– సౌభాగ్యమ్మ.. సౌభాగ్యలక్ష్మి ఎట్లయిందప్పా?
(చాకిరేవు)
దొంగ పిన్ని పేరు తెచ్చి, పిన్ని భూములు మాయం చేసి, హింసించి పీడించిన పైశాచిక కొడుకు!
రికార్డుల్లో పేరు మార్పు.. పిన్నమ్మకే జగన్ వెన్నుపోటు!
అబ్బబ్బ.. ఏం ‘పెద్ద మనసు’! ఏం ‘కుటుంబ గౌరవం’! గొడ్డలిపోటుతో చిన్నాన్నను సాగనంపడమే ఒక ఎత్తు అనుకుంటే, ఆ అభాగ్యుడైన చిన్నాన్న భార్య భూముల్ని కూడా స్వాహా చేయడమా? ఇది కదా అసలైన ‘ఫ్యాక్షన్’ పాలన అంటే! పులివెందుల గడ్డపై పుట్టిన పులులమని చెప్పుకునే వాళ్ళు, కడకు పిన్నిగారి ఏడు ఎకరాల భూముల మీద పడటం, ఏడిపించడం చూస్తుంటే.. “మా నమ్మకం నువ్వే జగన్” అన్న నినాదానికి కొత్త అర్థం వస్తోంది.
వెబ్ ల్యాండ్.. కాదు కాదు ‘వైకాపా’ ల్యాండ్!
ఆనాడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని బయలుదేరితే, పెద్దిరెడ్డి నుండి వైకాపాలో చిన్నా చితకా వరకు పక్కవాడి వెబ్ ల్యాండ్ రికార్డులను మాయం చేయడంలో ఆ ఐదేళ్లు బిజీగా ఉన్నారు. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న ఏడు ఎకరాల భూమిని మాయం చేయడం అంటే.. అది కేవలం రెవెన్యూ రికార్డుల మార్పు కాదు, అది అధికార దుర్వినియోగంతో చేసిన కక్ష సాధింపుకు పరాకాష్ట.
జరిగిన మ్యాజిక్: 2022 వరకు రికార్డుల్లో ఉన్న పేరు, ఒక్కసారిగా ‘సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి’గా ఎలా మారింది?
క్ర్రియేటివిటీ: పేరులో చిన్న మార్పు చేసి భూమిని లాగేసుకోవడం.. సినిమా విలన్లకు కూడా రాని ఐడియా ఇది!
తహసీల్దార్ మార్కు తమాషా: మాధవ కృష్ణారెడ్డి లాంటి ‘నిబద్ధత’ గల అధికారులు ఉంటే, సామాన్యుల భూములే కాదు, సాక్షాత్తూ హిమాలయ పర్వతాలనైనా వైకాపా కార్యకర్తల పేరిట రాసేయగలరు.
కక్ష సాధింపులో ‘గోల్డ్ మెడల్’
చిన్నాన్న చనిపోతే పిన్నిని, చెల్లిని అక్కున చేర్చుకోవడం సీమ సంప్రదాయం. కానీ ఇక్కడ విచిత్రం! చిన్నాన్నను గొడ్డలితో చంపించి, ఆయన భార్యను ఆఫీసుల చుట్టూ తిప్పడం.. ఆమె ఆస్తులను వెబ్ ల్యాండ్ నుంచి మాయం చేయడం.. ఇదా మీ ‘రాజన్న రాజ్యం’? సొంత రక్తం పంచుకున్న కుటుంబం మీద ఇంతటి పగ పెంచుకున్నారంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?
“బాబాయ్ మరణం ఒక మిస్టరీ.. పిన్నమ్మ భూమి ఒక హిస్టరీ.. సిస్టర్లకు ఆస్తులు ఇవ్వకుండా కన్నీటి ఫ్యాక్టరీలు పెట్టించడం!” ఇదే కదా జగన్ నైజం?
ప్రభుత్వం మారింది.. కానీ ఆనాడు చక్రం తిప్పిన ‘మాధవ కృష్ణారెడ్డి’లు ఇంకా కుర్చీల్లోనే కూర్చుని ప్రమోషన్లు పొందుతుండటం విడ్డూరం. సౌభాగ్యమ్మ భూములను తక్షణమే ఆమె పేరు మీదకు మార్చాలి. అక్షర దోషాలతో గడప గడపకూ అక్రమాలను తీసుకెళ్లి ఏడిపించిన వైకాపా వారిని, సహకరించిన అధికారులను జైలు గడప వరకు తీసుకువెళ్లాలి.