– వైసీపీ అధికారంలోకి రావడం కల్ల
– బైరెడ్డి.. మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా
– మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు
– కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి
అమరావతి : మేము అధికారంలోకి వస్తే ప్రజలను రప్ప రప్ప నరుకుతాం, చంపుతాం అని ప్రజల్ని బెదిరించే వైసిపి పార్టీ ఇక ఈ జన్మలో అధికారంలోకి రాదని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో వైసిపి చేసిన రాక్షస పాలనను ప్రజలు మరో పది తరాలు గడిచినా మర్చిపోలేరన్నారు.
మేము అధికారంలోకి వస్తే దాడులు చేస్తాం, పోలీస్ స్టేషన్ కి వెళితే అక్కడ మేమే ఉంటాం అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల నోళ్లు అదుపులో ఉంటే తెదేపా కార్యకర్తల చేతులు, చేతలు కూడా పద్ధతిగా ఉంటాయని బ్రహ్మం చౌదరి బదులిచ్చారు. వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాల తో పాటు తెలుగుదేశం కార్యకర్తల హత్యలు, పార్టీ ఆఫీసు మీద దాడి మొదలైన దుశ్చర్యలు మర్చిపోయావా బైరెడ్డి? అని ప్రశ్నించారు. బైరెడ్డి మర్చిపోయినా ప్రజలు మర్చిపోరని అన్నారు.
సైకో పాలనను తిరిగి తెచ్చుకునే ఆలోచనలో ప్రజలు లేరని బైరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. అంబటి వ్యాఖల్ని బైరెడ్డి ఖండిస్తున్నది లేనిది మొదట సమాధానం చెప్పి ఆ తరువాత ఏదైనా మాట్లాడాలని అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని పక్క దారి పట్టించడానికి జగన్ ఆదేశాలతో వైసిపి నాయకులు ఈ డ్రామాకు తెరలేపారని అన్నారు.తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లందరికీ ప్రజా కోర్టులో, దేవుడి కోర్టులో శిక్ష తప్పదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ తప్పుల్ని సమర్ధిస్తున్నవారికి అదే శిక్ష పడుతుందన్నారు.