మాయదారి పెళ్ళికొడుకు
మొబైల్ చూసుకుంటూ
పెళ్ళికూతురు బదులు
ఆమె తల్లి మెడలో
కట్టేశాట్ట సూత్రం..
ఆ ఫోటో గ్రూపులో పెడితే
పెళ్ళికూతురు హడావిడిగా
లైక్ కొట్టేసిందట..
కాశీ మజిలీ కథలు ఇలాగే ఉండేవి..
* * *
దారి చూపేది
దేవుడు మాత్రమే కాదు..
గూగుల్ మ్యాప్ కూడా..
ఆధునిక పరిజ్ఞానం
* * *
నడిచి వెళ్లేవాడు బాటసారి..
పోలీసోడు బీటుసారి..
మిలట్రీ వాడు బూటుసారి
తాగుబోతు మాత్రం
బూతుసారి..!
నబూతో నభవిష్యత్..
* * *
నీ సంతకం!
వేరొకరు పెడితే ఫోర్జరీ..
నువ్వే మర్చిపోతే
అప్పుడు నీకు అవసరం
బ్రెయిన్ సర్జరీ..!
వయసు పిలిచింది..!
* * *
పేదోడి గుండె బలహీనంగా
లబ్ డబ్..లబ్ డబ్..
పెద్దోడి హార్ట్ శరవేగంగా
లబ్ డబ్బు..లబ్ డబ్బు..
ఇద్దరికీ వస్తే గుండె జబ్బు
ఉన్నోడికి అర్జంటుగా బైపాస్..
లేనోడికి మామూలు వైద్యంతో
టైం పాస్..!
ధనం మూలం విధం వైద్యం..!
* * *
పైసలున్నోడు మామూలు జలుబుకు పెట్టే ఖర్చు
పైసల్లేనోడు
గుండె జబ్బుకు కూడా
పెట్టలేనంత..
ఉన్నోడికి జలుబూ జబ్బే..!
* * *
ఈరోజు నిర్యాణం..
బంధువులకు రాత్రంతా
జాగరణం..
మర్నాడు సంస్కరణం..
మరుచటి రోజు సంస్మరణం..
రోజులు గడిచేపాటికి
నీ సొంత వారైనా
చేయరే నీ నామస్మరణం..
పైగా నీ ఆస్తుల కోసం రణం..
బంధువులే రాబందులు..!
* * *
– సురేష్..9948546286
..7995666286