– ఇది యాదృచ్ఛికం కాదు.. పక్కా ప్రణాళికతో జరుగుతున్న సామాజిక అణచివేత
– రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి బ్లడ్ బుక్ రాజ్యాంగానికి కూటమి పాలన
: ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సారీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని, రాయలసీమలో బలిజలు బలైపోతుంటే, తెలగలు తెగనరకబడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళికతో జరుగుతున్న సామాజిక అణచివేత రాజకీయమని విమర్శించారు. కాపులంతా ఏకమై తెలుగుదేశం పార్టీని భూస్దాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు.
నాడు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను అత్యంత దారుణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వనే హతమార్చింది.కాపులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
నేడు అదే కూటమి ప్రభుత్వ హయాంలో కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబులను రాజకీయ కక్షసాధింపులకు గురిచేస్తున్నారు. చివరకు అధికార టీడీపీలో ఉన్న కందుకూరు నియోజకవర్గం దార్కానిపాడులో కూడా ఒక కాపు నేత బలైపోవడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూపుతోంది.
చంద్రబాబు ప్రచారాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాళ్లు, కర్రలతో వందల మంది దాడికి దిగారని అన్నారు. దాడి విజువల్స్ చూస్తే ఇది యాదృచ్ఛికం కాదని, ప్రభుత్వ అండతో జరిగిన పక్కా కుట్ర అని స్పష్టమవుతోంది.
“నీ అమ్మా మొగుడా” అంటూ చంద్రబాబు, “సైకో జగన్” అంటూ లోకేష్, “రండి రా నా కొడకల్లారా” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష ఏ సంస్కృతికి నిదర్శనం. ఇంత నీచమైన భాష వాడుతూ మళ్లీ నైతికతపై ఉపన్యాసాలు ఇవ్వడం దారుణం. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి ని అవమానిస్తూ మాట్లాడిన రోజు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కాపులంతా ఏకమై పాత రోజులు గుర్తుచేసేలా పోరాడి, ఈ అరాచక రాజకీయాలను భూస్థాపితం చేయడం ఖాయమని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.