– ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ: వాజ్ పేయి శత జయంతి సందర్భంగా విగ్రహాల ఆవిష్కరణ తో పాటు వాణిని ప్రజలకి వివరించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మధ్యప్రదేశ్ లో వాజ్ పేయి పుట్టారో అలాంటి పుణ్య భూమి నుంచి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ వచ్చారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశాది నేతగా వాజ్ పేయి మారారు. మోహన్ యాదవ్ మహాకాళేశ్వర్ ఉజ్జయని నుంచి గెలిచి బడుగు బలహీన వర్గాలు సంబరాలు చేసుకునేల చేశారు. వాజ్ పేయి అంటే ప్రధాని గా చేసారు గొప్ప కార్యక్రమాలు చేయడమే కాదు. స్వతంత్ర సమరలో పాల్గొని క్విట్ ఇండియా లో భాగంగా జైలు కి వెళ్లారు.
ఒక బడి పంతులు కొడుకుగా తన కృషి పట్టుదల క్రమశిక్షణ కారణం గా ఆ స్థానానికి వెళ్ళారు. అనేక పోరాటాలలో భాగంగా కశ్మీర్ ఉద్యమంలో జైలు కి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూరం చేసి కాంగ్రెస్ యేతర ప్రభుత్వాలు రావాలని పోరాటాలు చేసారు. ఆ ఫలితంగానే 1962 లో బీహార్,రాజస్థాన్లో కాంగ్రెస్ యేతర ప్రభుత్వాలకు కారకులు అయ్యారు. వాజ్ పేయి నేతృత్వంలో అందరు ఆకర్షితులయ్యారు. 1996లో మొదటి సారి ప్రధానిగా 13రోజులు పనిచేశారు. 1998 లో 13 నెలలు మాత్రమే పని చేసారు. 27 పార్టీ లు కలిపి నేతృత్వం వహించారు.
అన్ని పార్టీలని కలిపి సమన్వయం చేస్తూ ముందుకి తీసుకెళ్లారని మాధవ్ అన్నారు.