నేడు రాత్రి చీకటి దాటి, రేపటి సూర్యోదయాన్ని తాకే క్షణం… అది కేవలం ఒక తేదీ మార్పు కాదు. మనందరి జీవితాలను వెలిగించిన ఒక మహనీయుడి పుట్టినరోజు! రేపు, డిసెంబర్ 10, సర్ కట్టమంచి రామలింగారెడ్డి 146వ జయంతి.
ఆయన పేరు తలచుకోగానే మనసుకు వచ్చేది కేవలం ఒక వైస్-ఛాన్స్లర్ కాదు; మన చిత్తూరు మట్టి నుంచి వచ్చి, ఆంగ్ల విద్యతో తనను తాను తీర్చిదిద్దుకొని, తిరిగి మన తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని తపించిన మన బిడ్డ. విదేశాల నుంచి వచ్చినా, ఆయన గుండె నిండా ఉన్నది మన తెలుగువారి భవిష్యత్తే.
ఆయన కన్న కల… ఆంధ్ర విశ్వవిద్యాలయం. విశాఖపట్నం సముద్ర తీరంలో ఆ యూనివర్సిటీ భవనాలు కేవలం ఇటుక, సిమెంట్‌తో కట్టినవి కావు. అవి… ఆయన కన్నీళ్లతో, నిద్రలేని రాత్రులతో, నిధుల కోసం పడిన ఆరాటంతో, అపనిందలు భరించి నిలబడిన ధైర్యంతో కట్టిన దేవాలయాలు. యూనివర్సిటీని తరలించాలని కొందరు కుట్రలు పన్నినప్పుడు, ఒంటరిగా నిలబడి, తన ఆరోగ్యాన్ని, తన జీవితాన్ని పణంగా పెట్టి, “ఇది ఆంధ్రుల ఆస్తి! ఇక్కడే ఉంటుంది!” అని ఆయన చేసిన పోరాటం… అది కేవలం మాట కాదు, మన జాతి గౌరవాన్ని నిలబెట్టిన ప్రతిజ్ఞ.
ఆయన అందించిన విద్య… కేవలం డిగ్రీలను ఇవ్వలేదు. అది మన పేద విద్యార్థులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆయన స్థాపించిన ఆ విద్యా సంస్థలో చదువుకున్న ప్రతి విద్యార్థి, ఆయన చూపిన దయను, ఆశయాన్ని జీవితాంతం మర్చిపోలేరు. ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్యనాయుడు వరకు ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన సరస్వతీ నిలయం. అందుకే నేటికీ ఎందరికో ఆయన తండ్రి స్థానం.
అంతేకాదు… మన తెలుగు సాహిత్యాన్ని కూడా ఆయన విదేశాల నుంచి వచ్చిన విమర్శా దృష్టితో, మనసు పెట్టి ప్రేమించారు. ‘ముసలమ్మ మరణం’లో ఆయన పలికిన ప్రతి అక్షరం… మన భాషపై ఆయనకున్న గాఢమైన అనురాగాన్ని చూపిస్తుంది.
రేపు ఈ శుభ దినాన, మనం ఇంకేం చేయలేకపోయినా… మన గుండెలపై చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆయనను గుర్తు చేసుకుందాం. “రెడ్డి గారూ… మీరు నాటిన విత్తనం మహా వృక్షమైంది. మీ ఆశయం ఎప్పటికీ జీవించే ఉంటుంది” అని మనసులోనే నివాళులర్పిద్దాం.
ఆయన ఆత్మ, ఆయన స్ఫూర్తి… నిత్యం మన హృదయాలను పలకరిస్తూనే ఉంటుంది.
ఎక్కడో చిత్తూరులో పుట్టిన ఆయన విశాఖ గడ్డ మీద మమకారంతో చేసిన మహోత్కృష్ట సేవలను మరిచి, ఇటీవలే జైలు శిక్ష పడిన ప్రసాద్ రెడ్డిని అక్కడికి వీసీగా పంపిన జగన్ రెడ్డి సేవలను పొగిడే భావదారిద్యులు ఉన్నారు. ఆ ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి పనులను సమర్థించే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. శతాబ్దానికి ఒక సారి దొరికే ఇలాంటి మహనీయుల గురించి గర్వంగా చెబితే కుల గౌరవం ఇనుమడిస్తుంది.
విశాఖకు చిత్తూరు వారికి ఏమి సంబంధమో.. కానీ అక్కడి వారి మంచితనం కోసం హుద్ హుద్ వచ్చినా నిలబడిన చంద్రబాబు నుండి గూగుల్ పెట్టుబడులు తెచ్చిన లోకేశ్ వరకు కట్టమంచి రామలింగారెడ్డి లెక్క వరకు వారి మనసుల్లో శాశ్వత గౌరవం సంపాదించుకున్నారు.
ఆయన ఆత్మ, ఆయన స్ఫూర్తి… నిత్యం మన హృదయాలను పలకరిస్తూనే ఉంటుంది. వారికి సాయం చేసే చిత్తూరు వారి హృదయాలను ఆయన ఆత్మ, ఆయన స్ఫూర్తి… నిత్యం పలకరిస్తూనే ఉంటుంది.
– చాకిరేవు