(భోగాది వేంకట రాయుడు)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్య కార్యదర్శి గా పనిచేస్తున్న 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శిరసు పై రాష్ట్ర ప్రభుత్వం మరో ముళ్ల కిరీటం పెట్టింది .
ఇప్పుడు నిర్వహిస్తున్న సిఎంఓ కార్యాలయం ముఖ్య అధికారి పదవి ఎంత సంక్లిష్టమైనదో … ఇప్పుడు అలంకరించిన “టీటీడీ ఈ ఓ అదనపు బాధ్యత” అనేది కూడా అంతే సంక్లిష్టమైనది . 2024 జూన్ 12 నా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత , తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం …. రవిచంద్రను సిఎంఓ కార్యాలయం ముఖ్య అధికారిగా నియమించడమే .
టీటీడీ నిర్వహణ వ్యవస్థ లో అనేక ముదురు జీవాలు …. పైకి కనిపించని మొసళ్లు , మెత్తగా కనిపిస్తూ దొరికితే కాటు వేసే మిన్నాగులు , ఎంత బడ్జెట్ ను అయినా సౌండ్ రాకుండా గుటుక్కున మింగేసే కొండచిలువలు , దేవ దేవుని నామాలు పెట్టుకుని , చక్కని తెలుగులో సుతారం గా మాట్టాడుతూ …అందీ అందగానే చప్పరించేసే కరుణాద్ర హృదయులు గా కనిపించే కాలనాగులు తిరునామాలు పెట్టుకుని …తిరుమల కొండమీద పాతుకు తిరుగుతుంటాయి .
ఇటీవలి కాలం లో దేవదేవుని పట్ల ఏ స్థాయిలో అపచారాలు చోటు చేసుకున్నాయో భక్తులు నిస్సహాయం గా చూస్తూ ఉండి పోయారు .
అధర్మారెడ్డి ఈఓ గా వెలగబెట్టిన “ ఆ” కాలం నుంచి చోటు చేసుకున్న అపచారాలు ఒక్కొక్కటే వెలుగు లోకి రావడం తో ; ప్రపంచ వ్యాప్తం గా శ్రీ వారి భక్తులు ఖిన్నులయ్యారు . వారికి ఊరటగానా అన్నట్టుగా … క్షుద్ర శక్తులు ప్రస్తుతానికి కలుగుల్లో దూరి …. సరైన తరుణం కోసం ఎదురు చూస్తున్న దశలో …. ఇప్పుడు ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈ ఓ గా అదనపు బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు .
క్రైసిస్ మేనేజ్మెంట్ లో నిష్ణాతుడైన రవిచంద్ర ; వీలయినంత నిశ్శబ్దం గా తనకు అప్పగించిన పని పూర్తి చేసే అధికారి అని నెల్లూరు , చిత్తూరు , తూర్పు గోదావరి జిల్లాలలో ఇప్పటికీ పలువురు గుర్తు చేసుకుంటుంటారు .
2032 ఆగస్ట్ 31 వరకు ఐఏఎస్ అధికారిగా కొనసాగనున్న రవిచంద్రకు ; సీఎంఓ కార్యాలయ ముఖ్య అధికారిగా ఇప్పటికే టీటీడీ ‘వ్యవహారాల’ పై పూర్తి అవగాహన ఉంది . మాటకారి కాదుగానీ , సౌమ్యుడు ; నోటితో మృదువుగా …. పెన్ తో కఠినం గా వ్యవహరించే రవిచంద్ర టీటీడీ ని ఒక గాడిలో పెడతారని భావించవచ్చు .
ఈ నియామకం లో ఆయనకు రెండు ఫస్ట్ లు ఉన్నాయి .
ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి గా ఉన్న అధికారికి టీటీడీ ఈఓ బాధ్యతలు అప్పగించడం 1956 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవసారి. .