– కల్తీ జగన్ ‘దింపుడుకల్లం’ ఆశలు గల్లంతు!
తెర వెనుక స్నేహాలు, కోర్టు గదుల్లో డ్రామాలు ఎన్ని నడిచినా.. చివరకు న్యాయస్థానం ముందు అసలు రంగు బయటపడక తప్పదు. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ మరియు జస్టిస్ జోయ్ మల్య బాగ్చీల ధర్మాసనం స్పందించిన తీరు చూస్తుంటే, వైకాపాకు అందాలని ఆశించిన ‘రక్షణ కవచం’ కాస్తా ‘చిల్లుల గొడుగు’లా మారిందని అర్థమవుతోంది.
జగన్ “దురుద్దేశం” బయటపడింది – విచారణ ఆపలేరు.. నోళ్లు మూయించలేరు!
కోర్టులో టీటీడీ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా గారు సూటిగా కొట్టిన దెబ్బ అదిరిపోయింది. “గతంలో టీటీడీ తరపున వాదించిన వారే, ఇప్పుడు శాఖాపరమైన విచారణను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇందులో పూర్తిగా దురుద్దేశం ఉంది” అని ఆయన వాదించడం స్వామి గారి అసలు ప్లాన్‌ను బట్టబయలు చేసింది. అంటే, కేసును నీరుగార్చడానికి ఎంతటి ‘పెద్ద తలకాయల’ సహాయం తీసుకున్నా, నిజాన్ని దాచలేరని స్పష్టమైంది.
జగన్ గారు కోరుకున్నట్లుగా చర్చను ఆపాలని, పరిపాలనాపరమైన విచారణను అడ్డుకోవాలని స్వామి గారు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
సుప్రీంకోర్టు స్పష్టత: “పరిపాలనాపరమైన విచారణ దానంతట అది జరుగుతుంది, కోర్టు ఆదేశించిన సిట్ (SIT) విచారణకు ఇది అడ్డంకి కాదు. రెండూ చట్టబద్ధంగా కొనసాగవచ్చు” అని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌కు సరైన బేస్ లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించడం విశేషం.
ఎవరిని రక్షించే ప్రయత్నం?
రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటనలు చేశారని, అది సమస్య అని స్వామి గారు వాదించడం వెనుక.. వైకాపా, సాక్షి చేస్తున్న పాత వాదనలే వినిపించాయి. స్వామికి కూడా వాదనల కింద అవే వ్రాసిచ్చినట్లున్నారు. కానీ, చార్జిషీట్ దాఖలైంది, విచారణ పూర్తయింది అన్న వాస్తవాలను కోర్టు గుర్తించింది. తప్పు చేసిన వారు దొరికిపోతారనే భయంతోనే.. విచారణల మీద స్టేలు ఎందుకు? అన్న సామాన్య భక్తుడి ప్రశ్నకు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఒక సమాధానంగా నిలిచింది.
“తాడేపల్లి ప్యాలెస్” నుండి “సుప్రీంకోర్టు మెట్ల” వరకు సాగిన ఈ ‘జగన్ ప్రహసనం’ చివరకు అట్టర్ ఫ్లాప్ అయింది. లడ్డూ కల్తీపై విచారణ ఆగదు.. దోషులెవరో తేలక మానదు. భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన వారు, రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలు వేసినా ‘గోవిందుడి’ తీర్పు నుండి తప్పించుకోలేరు.
సత్యమేవ జయతే.. ఓం నమో వేంకటేశాయ!
చిత్రం : తాడేపల్లి ప్యాలెస్ లో స్వామిని ఆహ్వానిస్తున్న జగన్ బాబాయ్