– విజయ్ పార్టీకి ‘హిందువుల భయం’
– తల బాదుకుంటున్న అభిమానులు!
పెళ్లిలో బొకే లాగేసుకోబోయి, విజయ్ పక్కనే కూర్చుని జగన్ చేసిన పిచ్చి పనికి సిగపట్లు పడుతున్నారు విజయ్ ఫ్యాన్స్.
గణనీయమైన సంఖ్యలో ఆయన అభిమానులు ఈ భేటీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ వివాదంలో జగన్ చిక్కుకున్న సమయంలో.. విజయ్ ఆయనను కలవడం వల్ల, అది హిందూ ఓటర్ల మనోభావాలపై ప్రభావం చూపుతుందేమోనని వారు భయపడుతున్నారు. జగన్ తన రాజకీయ ఇబ్బందుల నుండి దృష్టి మరల్చడానికి తమ హీరో విజయ్‌తో ఫోటో దిగారని, దీనికి రాజకీయ ప్రాముఖ్యత లేదని మరికొంతమంది వాదిస్తున్నారు.
కరూర్ లో విజయ్ ఆలస్యంగా రావడం వలన, తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు పోయిన ఘటన నుండి ఆయన అభిమానులు ఇమేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత భేటీలు రాజకీయ రంగు పులుముకోకుండా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
ఇవతల జగన్ అలా బోకేను లాగేసుకోబోవడం, పిచ్చి పిచ్చి హావభావాలు వ్యక్తం చెయ్యడం, స్టేజీ మీద జగన్, భారతి జంటగా కాకుండా విడివిడిగా దీవించడం, పెద్దలు చూసి వారిని మళ్లీ పక్కన పక్కన నిలబెట్టడం గట్రా చూసి చెవులు కొరుక్కుంటున్నారు.