– వందలాది విమాన సర్వీçసులకు బ్రేక్
– ఎక్కడికక్కడ విమాన ప్రయాణికుల అగచాట్లు
– దీంట్లో కేంద్ర మంత్రికి ఏ బాధ్యత లేదా?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
తాడేపల్లి: ఇండిగో విమాన సర్వీపులు ఆగి లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. 2024లో ఫ్లైట్లకు రెస్ట్ అవర్స్, తక్కువ వర్కింగ్ అవర్స్ వంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ నియమాలు అమలు చేయటం, ఎయిర్‌లైన్స్ స్టాఫ్ రిక్రూట్ పరిస్థితులు సమీక్షించడం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత. ఆ దిశలో ఆ మంత్రి కె.రామ్మోహన్నాయుడు గడిచిన 18 నెలల్లో చేసినది ఏమిటి?. ఏరోజూ ఏ అంశాన్ని ఆయన సమీక్షించలేదు. ఫలితంగా ఇప్పుడు దేశం పరువు పోయింది.
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఏం చేయాలి? తన బాధ్యత ఎలా నిర్వర్తించాలి? పెళ్లిలో రీల్స్ చేసుకుంటారా? లేదా సిమెంట్ రోడ్లు శంకుస్థాపన చేయాలా?. తన శాఖ పరిధిలో ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా?. మరి గత ఏడాదిన్నరగా మీ పార్టీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆ పని చేశారా? తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారా? మరి వీటన్నింటికి సీఎం చంద్రబాబు సమాధానం చెబుతారా?
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఆలవాలం కాగా, అది మన రాష్ట్ర బ్రాండింగ్ అని, అలాంటి బ్రాండింగ్‌ను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారని వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. దేశానికి దక్షిణ ధాన్యాగారంగా ఉన్న ఏపీ బ్రాండ్‌ను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా? అని ఆయన నిలదీశారు.
రైతుల కష్టాలను అర్థం చేసుకోకుండా, వారికి సలహాలు ఇచ్చే ముందు చంద్రబాబు తన ఆలోచనా విధానంలో మార్పు చేసుకోవాలి. 50 ఏళ్ల రాజకీయ అనుభవం, 78 ఏళ్ల వయసులో కూడా రైతులపై ఇలాంటి అవహేళనాత్మక వ్యాఖ్యలు చేయడం విచారకరం. రైతులకు తాము కావాలనుకున్న పంటలు పండించొద్దని, ప్రజలు తినే పంటలే పండించాలని చంద్రబాబు చెప్పడం వ్యవసాయాన్ని అవమానపరిచే వ్యాఖ్యలే.
రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారంటూ, సహజ సేద్యమే చేయాలని చెప్పడం రైతులను తప్పుదారి పట్టించడమే. రైతు అత్యాశతో వ్యవసాయం చేస్తాడని చంద్రబాబు చెప్పడం, వారిని అగౌరవపరచడమే అవుతుంది. భవిష్యత్ ఆదాయాల నుంచి రూ.1.91 లక్షల విలువైన కోట్ల ప్రజా ఆస్తులను కేవలం రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయని విధంగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీ సంతకం కూడా లేకుండా అప్పులు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. దేశంలో ఇప్పటి వరకూ ఏ నాయకుడు చేయని ఆర్థిక తప్పిదాలు, ఈ 18 నెలల్లో చంద్రబాబు చేశారు.
సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాధనంతో ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ జల్సా చేస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు. ఈ 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మరి ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వగలరా?.
వైయస్ జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూళ్లు నాశనం చేశారని చంద్రబాబు నిస్సిగ్గుగా విమర్శలు చేశారు. మరి మీ మనవడు, లోకేష్ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడు? టీడీపీ ఎమ్మెల్యేల పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారు? పేద పిల్లలకు మాత్రమే తెలుగు మీడియం, మీ పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా? పేదవాళ్ల పిల్లలు బాగా చదువుకుని వారు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందార్ల ఇళ్లలో పని చేసే వారు ఉండరన్నదే మీ తప్పుడు ఉద్దేశం కాదా?.
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు..ఇస్తున్నారా? రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతుంటే.. మీరు 30 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి డబ్బులు ఎగ్గొట్టారు కదా? మోదీ వేసిన డబ్బులు కాకుండా రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చింది రెండేళ్లలో కేవలం రూ.10 వేలే కదా?.
నిరుద్యోగులకు ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు?. ఇక ఉద్యోగులకూ చేసిందేమీ లేదు. ఐఆర్ లేదు. కొత్త పీఆర్సీ వేయలేదు. నాలుగు డీఏలకు కేవలం ఒకటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చివరకు ఒక్క నిరుపేద కుటుంబానికి సెంటు భూమి కూడా ఇవ్వలేదు. మరి మీరు ఏం చేసినట్లు?.
ఇవన్నీ ఎందుకు.. మీ పథకాలపై మీ పార్టీ జెండా మోసే కార్యకర్తల భార్యలకు ఫోన్ చేసి అడగండి చంద్రబాబు? ఏమ్మా, ఈ 18 నెలల్లో చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచలేదు కదా అని ఐవీఆర్ఎస్ఎల్ సర్వే ద్వారా అడగండి. ఆ వెంటనే ఫోన్ పగిలిపోతుంది. నేలకేసి కొడతారు. అడిగినోడికి చెవ్వుల్లో బూతులు వినిపిస్తాయి. వైయస్ జగన్ రూ.2 లకే యూనిట్ కరెంటు కొంటే ఆ రోజు అమ్మో, అబ్బో అంటూ గగ్గోలు పెట్టారు. మీరు మాత్రం యూనిట్ కరెంటు రూ.4.50కు పాతికేళ్లకు కొన్నారు. మరి ఎవరిది తప్పు?