– అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఏది పడితే అది చేసేయొచ్చా ?
– మనకి ఇలాంటి వాళ్ళు దొరికారు ఏం చేస్తాం?
– వీళ్ళని నమ్మి వాళ్ళ చేతుల్లో అధికారం పెడుతున్నాం
– వాళ్ళేమో అబద్ధాలు చెబుతున్నారు
– ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం 25 కోట్ల చెక్ ఇచ్చే దిక్కు లేదు
– మెఘా కృష్ణా రెడ్డి ఆగిపోయిన ప్రాజెక్టు రివైవ్ చేయడానికి అందరూ తయారయ్యారా?
– హరీష్‌గారూ.. మెఘా కృష్ణారెడ్డికి ఫోన్ చేసి కనుక్కోండి
– 750 కోట్లు తీసుకొచ్చి వా టిని డైరెక్ట్ గా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లించారు
– మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు తక్కువ పడితే.. ఎక్కడో చోట ఒక లిఫ్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది
– విభజన చట్టాన్ని ముందు తూట్లు పొడిచిందే కేసీఆర్
– నేను చెప్పాను..చంద్రబాబు ఆపారనటం ఏమిటి?
– రేవంత్ మాటలకు అర్ధం ఉందా?
– తాగే నీళ్ళ కోసం ఎవరైనా 50,000 80 వేల కోట్లు ఖర్చు పెడతారండి?
– రంగారెడ్డి ప్రాజెక్ట్ కు. ఎటువంటి అనుమతులు లేవు
– డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చిన జీఓ అనుమతి పత్రం కింద వస్తుందా?
– రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక ఇల్లీగల్ ప్రాజెక్టు
– మెఘా కృష్ణా రెడ్డికి డబ్బులు ఇవ్వడం కోసం కట్టిన ప్రాజెక్ట్ అది
– తెలంగాణ ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుదే
– మీరేమి అన్ని రాష్ట్రాలకి బాధ్యత పడే విశ్వ గురువులు కాదు
– మా వాదనపై రెండు రాష్టాల్లో ఎక్కడైనా చర్చకు సిద్దం
– టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి
– జగన్మోహన్ కి పిచ్చి ముదిరిపోయింది
– సాగునీటి ప్రాజెక్టులపై మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రెస్‌మీట్
విజయవాడ: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మెఘా కృష్ణారెడ్డి కంపెనీ ఎంత దోచుకుంటుందో, ఏ ముసుగులో వేల కోట్లు సంపాదిస్తుందో మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బట్టబయలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టు కేవలం మెఘా కృష్ణారెడ్డి కోసం రూపొందించిన ప్రాజెక్టు అని కుండబద్దలు కొట్టారు. గతంలో ఆయనకు ఆర్ధిక శాఖ నుంచి ప్రాజెక్టు నిధులు నేరుగా వస్తే, వాటిని ఎలక్టోరల్ బాండ్స్ పేరిట ఢిల్లీకి తరలించారన్నారు. మెఘా కృష్ణారెడ్డి కోసం ఏ ప్రభుత్వాలు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టబెట్టి, కమిషన్లు దండుకుంటున్నాయో బహిర్గతం చేశారు.
అనుమతి లేని తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుదేనని, సీఎంగా అది ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. మేం కట్టేవి మేం కట్టుకుంటాం. మీరు కట్టేది మీరు కట్టుకోండనడం సమంజసం కాదన్నారు. జగన్‌కు పిచ్చి ముదిరిపోయిందని మండిపడ్డారు. రాజకీయ నాయకులు సాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న దుష్ర్పచారాన్ని,.. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు నమ్మవద్దని, ప్రజల అమాయకత్వం-సెంటిమెంటును ఆసరా చేసుకుని రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు. తాను వెల్లడించిన అంశాలపై రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని సవాల్ చేశారు.
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆలోచనపరుల వేదిక ప్రతినిధులయిన రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, సాగునీటి రంగ విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ, రిటైర్డు ఇంజనీర్ కంభంపాటి పాపారావు, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, వ్యవసాయ ఆర్ధికవేత్త జొన్నలగడ్డ రామారావుతో కలసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారంటే…
అందరికీ నమస్కారం సాగునీటి రంగంలో ఏ ఏ ప్రాజెక్టులకి సుమారుగా ఎంతెంత డబ్బు అవసరం అవుతుందో మాకు తెలిసిన మేరకు గవర్నమెంట్ కి సూచించాం. మా దగ్గర ఉన్న లెక్కల కంటే ఖచ్చితమైన లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మేము సూత్రప్రాయంగా చెప్పేది ఏంటంటే.. ఏ ప్రాజెక్ట్ కి ముందు ఖర్చు పెడితే అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరు?
యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ పర్ ఏకర్ అనేదాన్ని లెక్కేసుకోండి. వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాంతాలతో సంబంధం లేదు. ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బు కాబట్టి, ఎక్కడ చౌకగా ఇంకొక ఎకరానికి అధనంగా నీళ్లు ఇవ్వగలమో, ముందు ఆ ప్రాజెక్టులు టేకప్ చేయండి అని చెప్పి సూచిస్తున్నాం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఇప్పటివరకు 10వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 3000 కోట్లు ఖర్చు పెడితే ఒకరెండు లక్షల ఎకరాలకి నీళ్ళ వస్తే, ఆ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంతైతే అవ్వబోతుందో, దాని బేసిస్ మీద ఎక్కడైతే మీకు లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఎక్కడైతే ఎక్కువ లాభం జరుగుతుందో.. ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందుతుందో, ఆ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇమ్మని చెప్పి కోరుతున్నాం.
ఈరోజున ఒక 10వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 5000 కోట్లు ఖర్చు పెట్టకపోతే, ఈ 10వేల కోట్ల మీద మనం కట్టే వడ్డీయే సంవత్సరానికి 1000 కోట్లు ఉంది. ఈ వడ్డీ అంతా నష్టమే కాబట్టి, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం.
ఈ సంవత్సరం మీరు బడ్జెట్ పెట్టబోతున్నారు. కిందటి సంవత్సరం బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు? ఏ ప్రాజెక్టు కి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు వివరాలు ఇవ్వండి. ఈ సంవత్సరం గంపగుత్తగా ఒక 15 వేల కోట్లు ఇరిగేషన్ అని చెప్పి ఏ ప్రాజెక్టు కి ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి. దాని ప్రోగ్రెస్ ఎలా ఉందో ప్రజలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ బడ్జెట్ తో పాటు 26, 27, 28 మూడు బడ్జెట్లు మీరు ప్రవేశపెట్టగలిగే అవకాశం ఉంది. మీ టర్మ్ లో 29 బడ్జెట్ ని వచ్చే ప్రభుత్వం అమలు చేయాలి కాబట్టి,, దాని మీద మీకు కంట్రోల్ ఉండదు. ఈ మూడు బడ్జెట్లలోనూ సుమారుగా మీరు ఇరిగేషన్ కి ఎంత ఖర్చు పెడతారో చూచాయిగా లెక్కేసుకుని, ఈ మూడు బడ్జెట్ల మీద కలిపి ప్లాన్ చేసుకోండి.
అందులో మొదటి సంవత్సరం ఇంత ఖర్చు పెడతాం గాలేరు నగరి ఉంది దానికి ఈరోజున ఒక 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు. సరే ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 1000 వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఒక 1000 ఆ తర్వాత బడ్జెట్లో 1000 అని వేసుకుంటారా ఆ మాటే చెప్పండి.
వచ్చే బడ్జెట్ కి ఏమన్నా ప్రాధాన్యతలో మార్పులు ఉంటే.. ఒక 100, 500 కోట్లు అటు ఇటు చేసుకోవచ్చు.. కానీ మూడు సంవత్సరాలకి సరిపడా ఇరిగేషన్ కి ప్లానింగ్ చేసి సూత్ర ప్రాయంగా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నారో అనేది ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దానివల్ల ఏ జిల్లా వాళ్ళు ఎక్కడ రైతులు అక్కడ, ఈ ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తి అవుతుందనే నమ్మకం వాళ్ళకి కలగజేయాల్సిన అవసరం ఉంది.
ఆ రకంగానే వాళ్ళు కూడా పంటల్ని మార్చుకోవడమో, లేకపోతే వాళ్ళ పొలాలను బాగు చేసుకోవడమో, చదువు చేసుకోవడమో అలాంటి పనులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావలసి ఉంది. అది ఇప్పటి వరకు ఎగ్గొట్టి పెట్టారు. కనీసం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో గాని, లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గాని ఎంత డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో చెప్పమనండి. దాన్ని కూడా ఇందులో భాగంగా చేసి ఈ ప్రాజెక్టులని ఈ బడ్జెట్లని రూపొందించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
గత 10 15 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా కాంట్రాక్టులు కోరుకునే చిన్న చిన్న ప్రాజెక్టులు ఇక్కడ ఒక లిఫ్ట్.. అక్కడ ఒక 10 కిలోమీటర్ల కాలవ.. అక్కడ ఒక 10 కిలోమీటర్ల కాలవ.. ఇక్కడ ఒక బ్రిడ్జ్.. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. అది దాని వల్ల పెట్టిన డబ్బు అంతా భూమిలోనే ఉండిపోతుంది.
తొవ్విన కాలవలు కూడా వాడకంలో లేక నిర్వహణ లేకపోతే.. అవి మళ్లీ పూడుకుపోయి వాటిని మళ్లీ బాగు చేయాలంటే నిజంగా నీళ్ళ వచ్చేనాడు మళ్లీ కాలవ తవ్వడానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు అవుతుంది. వెలిగొండలో చూసాం. ఆల్రెడీ తొవ్విన కాలవను బాగు చేయడానికి ఇప్పుడు నాలుగు 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దాని మీద పిచ్చి మొక్కలు మొలిచి ఎరోజన్ అయిపోయి వర్షాలకి గట్లు కొట్టుకుపోయి ఇదంతా జరిగింది.
ముక్కలు ముక్కలుగా చేయడం వల్ల కాంట్రాక్టర్లు బాగుపడటం.. మీరు బాగుపడటమే తప్ప, ప్రజలకి ఒక్క పైసా కూడా దాని వల్ల ఉపయోగం లేదు అని చెప్పి మళ్లీ గుర్తు చేస్తున్నాం. ఇదంతా ప్రజల డబ్బు బాబు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ మధ్యన మీరందరూ చూస్తున్నారు. కొన్ని విఫల ప్రభుత్వాలు, విఫల పార్టీలు విఫల నాయకులు వాళ్ళ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి, కొత్తగా ఈ డైవర్షన్ రాజకీయాలు మొదలపెట్టారు.
అంటే ప్రజల దృష్టిని మళ్ళించడం. అసలు విషయం వేరే ఉంటుంది. నాలుగు అబద్ధాలు చెప్పి వీళ్ళు ఒక నాలుగు రాళ్ళు వేయటం, దాని మీద అవతల వైపు వాళ్ళు ఇంకొక నాలుగు రాళ్ళు వేయటం, అసలు విషయాలన్నీ ప్రజల దృష్టికి రాకుండా మభ్య పెట్టే రాజకీయ ఎత్తుగడ తప్ప.. ఇందులో ప్రజల ప్రయోజనం ఏమాత్రం లేదు.
మేము క్షేత్ర స్థాయిలో పర్యటించి, అధ్యయనం చేసి చాలామంది నిపుణలతో మాట్లాడి, బాధ్యతగా చెబుతున్న మాట ఆంధ్ర- తెలంగాణ ప్రజల్ని ప్రజల్ని నేను కోరేది.. మీ నాయకులు చెప్పే అబద్ధాల్ని పక్కన పెట్టి, మీ పార్టీ అభిమానాలని పక్కన పెట్టి.. మీ ప్రిజుడిసులని పక్కన పెట్టి , మనుషులు మనుషుల్లాగా ఆలోచించండి. ఏది నిజమో ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే నాయకులు చెప్పిన మాటలు విని అదే నిజమని భ్రమిస్తే, మనం కూడా తప్పుదారిని పట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజల కూ కొంత బాధ్యత ఉంది ముఖ్యంగా ఆవేశాలకి ఎమోషన్స్ కి సెంటిమెంట్స్ కి లోను కాకుండా వాస్తవాలు గుర్తించమని కోరుతున్నాం. కృష్ణా నది మీద ఉన్న నీళ్లు ఎంతైతే ఉన్నాయో.. వాటి మీద హక్కులు ఏ రాష్ట్రానికి, ఏ మేరకు ఉంటాయో అనేది బచావత్ ట్రిబ్యునల్ 1976 లోనే ఫైనలైజ్ చేసి చెప్పింది.
బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. ఇదిగో ఆ బచావ్ ట్రిబ్యునల్ ఫైనల్ ఆర్డర్ . దాన్ని ఎవరు మార్చలేరు. అది శాసనం. దాని ప్రకారం ప్రాజెక్టుల వారీగాను వినియోగం వారీగాను, తెలంగాణకి ఆంధ్రాకి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసిలు వస్తాయి అని చెప్పారు. ఆ 811 టీఎంసిలని పునర్విభజన జరిగిననాడు.. ఆంధ్రప్రదేశ్ విడిపోయిననాడు, ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం లెక్కలేసి చట్టంలోనే పొందుపరిచింది.
దాని ప్రకారం కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చినట్టుగా ఆ చట్టం పేర్కొంది. వాటి ప్రకారం చూస్తే తెలంగాణకి- ఆంధ్రాకి మధ్యన, ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు వస్తాయని చెప్పి తేల్చింది.. దీని మీద 2015 లో రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు కేసిఆర్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూర్చుని అపెక్స్ కౌన్సిల్లో 512 ఆంధ్రాకి , 299 తెలంగాణకి అన్నట్లుగా ప్రాజెక్టుల వారీగా ఎంత నీటికి ఎన్ని నీళ్లు వాడుకోవచ్చో సంతకాలు పెట్టారు.
ఆ పొజిషన్ లో ఎవరున్నా గాని సంతకం పెట్టాల్సిందే. ఎందుకంటే పునర్విభజన చట్టం కూడా అదే చెప్తాంది కాబట్టి సంతకాలు పెట్టారు. కాబట్టి ఈ రోజుకి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచుకునే నీటి నిష్పత్తి 512 299. దీన్ని ప్రస్తుతానికి ఎవరు మార్చలేరు ఆ విషయం రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ముందు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.
ఇకపోతే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది గాని.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాసి ఉన్న దాన్ని బట్టి గాని.. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు అప్పటికి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. పూర్తి కాలాల ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్టులని పునర్విభజన చట్టం ఇవి. ఇవి చట్టబద్ధమైన ప్రాజెక్టులే వీటిని కంటిన్యూ చేసుకోండి అన్నారు.
ఏంటయ్యా ఆ ప్రాజెక్టులు అంటే భీమా ఎత్తిపోతలు, నెట్టెంపాడు భీమా అప్పటికి అయిపోయింది. అసలు అప్పటికి దాదాపుగా పూర్తి అయిపోయింది. దాని గురించి అసలు డిస్ప్యూట్ లేదు. చట్టంలో మాట్లాడింది కేవలం రెండే ప్రాజెక్టులు.. తెలంగాణ వైపున నెట్టెంపాడు, కల్వకుర్తి ఫేజ్ వన్ ఈ రెండు ప్రాజెక్టులు. మీరు కంటిన్యూ చేసుకోండయ్యా.
పూర్తి చేశారా నెట్టెంపాడు? కల్వకుర్తి వేటికైతే అనుమతులు ఉన్నాయో వాటిని పూర్తి చేశారా లేదా? పొలాలకు నీళ్ళ ఇచ్చారా? ఈ విషయం తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించి వాళ్ళ నాయకుల అడగాలి. ఏమయ్యా నెట్ ఇంపార్టలో మాకు నీళ్ళు ఇచ్చావా? పొలాలకు పంటకాలం వేసావా? మాకు నీళ్ళ వస్తున్నాయా? అవి వాడుకుంటున్నావా? నీకు అన్ని అనుమతులు ఉన్నాయిగా అది ఎందుకు చేయు అని ముందు మీరు వాళ్ళని ఆ మాట అడగాలి.
అలాగే ఆంధ్రప్రదేశ్ వైపున తెలుగుగంగ -గాలేరు- నగరి- హంద్రీనీవా- వెలిగొండ ఈ నాలుగు ప్రాజెక్టుల్ని విభజన చట్టంలో వీటిని కంటిన్యూ చేసుకోండి అన్నారు. కాబట్టి వీటి గురించి ఏం డిస్ప్యూట్ లేదు. వాటిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కుంటిని అడగనో, నత్తని అడగనో కంటిన్యూ చేస్తా ఉంది.
ఇవి అనుమతులు ఉన్న ప్రాజెక్టు వీటిని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేన్ని పూర్తి స్థాయికి తీసుకుపోలా. తెలుగు గంగలో ఆయన చెప్పినట్టుగా ఇప్పటికీ బ్రహ్మంగారి మఠం కింద పంటకాలం లేవు. బ్రహ్మంగారి మఠం నింపింది లేదు. వెలుగొండ ప్రాజెక్టు ఇంకా సొరంగాలు తొవ్వే పనిలోనే ఉండం. గాలేరు – నగరికి గండికోట నింపి అది పర్యావరణానికి, చేపలు పట్టుకోవడానికి మాత్రమే పనికొస్తది. ఇదేంటి టూరిజం కి టూరిజం కి చేపలు పట్టుకోవడానికే పనికవచ్చేలాగా చేశారు.? హంద్రీ- నీవా కాల్వ ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా చేసుకుంటా, దానికి లైనింగ్ కూడా ముక్కలు ముక్కలుగా వేసుకుంటా.. ఇదిగో ఫలానా చెరువు.. ఈ సంవత్సరం నింపావు. ఫలానా చెరువు ఈ సంవత్సరం నింపామ అంటున్నారే తప్ప , మొదటినుంచి లైనింగ్ వేసుకుంటూ ఆ నీళ్ళు క్యారీయింగ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తూ ఇవ్వాల్సిన చోటల్లా, చెరువులకు కనెక్షన్లు ఇచ్చుకుంటూ కొన్ని బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి.
అంటే మెయిన్ కాలం ఇట్ట పోతుంటే.. బ్రాంచ్ కాలం ఒక 10 కిలోమీటర్లు తొవ్వితే గాని ఆ చెరువు రాదు. ఆ బ్రాంచ్ కాలం తవ్వరు. సో.. ఇట్లా ముక్కలు ముక్కలుగా ఆ కాంట్రాక్టర్ కి ఒక 100 కోట్ల పని… ఈ కాంట్రాక్టర్ కి ఒక 300 కోట్ల పని ఇచ్చుకుంటా వస్తున్నారు. సరే ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనితీరు అనుకోండి. కాబట్టి అనుమతులు ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఇది.
అనుమతులు లేని ప్రాజెక్టులు ఏంటయ్యా అంటే.. తెలంగాణ వైపున మొట్టమొదటగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ . దానికి ఎటువంటి అనుమతులు లేవు. ఎవరికన్నా తెలంగాణ వాళ్ళకి సెంటిమెంట్ దెబ్బ తినొచ్చు. కానీ వాస్తవం ఇది. గుర్తుపెట్టుకోండి దానికి అనుమతులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఉన్నాయి అని చెప్పి, కొంతమంది నమ్మబలుతున్నారు. అది అబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిందల్లా ఏంటయ్యా అంటే.. పాలమూరు రంగారెడ్డి ఫీజిబిలిటీ పరిశీలించి.. ఇది కట్టొచ్చా లేదా? ఎట్లా కట్టాలి? ఎంత ఖర్చు అవుతుంది అని డిపిఆర్ తయారు చేయడానికి ఒక జీఓ ఇచ్చుకున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు- రంగారెడ్డికి, అది కూడా ఎక్కడి నుంచి.. జూరాల బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టడానికి డిపిఆర్ తయారు చేయమని జీఓ ఇచ్చారు. డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చిన జీఓ ఎప్పుడైనా అనుమతి పత్రం కింద వస్తుందా ఆలోచించండి ప్రజలుగా ఆలోచించండి. నాయకులు ఎన్నైనా చెప్తారు. అది అనుమతి ఎలా అవుద్ది ?
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పాలమూరు- రంగారెడ్డి అనే ప్రాజెక్ట్ ని జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కట్టడానికి కేసిఆర్ డిసైడ్ చేశారు. ఏ బేసిస్ మీద డిసైడ్ చేశారు? ఏ అనుమతులు ఉన్నాయని డిసైడ్ చేశారు? అప్పటికే విభజన చట్టం ఉంది. అరే బాబు విభజన చట్టంలో లేని ప్రాజెక్టులు ఏవైనా కట్టాల్సి వస్తే, అపెక్స్ కౌన్సిల్ లో కూర్చుని మాట్లాడుకొని ఒప్పందానికి వచ్చి మాత్రమే కట్టాలి అని క్లియర్ గా ఉంది. విభజన చట్టాన్ని ముందు తూట్లు పొడిచిందే కేసీఆర్. పాలమూరు- రంగారెడ్డి జూరాల నుంచి ఉండాల్సిన ప్రాజెక్టుని తీసుకొచ్చి, శ్రీశైలంలో పెట్టారు. అనుమతులు లేవు. పెట్టి ఊరుకున్నారా? 34వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పటికి ఇదంతా తెలంగాణ ప్రజల డబ్బు.
అందుకనే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దాన్ని పూర్తి చేయడానికి ఇంకొక 50 వేల కోట్లు కావాలంటున్నారు. అది ఒక మినీ కాళేశ్వరం. సరే దాని మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద, తెలంగాణ వైపు నుంచి కొంతమంది.. ఆంధ్ర వైపు నుంచి కొంతమంది ఎన్జీటీలో కేసులు వేశారు. కేసులు వేస్తే మీకు అనుమతులు లేకుండా ఎట్ట కడుతున్నారయ్యా అని చెప్పి, ఎన్జీటి స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడమే కాదు సుమారు 920 కోట్ల రూపాయల జరిమానా వేసింది
తెలంగాణ ప్రభుత్వం మీద దీని మీద తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు వాళ్ళు మేమేమి మార్చం. ఎన్జీటీ చేసింది కరెక్టే అని చెప్పారు. దాని మీద సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టు కి వెళ్ళినప్పుడు వాళ్ళు అఫిడవిట్ లో ఏం చెప్పారంటే.. అయ్యా మేము తాగునీటి కోసం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. మంచి నీళ్ల కోసం కట్టుకుంటున్నాం. కాబట్టి ఆపకండి అని వెళ్ళారు
సుప్రీం కోర్టు… అరే ఇది తాగునీటి కోసం కాదయ్యా.. పన్నెండున్నర లక్షల ఎకరాలు సాగునీటి కోసం చేస్తున్నారు అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు కి చెప్పాలా? ఏం చెప్పలా! ఊరికే ఇంప్లీడ్ అయి కూర్చున్నారు తప్ప, ఎటువంటి వాదనలు వినిపించ లా! దాంతో సుప్రీంకోర్టుకి ఒక పక్షమే చెప్పే వాదనలు అవతలాడు ఏం మాట్లాడటంలా. వాళ్ళు ఏం చేస్తారు?
ఆ ఎన్జీటీ చేసిన 920 కోట్ల ఫైన్ ని 500 కోట్లు ఏదో మాఫీ చేసి, ఏ రిజర్వ్ ఫారెస్ట్ లో కడితే ఖబర్దార్. రిజర్వ్ ఫారెస్ట్ ముట్టుకో మాకండి. మీకు అనుమతులు లేవు అని చెబుతూ.. సరే తాగడానికి నీళ్ళ అంటున్నారు కాబట్టి.. ఒక ఏడు టీఎంసిలకి సరిపడా పని చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. అది కూడా తుది తీర్పుకు లోబడి అని చెప్తూ, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడండి ఇచ్చింది? ఇది 2023 లో. గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి! జగన్మోహన్ రెడ్డి కి తెలియదా… కృష్ణా నీళ్ళు 800 అడుగుల నుంచి తీసుకుపోతున్నారు అంటే, ఆ ప్రాజెక్ట్ ని సుప్రీం కోర్టులో గట్టిగా వాదించి, ఆపాల్సిన బాధ్యత ఆయనకి లేదా? స్టే తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఏమి చేయలా! ఆయనకు ఏ ప్రభావాలు పని చేసినయో.. ఏ స్నేహాలు పని చేసినాయో.. ఏ ఆర్థిక ప్రయోజనాలు పనిచేసినాయో మనకు తెలియదు.
కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న టైంలో తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం అని మభ్య పెట్టి, సుప్రీం కోర్టు నుంచి పనులు కంటిన్యూ చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకుంది. అట్లాగే డబ్బులు తగలబెడతా వచ్చారు. 35,000 కోట్లు అయింది ఇప్పటికి ఇంకొక 50,000 కోట్లు అంటున్నారు.
ఇదే తెలంగాణ ప్రభుత్వం.. మొన్న రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి వనల మంత్రి దగ్గరికి వెళ్లి.. అయ్యా .. మా పాలమూరు- రంగారెడ్డికి శాంక్షన్ ఇవ్వండి. పన్నెండున్నర లక్షల ఎకరాలు నల్లగొండ- ఉమ్మడి మహబూబ్ నగర్- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండించుకోవడానికి కావాలి. రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కుంటున్నారు. కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి రాతపూర్వకంగా ఆయన అప్లికేషన్ పెట్టాడు
సుప్రీం కోర్టులోనేమో… తాగు నీళ్లకని చెప్తాం. 35 వేల కోట్లు ఖర్చు పెడతాం. మళ్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి, పన్నెండున్నర లక్షల ఎకరాలు మాడిపోతున్నాయండి. మాకు సాగు నీళ్లు కావాలంటారు. ఇది ప్రభుత్వాలు చేసే పనులు. ప్రజలుగా మనం గుర్తిద్దాం. తాగే నీళ్ళ కోసం ఎవరైనా 50,000 80 వేల కోట్లు ఖర్చు పెడతారండి?
ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ కు నీళ్ళ కోసం రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అటు గోదావరి నుంచి ఉన్నాయి. ఇటు కృష్ణా నుంచి రెండు ప్రాజెక్టులు. ఏం తక్కువ వచ్చింది మళ్లీ? హైదరాబాద్ కు నీళ్ల కరువు ఎక్కడ వచ్చింది? కాబట్టి ఇది పాలమూరు రంగారెడ్డి, ఇంకొక ప్రాజెక్టు డిండి. కూడా అనుమతులు లేని ప్రాజెక్ట్ . కల్వకుర్తిని ఫేస్ట అని చెప్పి, ఇంకొక 15 టీఎంసిలు ఎత్తిపోసుకోవడానికి ఆ పనులు కూడా మొదలుపెట్టారు. దానికి కూడా అనుమతులు లేవు. ఈ మూడు నాలుగు అనుమతులు లేని ప్రాజెక్టులు తెలంగాణ వైపు మొదలుపెట్టారు.
కేసిఆర్ టైం నుంచే మొద లు పెట్టారు. ఆ డబ్బు అంతా తగలబెట్టారు. ఈరోజు కృష్ణా నది నీళ్ల మీద ఆధారపడి, 32 లక్షల ఎకరాలకి మేము నీళ్ళ ఇస్తామని చెప్పి, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టినాయి. డబ్బులు అయిపోయినాయి. డబ్బులు ఖర్చు పెట్టారు. ఎవరికి వెళ్లాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఈరోజు తెలంగాణలో కృష్ణా నది మీద ఆధారపడి, ఎన్ని ఎకరాలకు నీళ్ళ ఇస్తున్నారండి? అడగమనండి!
ప్రజల్ని ఏ సంవత్సరంలోనూ 10- 12 లక్షల ఎకరాలకు మించి నీళ్ళ ఇవ్వలా! ఎక్కడ 32? ఎక్కడ 10 – 12 ? అందుకనే మీ 299 టీఎంసిల అనుమతులున్న ప్రాజెక్టులని, ముందు పూర్తి స్థాయిలో వినియోగించుకోమని చెప్పండి. అనుమతులు లేని ప్రాజెక్టులకి.. నిజంగానే ప్రాణం మీదకు వస్తే, అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ లో కూర్చుని మాట్లాడుకోండి. అంతేగాని అనుమతులు లేని ప్రాజెక్టులు చేసుకుంటా. ఇల్లీగల్ ప్రాజెక్టులు చేసుకుంటా. వాడు ఆపాడు. వీడు ఆపాడు అని చెప్పి, ఎందుకు ఈ బురదలు చల్లుకోవడం? ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా దీంతో?
ఇప్పుడు ఆంధ్ర వైపుకు వద్దాం. తెలంగాణలో ఈ మూడు, నాలుగు అనుమతులు లేని ప్రాజెక్టులు ఉంటే.. ఆంధ్ర వైపున ఉన్న ఒకే ఒక ఇల్లీగల్ ప్రాజెక్టు, అనుమతులు లేని ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుమతి తీసుకోలా. 2020 లో జీఓ ఇచ్చేసాడు. 3850 కోట్ల రూపాయల జీఓ అది. చివరికి వచ్చేసరికి ఆ డీవియేషన్స్ అన్ని కలిపి 4000- 5000 అయ్యేది.
మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా గాని.. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు తక్కువ పడితే, ఎక్కడో చోట ఒక లిఫ్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది ఈ రాష్ట్రాల్లో. ఆ రోజున కాళేశ్వరంలో లిఫ్ట్లు ఆయనే కట్టింది. పాలమూరు- రంగారెడ్డిలో లిఫ్ట్లు ఆయనే కట్టింది. నెట్టెంపాడు లిఫ్ట్లు ఆయనే కట్టింది. . ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత, 2020 లో ఏం పనులు లేవేమో.. మిషన్లు ఖాళీగా ఉన్నాయేమో .. వచ్చి జగన్మోహన్ రెడ్డిని అడిగారు.
నాకు రెండు లిఫ్ట్ ప్రాజెక్టులు ఇవ్వమని! ఒకటి పోలవరం గర్భంలో 35 మీటర్ల నుంచి ఒక లిఫ్ట్. దానికి ఒక 1000 కోట్లు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే పేరు మీద ఇంకొక 4000 కోట్లు. మొత్తం 5000 కోట్లు లిఫ్ట్ ప్రాజెక్టులు ఆయనకి రాసి, ఈ ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి జీఓ ఇచ్చిన మరుక్షణం.. మేమనగర్ జిల్లా ఆయన ఎన్జీటీ లో కేసేసాడు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయింది.
ఎన్జీటీ స్టే అంది. స్టే అంటే.. స్టే ఇవ్వకండి. మేము డిపిఆర్ తయారు చేసుకోవడానికి ఏదో అక్కడ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న గోతులు తొవ్వి ఇన్వెస్టిగేషన్ కోసం గోతులు తొవ్వుకుంటున్నాం. అంతే తప్ప మేము పనులు ఏం చేయట్లేదు. కాబట్టి స్టే తీసేయండి అన్నారు.
సరే డిపిఆర్ కోసం అంటున్నావు కాబట్టి, అంతవరకే పరిమితమై ఉండాలి. అబ్బాయ్,, నువ్వు ప్రాజెక్ట్ ఏం మొదలెట్టొద్దు అని చెప్పి, ఎన్జీటీ కొంచెం సడలింపు ఇచ్చింది. సడలింపు ఇచ్చిందే తరువాయి పనులు మొదలుపెట్టారు. మొత్తం కంచె వేసేసారు. ఫెన్సింగ్ వేసేసారు ఇప్పుడు కాలం తొవ్వినప్పుడు మట్టి వస్తుందిగా ? మట్టిని బయటికి తీసుకురావాలిగా ? దానికి లారీలు వస్తాయిగా? లారీ డ్రైవర్ల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసి పెట్టుకునే వాళ్ళు.
వాడు ఫోటోలు ఎక్కడ తీస్తాడు అని. అంత సీక్రెట్ గా అంటే.. రిషికొండ ప్యాలెస్ లో ఎట్టా కట్టారో అంత సీక్రెట్ గా! ఇక్కడ కూడా ఎవ్వడిని వెళ్ళనీయకుండా, సీక్రెట్ గా ఒక కందకం. ఆ కందకం చివరిలో ఒక బావి లాంటి గొయ్యి. అంతవరకు పనులు చేసేసుకుంటా పోయారు. మొత్తానికి పిటిషన్ వేసినవాళ్ళ ఎవరో గాని, ఆ ఫోటోలు వెనక నుంచి తీశారో ఎక్కడి నుంచి తీశారో, తీసి మళ్ళీ ఎన్జీటీ కి ఇచ్చారు.
ఎన్జీటీ కి ఇస్తే ఎన్జీటి కోపానికి వచ్చి ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? అని చెప్పి మళ్లీ స్టేట్ గవర్నమెంట్ ని నిలదీస్తే, నీళ్లు నమిలారు. ఎన్జీటీ వీళ్ళ మాటలు నమ్మకుండా.. ఒక కమిటీ వేసి, క్షేత్ర స్థాయిలో చూసి రండి అన్నారు. వాళ్ళు వెళ్లి ఎట్లా ఉన్నది అట్లా, వాస్తవ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చేసరికి ఎన్జీటే కి మండింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఫైన్ వేసింది. పనులు ఇమ్మీడియట్ గా నిలుపు చేయమని చెప్పి స్టే ఇచ్చింది.
ఎన్జీటీ వాళ్ళు ఏం చెప్పారంటే.. సరే మీరు పనులు చేయట్లేదు అంటున్నా రు. కమిటీ ఏమో పనులు జరిగాయి. జరుగుతున్నాయి అని చెప్పారు. చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో నువ్వు అఫిడవిట్ ఇవ్వు అన్నారు. నువ్వు రాతపూర్వకంగా రాసివ్వు జరగట్లేదని రాసివ్వు అని చీఫ్ ఇంజనీర్ రాసిస్తే… ఆయన ఉద్యోగం పోవడమే కాదు జైలుకి పోతాడు కాబట్టి, చీఫ్ ఇంజనీర్ చేతులు ఎత్తిసినాడు. నా వల్ల కాదు ఈ అబద్ధాలు రాయడం అని! ఆ పరిస్థితుల్లో చచ్చినట్టుగా ఆ ఆర్ఎల్ఐఎస్ పనులు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది 2022- 23 సంవత్సరాల్లో.
తమాషా పనులు ఆఫ్ చేసేసారు. ఏం చేశారయ్యా అప్పటి వరకు అంటే.. నదిలో నుంచి పెద్ద కాలం ఒక కందకం లాగా కొట్టుకొచ్చి, దాని చివరిలో ఒక బావిలాగా తయారు చేసి, అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి మోటార్లు పెట్టడానికి రెడీ అయ్యారు. ఆ ఆ స్టేజ్ లో పనులు ఆగిపోయాయి. అప్పటివరకు చేసిన పనులకి డబ్బులు లెక్క మెగా ఇంజనీరింగ్ కంపెనీ కదా? వెంటనే బిల్లులు అయిపోతాయి.
వెంటనే బిల్లులు తయారు చేసి 750 కోట్ల రూపాయలు అన్నారు. కానీ యాక్చువల్ గా 950 కోట్ల రూపాయలు బిల్లులు కట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయా డబ్బులు? దీనికంటే 750 కోట్ల రూపాయలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పి ఆర్ఈసి అని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు బోలెడు మూలుగుతుంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్లకు అప్పులు ఇస్తా ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు.
750 కోట్లు తీసుకొచ్చి వా టిని గవర్నమెంట్ ట్రెజరీలో కూడా వేయకుండా, డైరెక్ట్ గా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లించారు. ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఎలక్టోరల్ బాండ్స్ వెళ్తాయి అనుకోండి. అది వేరే విషయం.
చెప్పేది ఏంటంటే.. ఇదంతా ప్రజల డబ్బు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల ఇవాళ దాదాపు 1000 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే పేరు మీద, ఇంకొక 200 కోట్లు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో నుంచి ఇచ్చారు. . పులివెందుల్లో చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి ఈ దగ్గర డబ్బులు ఉండవు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కట్టడానికి డబ్బులు ఉండవు ఫీజు రీఇంబర్స్మెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు
మెగా ఇంజనీరింగ్ బిల్లు ఉంటే మాత్రం ఎక్కడ లేని డబ్బు వచ్చి పడతది. .అసలు ఈయన ఇచ్చేది ఏంటి? ఆయనే హుండీలో చెయ్యి పెట్టి తీసుకుంటాడు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఏం పెద్ద డిఫరెంట్ కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి.. పోలవరం మీద 1000 కోట్లు లిఫ్ట్ ఏంటయ్యా అంటే.. దానికోసం వేరే పనిలో సొరంగం పెద్దది చేసి, అందులో కొంత డబ్బు తగలబెట్టారు.
ఆ పోలవరం లిఫ్ట్ కి కూడా కొంత డబ్బులు తగలబెట్టారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఆయన చేసిన వృధా ఖర్చు. రాయలసీమ లిఫ్ట్ వద్దకు మేము వెళ్ళాం. వెళ్లి రాయలసీమలో ప్రజా సంఘాలతో కూడా మాట్లాడాం. రాయలసీమ లిఫ్ట్ వల్ల ఏమిటయ్యా కొత్త ప్రయోజనం అంటే.. ఉన్న రాయలసీమకి అనుమతులు ఉన్న ప్రాజెక్టులని స్టెబిలైజ్ చేయడానికి ఈయన లిఫ్ట్ కడతాడంట! అసలు ప్రాజెక్ట్ ముందు కట్టడు. అనుమతులు ఉన్న ప్రాజెక్టు ముందు కట్టడు. దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మెగా ఇంజినీరింగ్ తో లిఫ్ట్ ఒకటి కడతాడంట. ఏమన్నా అర్థం ఉందా? ఎవడి సొమ్ము అనుకుంటున్నారు ఇదంతా?
అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఏది పెడితే అది చేసేయొచ్చా ? మా డబ్బుతో ఇదే జగన్మోహన్ రెడ్డి, సొంత జిల్లా కడపలో గండికోట నుంచి 250 కిలోమీటర్లు కడప జిల్లాలో పారాలి కోడూరు దాటిందాకా గాలేరు- నగరి ప్రధాన కాలవ అది. జగన్మోహన్ రెడ్డి రాకముందే 50 కిలోమీటర్లు- 66 కిలోమీటర్ల కాలం అయిపోయింది. ఇంకో 200 కిలోమీటర్ల కాలం ఉంది.. అక్కడ లిఫ్ట్ అక్కర్లా? . కరెంట్ అక్కర్లా? మోటార్లు అక్కర్లా. ఖర్చు లేదు.
గ్రావిటీతో నీళ్లు పారుతాయి. గండికోట నుంచి గ్రావిటీతో నీళ్లు పారే కాలవని ప్రధాన కాలంని ఆయన జిల్లాలో కాలవని 200 కిలోమీటర్లో ఒక్క కిలోమీటర్ కూడా ఈయన కట్టల! ఒక్క కిలోమీటర్ కూడా ఈయన కాలవ తవ్వల! ఆయన సొంత జిల్లాలో అప్పటికే తొవ్విన కాలవ మీద ఓ 300 కోట్లు పెట్టి లైనింగ్ పనులు చేపిస్తాడు.
ఎందుకంటే లైనింగ్ లో డబ్బులు ఎక్కువ మిగులుతాయి. . ఆయన హయాంలో కడప జిల్లా గాలేరు- నగరి మీద ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు. అది కూడా అప్పటికే తొవ్విన కాలవ మీద లైనింగ్ పనులకే . ఇది కాదని చెప్పమనండి. ఇవాళ కడప జిల్లాలో వైసిపి మాజీ ఎమ్మెల్యేలు అందరూ ధర్నాలు చేస్తారంట. 200 కిలోమీటర్లు మెయిన్ కాలం పెండింగ్ ఉంది కదా? అది ఎందుకు చేయవు అని చెప్పి, ఆ రోజున అడిగారా?
మీరు ఇవాళ వచ్చి మెఘా కృష్ణా రెడ్డి ఆగిపోయిన ప్రాజెక్టు రివైవ్ చేయడానికి అందరూ తయారయ్యారా? మొగమేరు వాగు మీద 300 కోట్లు పెడితే గానీ బ్రిడ్జ్ యక్విడిక్ట్ కాదు. ఇప్పుడు ఉన్న కాలం 66 కిలోమీటర్ల కాలం ఉపయోగించుకోవాలన్నా.. మొగమేరు యక్వడక్ట్ కావాలి. అది చేయరు. కాలం ముందుకు తీసుకెళ్లరు . ఈ 4వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే… నీ దగ్గర 4వేల కోట్లు ఉన్నాయనిే కదా ప్రాజెక్ట్ ఇచ్చావు మెగాకి? ఆ 4వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే కడప జిల్లాలో గాలేరు- నగరి ప్రాజెక్ట్ మొత్తం అయిపోయేది. కడప జిల్లా దాటి వెళ్ళిపోయేది.
ఈరోజున 25 కోట్ల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం కట్టాల్సి వస్తే.. ఇవ్వాల్టికి కూడా 25 కోట్ల చెక్ ఇచ్చే దిక్కు లేదు. ఇంకొక స్ట్రెచ్ లో ఒక 65 కోట్లు. ఇంకొక స్ట్రెచ్ లో ఒక 88 కోట్లు ఫారెస్ట్ క్లియరెన్స్ లు ఆగిపోయి ఉన్నాయి.. దాని డబ్బు కట్టరు. మెగా ఇంజనీరింగ్ కు ఇంకొక ప్రాజెక్ట్ ఇవ్వటం. ఉన్న డబ్బు అంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం. మళ్లా ఎవరిని లిఫ్ట్ చేస్తున్నారండి మీరు? ఎవరికోసం ఈ లిఫ్ట్? ఇది ప్రజలు ఆలోచించుకోవాలని చెప్తున్నాం.
తెలంగాణ ప్రజలు- ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఎవ్వరం వీళ్ళ మాటలు నమ్మి, చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఆవేశ పడాల్సిన అవసరం లేదు. అడగాల్సిన ప్రశ్నని సూటిగా అడుగుదాం. నేను చెప్పేది అదే. నువ్వు వచ్చే మూడేళ్లల్లో ఈ ప్రాజెక్టుని ఎంతవరకు తీసుకెళ్తావో చెప్పు? ఎంత డబ్బు ఖర్చు పెడతావో చెప్పు? మొదటి సంవత్సరం ఎంత? రెండోది ఎంత? మూడోది ఎంత అది చెప్పు. దాని ప్రకారం నువ్వు చేస్తున్నావో లేదో.. మళ్ళా వచ్చే బడ్జెట్ నాడు సమాధానం చెప్పు!
ఎందుకంటే మా డబ్బులయ్యా ఇవన్నీ! మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినోడికి లిఫ్ట్ ప్రాజెక్టులు ఇచ్చుకోవడానికి.. మీకు నచ్చినోడికి బిల్లులు ఇచ్చుకోవడానికి కాదు. ఈ రాయలసీమ ఆఫ్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలు అయితే.. ఇవాళ రేవంత రెడ్డి వచ్చి.. నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఆఫ్ చేశారు అని చెప్పటం ఏంటి? ఇందులో ఏమన్నా అర్థం ఉందా? ఆయన చెప్పిన మాటల్లో ఇందులో ఏమన్నా వాస్తవం ఉండే అవకాశం ఉందా? మీరే ఆలోచించండి ఆయన పొరపాటున మాట తూలి అన్నారో.. ఎట్లా అన్నారో మనకు తెలియదు. ఒకవేళ పొరపాటున మాట అంటే, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఆయనది. లేదయ్యా నేను పొరపాటు పడ్డాను. నా మైండ్ లో ఏదో ఉంది. ఏదో చెప్పాను. ఎవరైనా అధికారులు ఎవరైనా ఆయనకి తప్పుడు సమాచారం ఇస్తే, ఆ అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే.
రేవంత రెడ్డి కి ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాటలకు విశ్వసనీయత ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఇవ్వాళ రేవంత రెడ్డి మీరు ఒక్క అడుగు వేస్తే, మేము 10 అడుగులు వేస్తాం అంటున్నారు. మీరు 10 అడుగులు కూడా వేయక్కర్లే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్క అడుగు వేయమనండి. మీరు ఒక్క అడుగు వేయండి.
ఆ ఒక్క అడుగు ఏంటంటే ఇద్దరూ కలిసి.. కృష్ణా నీటి యాజమాన్యాన్ని రెండు రాష్ట్రాల మధ్య మధ్యన.. అది కేఆర్ఎంబి ఇస్ ఓన్లీ స్పెసిఫిక్ టు తెలంగాణ అండ్ ఆంధ్ర పైనన్న మహారాష్ట్ర కర్ణాటకకి అది అమలు కాదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాద రాకుండా కేఆర్ఎంబి విభజన చట్టంలో పెట్టింది.. కేఆర్ఎంబి కి అప్ప చెప్పేయండి. రెండు రాష్ట్రాలు గొడవలు లేకుండా ఉంటాయి.
ఆంధ్ర వైపు నుంచి మేము అప్ప చెప్పడానికి సిద్ధమే అని చెప్పి, నేను విన్నా తెలంగాణ వైపు నుంచే అభ్యంతరాలు వస్తున్నాయి. వాళ్ళు మేము అప్ప చెప్పమంటున్నారు అన్నాడు. . రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయక్కర్లే. కేఆర్ఎంబికి అప్ప చెప్పండి అనుమతులు ఉన్న ప్రాజెక్టుల మేరకు వాళ్ళు ఎవ్వరూ అడ్డు పెట్టరు. మీరు వాడుకోగలినన్ని వాడుకోండి. మీరు పంటకాలం దొవ్వుకుంటాంటే , వాళ్ళేమో అడ్డు పెట్టరు. ఈ పంచాయతీలు ఉండవు. మీకు ఇంకేమైనా వేరే ప్రాజెక్టులకి అనుమతులు కావాలంటే, ఎపెక్స్ కౌన్సిల్ లో పెట్టుకోండి.
ఇది ఒక్కటే మార్గం తప్ప.. దీనికి భిన్నంగా ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్పినా గాని, ప్రజలు మీరు విని నమ్మి మోసపోవద్దు. నేను ప్రజల గురించి ప్రజల ఉద్దేశించి చెప్తున్నా నాయకుల ఉద్దేశించి గురించి నేనేం చెప్పట్లే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మళ్లా రివైవ్ చేస్తాము అని చెప్పి, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రకటనలు వచ్చినాయి.
ఆ ప్రకటనలు మానుకోవాలని చెప్పి మేము క్షేత్ర స్థాయి పర్యటనలో వెళ్ళినప్పుడు నిర్ద్వందంగా ప్రభుత్వానికి చెప్పాం. ఆ మాటకే ఇవాళ్ళకి కట్టుబడి ఉంటున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట ఒక నిరర్థకమైన ప్రాజెక్టు అనవసరమైన ప్రాజెక్టు. అనుమతులు లేని ప్రాజెక్టు. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి.
మీరు కందకం తొవ్వి 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకురావడానికి ట్రై చేస్తే.. శ్రీశైలంలోకి వచ్చే బురద ముందు కందకం మొత్తం నింపేసి, మీరు ఏం ఎత్తిపోస్తారు? బురద ఎత్తిపోస్తారు. అక్కడ ఎత్తిపోయడానికి నీళ్ళే ఉండవు. కందకం నిండా ముందు బురద మునుగుద్ది. అటు ఇటు బురద ఉండి కందకంలో నీళ్ళు ఉంటాయా ఎక్కడైనా?
వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరికన్నా తెలుసు . నన్ను అడగండి చెప్తా. ఒక కందకం తవ్వితే అటు ఇటు బురద ఉంటే మధ్యలో నీళ్లు ఉంటాయా? బురద వచ్చి పడదా? బురద వచ్చి పడ్డాక నీళ్ళు పారతాయా ? కందకంలో ఆ మాత్రం కూడా చూసుకోకుండా ఆ ప్రాజెక్టుని డిజైన్ చేసి, 1000 కోట్లు తగలబెట్టి.. దాని మీద ఇంకొక మూడు వేల కోట్లు తగలబెడతా అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంటే, దాన్ని బాధ్యతా రాహిత్యం కాక ఏమనాలి?
ఏదైనా ఎలక్షన్ ఉన్నా, ముఖ్యంగా బై ఎలక్షన్లో, లేకపోతే శాసన సభ సమావేశా లు ఉంటే.. ఈ ఆంధ్రోళ్ళు మా ఆస్తులు ఎత్తుకుపోతున్నారు అని నోరేసుకుొని పడిపోడం అలవాటు అయిపోయింది. ఇన్నాళ్ళు సాగిందేమో గానీ.. ఇక ముందు సాగదు. ప్రజలకి వాస్తవాలు చెబుతాం. ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పే మాటలకు ప్రజలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరని రెండు రాష్ట్రాల నాయకులకి చెప్తున్నాం.
నిజా నిజాలు ఏంటో మాలాంటి వాళ్ళం నిష్పక్షపాతంగా- నిర్మొ హమాటంగా చెప్తాం. అందులో నిజం ఎంతో, అబద్ధం ఎంతో బేరీజే సుకునే విజ్ఞత ప్రజల మీద వదిలేస్తున్నాం. కొంతమంది గవర్నమెంట్ మీద పడి బతికేవాళ్ళు.. కాంట్రాక్టుల మీద పడి బతికేవాళ్ళు.. వాళ్ళు ఎనలిస్టులు కావచ్చు. జర్నలిస్టులు కావచ్చు. నాయకులు కావచ్చు . సలహాదారులు కావచ్చు . ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ వాళ్ళ మాటల్ని కూడా సరిగ్గా బేరీజేసుకుని ఆలోచించాల్సిన బాధ్యత, ప్రజలుగా మన మీద ఉంది.
ఎందుకంటే.. మనకి ఇట్లాంటి వాళ్ళు దొరికారు ఏం చేస్తాం? వీళ్ళని నమ్మి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. వాళ్ళేమో అబద్ధాలు చెప్తున్నారు. అయినప్పుడు మన బుర్రలు మనమే వాడక తప్పదు. హరీష్ రావు శాసనసభ సభ పక్ష ఉప నేత అవుతాడు. అవ్వగానే ఏదో ఒక అగ్గిపుల్ల పంచాయతీ పెడతాడు.
ఏమి లేని దగ్గర.. అదిగో పోలవరం.. బనకచర్లకు సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చేసింది. పదా ఢిల్లీ వెళ్లి ధర్నా చేద్దాం అంటాడు. ఎక్కడ ఇచ్చింది? ఎవరు ఇచ్చారు? ఇంత అబద్ధాలా? ఆయన ఏదో అన్నాడు కదా అని చెప్పి, రేవంత రెడ్డి ఇంకొక ఇంకొక మాట అంటాడు. ఇందులో వాస్తవం ఎంతో కొంచెం నాయకులకు బాధ్యత ఉండాలి లేనప్పుడు ప్రజలే బాధ్యత తీసుకోవాలి. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో చూసుకోవడానికి హరీష్ రావు కి తెలవదా?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయిందో.. అసలు ఎందుకు మెగా కృష్ణా రెడ్డి ఫోన్ నెంబర్ లేదా నీ దగ్గర? ఫోన్ ఎత్తితే అడగొచ్చు. ఏమయ్యా .. ఎక్కడి దాకా అయింది పనులు? నీళ్ళు వెళ్తున్నాయా అని. అడిగితే కృష్ణారెడ్డి చెప్తాడు కదా? అందులో ఎంత మిగిలిందో కూడా చెప్తాడు. నువ్వు అడిగితే ఏముంది అంత మొహమాటం మరి! ఎందుకు ప్రజలని మభ్య పెట్టడం?
అంటే తెలంగాణ ప్రజలు ప్రతివాళ్ళు పేపర్లు తిరగేసి, లేకపోతే సుప్రీం కోర్టు ఆర్డర్లు చూసి తెలుసుకోలేరు. మనం చెప్పింది నమ్ముతారనా? ఎన్ని రోజులు మభ్య పెడతారు? సరే వాళ్ళ వాళ్ళ వృత్తి అది. వృత్తి ధర్మాన్ని అట్లా నిర్వర్తిస్తున్నారు కాబట్టి, వాళ్ళని వది లేయండి. ప్రజలు మాత్రం ఎవ్వరూ ఆవేశ పడొద్దు.
తెలంగాణ నీళ్లు తెలంగాణకు ఉంటాయి. ఆంధ్ర నీళ్లు ఆంధ్రాకి ఉంటాయి. ఈరోజున మీకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే.. ఎప్పుడైనా చివరి రాష్ట్రం వాళ్ళకి మిగిలిపోయిన నీళ్లుు వాడుకునే హక్కు ఉంటది. అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఉండేది ఈరోజున విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు కింద మారింది.
ఎందుకంటే చివరి రాష్ట్రం కాబట్టి. ఎందుకు ఇస్తారు ఈ హక్కు? బచా ట్రిబ్యునల్ లో క్లియర్ గా రాస్తాడు ఈ మాట! ఆఖరి రాష్ట్రం కాబట్టి మిగులు జలాలను వాడుకునే హక్కు, ఆఖరి రాష్ట్రానికి ఉంటది. కానీ దాని మీద హక్కుగా మాత్రం వాడుకోవద్దు. వచ్చినప్పుడు వాడుకోండి. లేనప్పుడు లేదు. నాకు ఇది హక్కుగా ఇచ్చావు కాబట్టి, నేను ప్రాజెక్ట్ కట్టా కాబట్టి.. నువ్వు నాకు ఇవ్వాలి అని నిలదీయడానికి నీకు హక్కు లేదు. ఉన్నప్పుడు వాడుకోండి అంటాడు. ఎందుకు ఇది చెప్తారు అని అంటే.. రైతులు- ప్రజలకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నా.
మన నీటి వాటాలు ఏవైతే ఉన్నాయో.. అది ప్రతి సంవత్సరం వచ్చే నీళ్ళు కాదు. 100 సంవత్సరాల్లో, 75 సంవత్సరాలు అంటే యావ వరేజ్ ప్రతి నాలుగులో మూడేళ్ళు ఇట్లా వస్తాయి. కృష్ణా నదిలో ఇన్ని నీళ్ళు మారతాయి కాబట్టి నువ్వు ఇన్ని తీసుకో, నువ్వు ఇన్ని తీసుకో అని ఇచ్చాడు. అంటే నాలుగేళ్లలో ఒక సంవత్సరం ఇన్ని నీళ్లు రావు. తక్కువ వస్తాయి. అది 50% తక్కువ రావచ్చు. పాతిక శాతం తక్కువ రావచ్చు. అసలు రాకుండా అయితే ఉండవు. అసలు వర్షం పడకుండా ఉండదు. ఎన్నో కన్నీ వస్తాయి కాకపోతే పూర్తి స్థాయిలో రావు. రానప్పుడు నీళ్ళు మొదట ఎవడికి వెళ్తాయి అండి? పైన ఏ రాష్ట్రం ఉంటే వాళ్ళకి వెళ్తాయి! వాళ్ళు వాడుకోంగా మిగిలితేనే కదా మనకి వదిలేది?
కాబట్టి చివరి రాష్ట్రానికి ప్రతి నాలుగేళ్ళకి ఒకసారి.. అంటే 100 ఏళ్లకి 75 సార్లు పోతే పాతిక సంవత్సరాలు ఈ నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి, ఆ మిగులు జలాలు మీరు వాడుకోండయ్యా అంటారు. అంతేకాకుండా ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువ వస్తే, వరద వచ్చి పడేది చివరి రాష్ట్రం మీద. ఆ వరదను భరించాల్సింది మనమే .
100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నీళ్లు రాకపోవడాన్ని, ఆ కరువుని. భరించాల్సింది మనమే. కాబట్టి దీన్ని కాంపెన్సేట్ చేయడం కోసం మిగిలిపోయిన నీళ్ళు, మీరు ఎలాగంటే అలాగ వాడుకోండి అని అంటారు. అందులో ఏమి ఆక్షేపణ లేదు. దీన్ని తెలంగాణ ప్రజలు గాని, ఇంకొకళ్ళ గాని దీన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు.. దాన్ని మేము హక్కుగా తీసుకోవట్లే. చివరి రాష్ట్రం కాబట్టి ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి తీసుకుంటున్నాం.
ఇదే సూత్రం గోదావరి మీద కూడా వర్తిస్తది. . కాబట్టి పోలవరం దిగువున ఏదైతే నీళ్లు వస్తాయో.. వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలనది ఆంధ్రప్రదేశ్ ఇష్టం. 3000 టీఎంసిలు సముద్రంలోకి పోతుంటే .. నేను 200 కాదు 300 వాడుకుంటా. అసలు వాడుకునే శక్తి నాకు ఉండాలి. ఎందుకంటే 300 టీఎంసిలు వాడుకోవడం అంటే మాటలు కాదు. దాన్ని కాలవ కట్టాలి. తీసుకెళ్ళాలి. ఎక్కడ పోయాలి? ఆ ఎత్తులో పంటపలాలు ఏమి లేవు. ఆ ఎత్తులో మొత్తం డెల్టానే ఉంది. డెల్టాకి ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. మాకు అక్కర్లే ఆ ఎత్తులో అంటే దీన్ని పై ఎత్తుకు తీసుకెళ్ళాలి.
అన్ని నీళ్లు లిఫ్ట్ చేయడం అంటే.. ఎంత కరెంట్ ఖర్చు అవుద్దో, ఇళ్లల్లో కరెంట్ వాడుకునే వాళ్ళని అడగండి చెప్తారు. ట్యాంకు మీద నీళ్లుు పంపించడానికి కరెంట్ మోటార్ కి ఎంత ఖర్చు అవుద్దో. కాబట్టి మిగులు జలాల వాడుకునే ఆంధ్రప్రదేశ్ హక్కు విషయంలో, తెలంగాణ ప్రజలు ఏమాత్రం సంశయం పెట్టుకోవద్దు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. దానివల్ల పై రాష్ట్రాల వాళ్ళకి ఏ నష్టము. జరగదు. దాని గురించి చింతించడం మానేయండి. మీ నాయకులు ఏదైనా అబద్ధాలు చెప్తే వినటం మానేయండి.
మాకు ఒక విషయంలో తీవ్రమైన అభ్యంతరం ఉంది. ఆయన చేసే పనుల్లో ఈరోజున కర్ణాటక ఆల్మట్టి ఎత్తు 3 625 524.256 256 525 మీటర్ల ఎత్తుకి మేము నీళ్ళు నిలబెడతాం అని చెప్పి, క్యాబినెట్లో డెసిషన్ తీసుకుని.. 70 వేల కోట్ల రూపాయలు ఆ ఆర్ అండ్ ఆర్ కి.. కాలవలకి ఖర్చు పెట్టడానికి అని చెప్పి క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది.
అట్లాగే రేవంత రెడ్డి వారు చెప్పినట్టుగా ఒక 360 టీఎంసిలు, 380 టీఎంసిలు వాడుకోవడానికి డిపిఆర్లు తయారు చేయమని చెప్పి జీఓ 34 ఇచ్చారు.. వాళ్ళు ఎగువ రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు. ఆ ప్రాజెక్టులు కడితే నిజంగానే నీళ్ళ అట్ట నిలబెడితే, ఆంధ్రప్రదేశ్ కి గొంతు ఎండిపోద్ది. ఒక్క చుక్క నీళ్లు రావు. వరద వచ్చినప్పుడు ఎట్టాగ వస్తాయి. అది వేరే విషయం. కానీ ట్రిబ్యునల్ ఇచ్చినట్లుగా మనకు నీళ్లు రావు. దీన్ని ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే మీరు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు..
దీన్ని ఆపాల్సిన బాధ్యత మీది. మనకు ఆల్రెడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద సుప్రీం కోర్టులో స్టే ఉంది. కేసు నడుస్తుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లి, ఆ జీఓల మీద స్టే తీసుకురావాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. అది చేయకుండా.. మీ మీరు కట్టుకోండి. నేను కట్టుకుంటాను అనటం ఏమైనా భావ్యమేనా?
వాళ్ళు కట్టుకుంటే మనకు ఏమీ రావు. రాయలసీమ నీటి హక్కులు ఏమైపోవాలి? నాగార్జున సాగర్ కెనాల్ కింద రైతులు ఏమైపోవాలి? కృష్ణా డెల్టా రైతులు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోవాలి? మీరు కట్టుకోండి. మేము మేము కట్టుకుంటాం అన్నది అది రాజకీయంగా, వినటానికి సొంపుగా ఉంటదేమో గానీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది మీ బాధ్యత కాదు. మీ బాధ్యత ఏంటంటే.. అనుమతులు లేని ప్రాజెక్టులు పైన ఎవడు కట్టినా గానీ, వాటిని ఆపు చేయడం మీ బాధ్యత.!
2014- 19లో పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఉత్తరం రాశారు. కలవకుర్తి సెకండ్ ఫేజ్ మీద రాశారు. డిండి మీద రాశారు. అట్లాగే సుంకేసుల వెనక నుంచి తుమ్మిళ్ల అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ ఉంటే, దాని మీద రాశారు. పాలేరు మీద సీతారామ లిఫ్ట్ అని ఇంకోటి పెడతాంటే దాని మీద రాశారు. మీరు అప్పట్లో అన్ని లెటర్లు రాశారు? అభ్యంతరాలు పెట్టారు? ఎందుకంటే అది మీ బాధ్యత.
మీరు కాకపోయినా, మీ ఆఫీసర్లు అయినా మీ ముందుకు తీసుకొస్తారు సంతకం పెట్టమని. అది మీ బాధ్యత. ఇవ్వాళ ఏమైంది ఆ బాధ్యత అంటున్నా! ఇవ్వాళ కూడా అది మీ బాధ్యత. అంతే తప్ప మీరేమి అన్ని రాష్ట్రాలకి బాధ్యత పడే విశ్వ గురువులు కాదు మీరు. ఆంధ్ర రా హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యమంత్రి కాబట్టి దాన్ని మొహమాటం లేకుండా నిర్వర్తించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుతున్నాను.
ఇందులో ఏమాత్రం సంశయం- లాలూచీ గానీ, మొహవాటం గానీ ఉండటానికి వీలు లేదు. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడాల్సింది మీరు. ఇకపోతే పోలవరం పనుల విషయంలో మొన్న కూడా రివ్యూ జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ ఇంకో నెల రోజుల్లో పూర్తి అవుతుంది అంటున్నారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ మొదలు పెడతాం అంటున్నారు. రెండు సీజన్లలో పూర్తి చేస్తాం అంటున్నారు. దానికి రెండు సీజన్లు కావాల్సిందే.
కాకపోతే ఈసిఆర్ఎఫ్ డ్ామ్, డిజైన్ విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ అభ్యంతరాలు అన్నిటిని త్వరగా పూర్తి చేసి, వాటి అభ్యంతరాలు అన్నిటిని సాటిస్ఫై చేసి.. ఆ డిజైన్ విషయంలో కావలసిన మార్పులు చేయాల్సిన స్టడీస్ ఉంటే చేయమని చెప్పి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఫారెన్ కన్సల్టెంట్ల మీదే ఆధారపడకుండా.. డామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ని మళ్ళా యాక్టివేట్ చేయండి. అన్ని రకాల స్టాండర్డ్స్ ని సీస్మిక్ స్టడీస్ వీటన్నిటిని జాగ్రత్తగా స్టడీ చేసి, డబ్ల్యూసి అభ్యంతరాలు అన్నిటికీ సరైన సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి మాత్రమే పనులు మొదలుపెట్టండి. ఎందుకంటే అది చాలా క్రిటికల్. ఈ విషయంలో జాగ్రత్త పడమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
మేము చెప్పిన వాస్తవాలు ఇవి. మేము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందని తోస్తే, రెండు రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే మేధావులు, సలహాదారులు, సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఎనలిస్టులు ఎవ్వరైనా సరే ఎక్కడైనా కూర్చుని, ఓపెన్ గా మీడియా సమక్షంలో చర్చిద్దాం అంటే మేము సిద్ధం. టైం ప్లేస్ మీరు డిసైడ్ చేయండి. మేము ఎక్కడ అంటే అక్కడికి వచ్చి చర్చించడానికి సిద్ధం.
రెండు రాష్ట్రాల నాయకుల్ని సాగునీటి రంగం విషయంలో ఒకప్పుడు రెచ్చగొట్టారు సెంటిమెంట్లు రెచ్చగొట్టారు. అయిపోయింది మీ పని. మీ పని ముగించుకున్నారు. ఇంకా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నాలు మానుకోండి.
రేవంత రెడ్డి అన్నది ఏంటంటే.. ఢిల్లీలో ఎవరి చక్రం ఎక్కువ తిరుగుద్దో మనకి అంచనా లేదులేండి. ఎవరి చక్రాలు వాళ్ళు తిప్పుకుంటా ఉంటారు. కానీ ఆయన అన్నది ఏంటంటే.. ఈ పాలమూరు రంగారెడ్డి ఇట్లాంటి ప్రాజెక్టులకి మీరు అడ్డు పెట్టడం వల్ల దానికి రావలసిన నిధులు రాకుండా ఆగిపోతున్నాయి అని అన్నారు. వాస్తవమే అడ్డు పెట్టే బాధ్యత మాది. మీరు ఏ అనుమతులు లేకుండా ఎట్లా కడతారు?
ప్రాజెక్టు ఎఫెక్స్ కౌన్సిల్ లో కూర్చోండి. మీకు ఎక్కడి నుంచి వస్తాయో ఆ నీళ్ళు చెప్పండి. 90 టీఎంసిలు 800 అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ 90 టీఎంసి ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు చెప్పండి? అడ్డు పెట్టకుండా ఉండమని ఆయన అడగటం సబబే. మనం అడ్డు పెట్టడం సబబే. మన ప్రయోజనాలు మనవి. ఆయన ప్రయోజనాలు ఆయనవి.
అదంతా బచావత్ ట్రిబ్యునల్ లో ఉందండి. సో..దాన్ని ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు . ఎన్నైనా క్లెయిమ్ చేయొచ్చు . నేను ఎన్నైనా క్లెయిమ్ చేయొచ్చు. కానీ అందులో వాస్తవం, దానికి నీతి చట్టం ఉండాలిగా? కాబట్టి అది సాధ్యపడే పని కాదు. ఎన్నైనా క్లెయిమ్ చేయొచ్చు . ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. రెండో ట్రిబ్యునల్ ముందుకు వచ్చామనుకోండి. మన క్లెయిమ్ మనం పెడతాం. మనం పెట్టిందల్లా నిజంగా వాస్తవం కావాలని ఏమి లేదు. జడ్జ్ గారు కూర్చుని దాన్ని డిసైడ్ చేస్తాడు. ట్రిబ్యునల్ అప్పుడు కూడా మనం చెప్పాల్సింది మనం చెప్పాం.
కర్ణాటక ఆ రోజున కూడా వాదించింది ఏంటంటే.. కృష్ణా అనేది క్యాచ్మెంట్ ఏరియా మా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి, మాకు ఎక్కువ నీళ్ళ ఇవ్వండి అన్నాడు. అన్నప్పుడు బచావత్ ట్రిబ్యునల్ క్లియర్ గా చెప్పింది. అంతర్జాతీయ సంప్రదాయాల ప్రకారం.. అంతర్జాతీయ నీటి పంపకాల ట్రిబ్యునల్ ప్రకారం.. క్యాచ్మెంట్ ఏరియా అనేది ప్రామాణికం కాదు. ఫస్ట్ యూసర్ గెట్స్ ద ఫస్ట్ రైట్ కాబట్టి, ముందు ప్రాజెక్ట్ కట్టుకున్నావాడికి మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి, ఆ ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ ఇచ్చారు. అదే సూత్రం ఇవాళ కూడా అమలవుతుంది.
జగన్మోహన్ కి పిచ్చి ముదిరిపోయింది. ముందు ఉండేది బాగా ముదిరిపోయింది. ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు ఆపించాడు అంటాడు. కళ్ళ ఎదురుగా కళ్ళకు కనిపిస్తున్నాయి జీవోలు. ఎప్పుడు ఆపారు ఏంటి అన్నది. అయినా సరే ఆయన ఎవరో ఆపారు అంటున్నాడు. నువ్వు కట్టిందే ఒక ఇల్లీగల్ ప్రాజెక్టు. మెఘా కృష్ణా రెడ్డికి డబ్బులు ఇవ్వడం కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. రాయలసీమను ఉద్దరించడానికి కట్టింది కాదు.
ఆ అమరావతి ఏమో నదీ గర్భం ఉందంటాడు లేకతే రివర్ బేసిన్ అంటాడు. రివర్ బేసిన్ అంటే ఏంటో తెలవదు. రివర్ ఫ్రంట్ అంటే ఏంటో తెలవదు. రివర్ బెడ్ అంటే ఏంటో తెలవదు.