– సాక్షి పత్రిక హిందువులకు వ్యతిరేకమా?
– ‘హిందూ వ్యతిరేకత, భారతదేశ వ్యతిరేకత, దేశ ప్రజా వ్యతిరేకత అన్నవి భయంకరమైన మానసిక వ్యాధులు’
సాక్షి ఎడిట్ పేజ్ వ్యాసాలు అంటేనే ‘చదువులేమి’ వ్యాసాలు అనే అని మనకు తెలిసిందే; మనం సోదాహరణంగా పలుమార్లు చర్చించుకున్నదే. ఈ ‘చదువులేమి’ సాక్షిలోనే పెద్ద మోతాదులో వాంతి అవుతూండడానికి కారణం సాక్షి సంపాదకుడా? ఎడిట్ పేజ్ ఇన్చార్జా? సాక్షికి ఉన్న హిందూ వ్యతిరేకతా? హిందూ వ్యతిరేక వ్యాసాలు, బుద్ధుడు, బౌద్ధం అంటూ పేలాపనల వ్యాసాలు చదువు, అవగాహనా రాహిత్యంతోనే, వక్రీకణలతోనే ఉంటాయి.
తెలుగు మేధ… దేశంలో ఇతర భాషీయుల్లో పెద్దగా లేని ‘చదువు రాహిత్యం’ ఒక్క తెలుగు భాషీయుల్లోనే పెల్లుబుకుతోంది…
నక్సలిజమ్, కమ్యూనిజమ్, బౌద్ధ పేలాపన, కులోన్మాదం, ప్రాంతీయతా ఉన్మాదం, అంబేడ్కర్ వాదం ఇతర భాషీయుల కన్నా తెలుగులో ఎక్కువగానూ, హానికరంగానూ ఉండడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన జవాబు తెలుసుకుని సరైన పరిష్కారం సాధించుకోలేకపోతే తెలుగు జాతి తీవ్రంగా గాయపడుతుంది.
‘రాజకీయ విశ్లేషకుడు, అమెరికాలో వైద్యుడు’ అని సాక్షి సంపాదక మేధావర్గం ధ్రువీకరించిన డా. జి. నవీన్ రాసిన ‘ఈ యుద్ధం ఈనాటిది కాదు’ వ్యాసం చదివాక ‘ఈ వ్యాధి ఈనాటిది కాదు’ అన్న వాస్తవం మరోసారి తెలియస్తుంది; అమేరికలో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలుగు మేధ తెలుగు మేధే! అన్న బాధాకరమైన వాస్తవం ప్రస్ఫుటం ఔతుంది.
అసలు తెలుగులో ‘చదువు’, ‘సరైన ఆలోచన’ ఎందుకు ఇతరుల కన్నా తక్కువగా ఉంటాయో పరిశోధించాల్సిన అవసరం ఉంది.
‘ఈ యుద్ధం ఈనాటిది కాదు’ శీర్షికతో వచ్చిన వ్యాసం ఒక్క తెలుగు వ్యక్తి తప్పితే మరో భాష వ్యక్తి రాసుండే అవకాశం లేదు. సాక్షి వంటి తెలుగు పత్రికలో తప్పితే మరో భాషలో ఏ నాసిరకం పత్రికలో కూడా ఇలాంటి వ్యాసం అచ్చై ఉండేది కాదు.
బుద్ధుడు, పుష్యమిత్ర శుంగుడు గురించి వ్యాసకర్త తన ‘చదువులేమి’ని, అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నాడు. అసలు ఈ వ్యాస విషయమే పనికిమాలిన విషయం. (అందుకే సాక్షిలో వచ్చిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు)
‘హిందూ వ్యతిరేకత, భారతదేశ వ్యతిరేకత, దేశ ప్రజా వ్యతిరేకత అన్నవి భయంకరమైన మానసిక వ్యాధులు’. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఇలాంటి వ్యాధులు ఉండవు! ఆ వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు అమేరికలో కాదు ఎక్కడ ఉన్నా ఇదిగో ఈ వ్యాసం లాంటి వాంతి చేస్తూనే ఉంటారు.
ఆ వాంతి మనపై పడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి.

9444012279