పేయడంతో.. సెల్ టవర్ల టేకౌట్లతో సహా తేల్చి మొలకలచెరువు కుట్ర మీద కేసు నమోదు చేశారు. నెల్లూరు నుండి తంబళ్లపల్లె కోర్టుకు తీసుకు వస్తుంటే.. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆయన తనయుడు పిల్ల పెద్దిరెడ్డి అభినయ్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి నిసార్ అహ్మద్, మదనపల్లి వైఎస్సార్సీపి యూత్ లీడర్ హర్షవర్ధన్ రెడ్డి కోర్టు వద్ద పరామర్శించడానికి వచ్చారు. పట్టుమని 30 మంది లేరు.
ఆ సంఖ్యతో పోలీసులతో గొడవకు దిగడానికి ప్రయత్నించారు. ఇచ్చిన హెచ్చరికలతో తోకలు కట్టేసుకుని గమ్మున వెళ్లిపోయారు. ఈ కేసుకు రిమాండ్ సింహా పొన్నవోలు రాకపోయినా జోగికి రిమాండ్ పడింది. అనంతరం నెల్లూరు జైలుకు తరలించారు. నాకు నెల్లూరు వద్దు, విజయవాడ పంపండి అని జోగి విజ్ఞప్తి చేస్తున్నాడు కోర్టులో. చంద్రబాబు ఇంటి మీద, టీడీపీ ఆఫీసు మీద దాడులు చేసినా ఆ కేసులలో బెయిల్లు తెచ్చుకొని, కల్తీ లిక్కర్లో తిన్నది అరక్క, మొలకల చెరువు కల్తీ కుట్రకు పాల్పడి అడ్డంగా దొరికిపోవడం స్వయంకృతం(పాత కర్మలు వదలవేమో). తాను త్రవ్విన గోతిలో తానే పడ్డట్లుగా జోగి తంబళ్లపల్లె ట్రిప్ జరిగింది.