– తిరుమల కొండపై బీసీల ఆత్మగౌరవంపై దాడి
– కొండపై ఎందరో అగ్రకుల పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా భూములు
– ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను బహిష్కరించండి
– బీసీలపై విషం చిమ్మే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను భోగి మంటల్లో దహనం చేయాలి
– బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ పిలుపు
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, బీసీ నేత జంగా కృష్ణమూర్తి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత, కుల వివక్షపూరిత వైఖరిపై బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, రాష్ట్రంలోని కోట్లాది బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే దుర్మార్గపు చర్య అని ఆయన అభివర్ణించారు.
బోడె రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలపై చూపిస్తున్న కపట ప్రేమ మరోసారి బట్టబయలైంది. ఒక బీసీ నాయకుడు, మూడుసార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవజ్ఞుడు, జంగా కృష్ణమూర్తి, తిరుమలలో ఒక అతిథి గృహం నిర్మించి స్వామివారికి సేవ చేయాలనే సదుద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే, దశాబ్దాలుగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు, నిబంధనల ప్రకారం ఒక ట్రస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, టీటీడీ బోర్డు దానికి ఆమోదం తెలిపింది.
కానీ, ఆ ట్రస్ట్ ఒక బీసీ నాయకుడిదని తెలుసుకున్న చంద్రబాబు, తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నేరుగా రంగంలోకి దిగకుండా, తనకు అనుకూలంగా పనిచేసే ‘ఆంధ్రజ్యోతి’ వంటి పత్రికలను అడ్డం పెట్టుకుని, రెండు మూడు రోజులుగా విషపూరిత, తప్పుడు కథనాలను వండి వార్చారు. ఆ కథనాలను సాకుగా చూపి, అత్యంత దారుణంగా ఆ గెస్ట్ హౌస్ నిర్మాణ అనుమతులను రద్దు చేయించారు. ఈ కుట్ర వెనుక సూత్రధారి, పాత్రధారి అన్నీ చంద్రబాబే” అని ఆరోపించారు.
తిరుమల కొండపై ఎందరో అగ్రకుల పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా భూములు కట్టబెట్టినప్పుడు లేవని నోళ్లు, ఇప్పుడు ఒక బీసీ నాయకుడి విషయంలో ఎందుకు ఇంత విషం కక్కుతున్నాయి?” అని రామచంద్రయాదవ్ సూటిగా ప్రశ్నించారు.
“ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీ, బహుజన సోదరులందరికీ నేను ఒకటే పిలుపునిస్తున్నాను. బీసీలకు వ్యతిరేకంగా నిత్యం విషం చిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బహిష్కరించండి. రాబోయే భోగి పండుగ రోజున, ఆ పత్రికలను భోగి మంటల్లో వేసి దహనం చేసి, బీసీల ఐక్యతను, ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి,” అని బోడె రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు.
“చంద్రబాబు గారూ, ఇప్పటికైనా మీరు చేసిన తప్పును సరిదిద్దుకోండి. వెంటనే జంగా కృష్ణమూర్తి ట్రస్ట్‌కు గెస్ట్ హౌస్ నిర్మాణ అనుమతులను పునరుద్ధరించి, ఆయనను బోర్డు సభ్యుడిగా గౌరవంగా కొనసాగేలా చూడాలి.