రాజధాని విషయంలో జగన్ గారి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించిందా అనే అనుమానం కలుగుతోంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి” లా తయారైంది. ఒకప్పుడు 151 సీట్లతో విర్రవీగిన రారాజు, ఇప్పుడు కనీసం “ప్రతిపక్ష హోదా” కూడా దక్కించుకోలేక అసెంబ్లీ మెట్లు ఎక్కే ధైర్యం చేయలేక కరకట్ట మీద కబుర్లు చెబుతున్నారు.
జగన్ గారు ప్రస్తుతం ఒక వింత లాజిక్‌తో అసెంబ్లీని బహిష్కరించారు. ప్రజలు ఓట్లేసి ఆయనకు కేవలం 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా, ఆయన మాత్రం “నాకు అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే సభకు వస్తా” అని భీష్మించుకుని కూర్చున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని హోదాను, స్పీకర్ ఎలా ఇస్తారు? అంటే, ప్రజల తీర్పు కంటే తన అహమే గొప్పదని ఆయన భావిస్తున్నారా? అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మరోవైపు, పార్టీ ఎమ్మెల్యేల తీరు ఇంకా హాస్యాస్పదంగా ఉంది. బయట జగన్ గారు “మేము అసెంబ్లీకి వెళ్లం” అని గంభీరంగా డైలాగులు కొడుతుంటే, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం దొంగచాటుగా అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు చేసి పరారవుతున్నారు. లోపల ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేదు కానీ, సంతకం పెట్టి జీతాలు, టీఏ, డీఏ తీసుకోవడంలో మాత్రం వీరు మహా ఉత్సాహవంతులు. ప్రజల సమస్యల కంటే వారి సొమ్ము మీదే వీరికి ప్రేమ ఎక్కువని ఈ “సంతకాల రాజకీయం” నిరూపిస్తోంది.
ఇటీవల సజ్జల గారి మడత: “వచ్చేసారి అమరావతి నుంచే పాలిస్తాం” అని ఆయన ఒక రంగు పూస్తే..
తాజా జగన్ గారి మడత: “అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు” అని ఆయన ఇంకో రంగు పూశారు.
అమరావతిని “నదీ గర్భం” (River Basin) అంటూ ఇప్పుడు సైన్స్ పాఠాలు చెబుతున్న జగన్ గారు.. మరి గత ఐదేళ్లు అదే నదీ గర్భంలో ఉన్న అసెంబ్లీలో ఎలా కూర్చున్నారు? అక్కడే ఇల్లు కట్టుకుని, ఎత్తైన ఐరన్ ఫెన్సింగ్ వేసుకుని, అటు పార్టీ ఆఫీసు – ఇటు క్యాంప్ ఆఫీసు అని గజ ఈతగాడి లెక్కన ఎందుకు వారానికోసారి వచ్చి పోతున్నారో ఆ “గందరగోళ మాస్టర్” కే తెలియాలి.
ప్రస్తుతం జగన్ పరిస్థితి ఎలా ఉందంటే.. అద్దంలో తన నీడను చూసుకుని తానే భయపడేలా ఉంది.
అటు విశాఖలో ఇష్టపడి కట్టుకున్న ప్యాలెస్ (ఋషికొండ) చేజారిపోయింది.
ఇటు అమరావతి మీద మనసు లేదు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు.
సొంత ఎమ్మెల్యేలేమో సంతకాలు పెట్టి పారిపోతుంటే, ఆయన మాత్రం సోషల్ మీడియాలో రంకెలు వేస్తున్నారు. రాజధాని మీద క్లారిటీ లేదు.. ప్రతిపక్ష హోదా లేదు.. కనీసం ప్రజల్లో సానుభూతి అంతకంటే లేదు! జగన్ గారూ.. మీ మతిలేని రాజకీయాలు చూసి ఊసరవెల్లి కూడా తన రంగులు మార్చుకోలేక రిటైర్మెంట్ ప్రకటించేలా ఉంది!
ఎక్కడ సీఎం కూర్చుంటే అదే రాజధాని అని చెబుతున్న
ఈయన పిచ్చాసుపత్రిలో కూర్చుని అదే రాజధాని అంటే సరే అనే పిచ్చి జనం ఉన్నారని ఈయన పిచ్చి నమ్మకం కాబోలు.
-చాకిరేవు