‘పాలిస్టర్ పాపం’ బజారుకీడ్చింది
ఓ భక్తులారా! కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో జరిగిన ఈ మహా అపచారం చూడండి! ఆ దేవదేవుని కైంకర్యాల కోసం, భక్తులకు అందించే పవిత్ర శాలువాల కోసం… మన కళ్ల ముందే, మన కడుపు మండిపోయేలా జరిగిన ఘోరాన్ని వినండి!
అసలు కథ ఏంటంటే… తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే కేవలం గుడి కాదు. అది కోట్లాది మంది నమ్మకం, దర్శనంతో వైకుంఠంలో వున్న అనుభూతితో పులకింత! ఆ స్వామి సేవలో వినియోగించే వస్త్రాలు ఎంత పవిత్రంగా, ఎంత నిష్కల్మషంగా ఉండాలి? కానీ… ఆ పవిత్రతను, ఆ నమ్మకాన్ని ఈ ‘పాలిస్టర్ పాపం’ బజారుకీడ్చింది!
ఏం జరిగింది? తితిదే ఖజానా నుండి కోట్ల రూపాయలు పోసి కొన్నారట. దేనికోసం? ‘పట్టు శాలువాల’ కోసం! ధర ఎంత? ఒక్కొక్కటి దాదాపు రూ. 1,389.15! కళ్లు చెదిరే రేటు కదా? కానీ, లోపల ఏముంది? విజిలెన్స్ అధికారులు వాళ్ల పాలిట ‘యమదూత’ లా వచ్చి, శాంపిల్స్ టెస్ట్ చేయిస్తే… తేలిందేంటో తెలుసా? నూరు శాతం పాలిస్టర్ మహానైవేద్యం!
పాపం స్వామీ! స్వామివారికి అలంకరించేది, భక్తులకు ఇచ్చేది, దాతలను సత్కరించేది… అంతా పాలిస్టర్ అంట! అదీ, సిల్క్ హలోగ్రామ్ కూడా లేకుండా… చివరి వరకు ఆ దగాను కొన్సాగించారు దౌర్భాగ్యులు జగన్ బాబాయి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి! ఇది కేవలం కమీషన్ల కోసం చేసిన మోసం కాదు. ఇది నమ్మకాన్ని నడివీధిలో నరికివేయడం! ఆ దేవదేవుని భక్తిని, మన మనోభావాలను కాళ్ల కింద పెట్టి తొక్కేయడం!
ఎవరి హయాంలో ఈ ఘోరం? బీ ఆర్ నాయుడు గారు కొత్తగా వచ్చి, పాత చిట్టా విప్పి… “2019 నుండి ఇప్పటి వరకు” జరిగిన అవినీతి అని లెక్క కట్టారట! అంటే… గత ప్రభుత్వ హయాంలో (జగన్ గారి పాలనలో) స్వామి గుండెపై ఈ దగా దందా నడిచిందన్నమాట! రూ. 80-90 కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చునని అంచనా వేయడం ఎంత భయంకరం!
నిన్నటి ‘జగన్ భోగాలు’ ఇవేనా? కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, పరకామణిలో దొంగతనాలు! ఇప్పుడేమో పట్టుకు బదులు పాలిస్టర్! భక్తులు తమ కష్టార్జితాన్ని, కన్నీటిని దాచి ఆ స్వామి హుండీలో వేస్తే, ఆ డబ్బుతో… పాలిస్టర్ శాలువాలు కొని, కమీషన్లు కొట్టేసి, ఆ స్వామి సేవకు ముసుగు వేస్తారా? ఇదేనా ఆ జగన్ భోగం? అధికారం అంటే ఆ స్వామి సేవ చేయాలి గానీ, ఆ స్వామి సొమ్మునే దోచుకోవాలా?
ప్రశ్న ఒక్కటే! ఈ దొంగతనానికి సహకరించిన అధికారులపై, ఆ కాంట్రాక్టు సంస్థలపై ఏసీబీ విచారణ జరిపి… కఠిన చర్యలు తీసుకుంటామని కొత్త బోర్డు చెబుతోంది. సంతోషం! కానీ, ఈ అవినీతి మహావృక్షానికి నీరు పోసి, పెంచి పోషించిన ‘పెద్ద తలకాయలు’ ఎవరు? వారిపై ఎప్పుడు వేటు పడుతుంది?
జగనుకు శాలువాలు కప్పడం కాదు! వారి పాలిస్టర్ దగాకు, ఆ గోవిందుని గుండెలపై వేసిన పాపానికి… ఈ వేద భూమిలో నిష్కృతి ఏమిటి?
దయచేసి, ఆ దేవదేవుని పవిత్రతను కాపాడండి! ఈ దగాకోరులకు కఠిన శిక్ష అమలు చెయ్యండి!
– చాకిరేవు