కొండ మీద చేసిన పాపాల పుట్ట పగిలి, హిందూ భక్తుల మనోభావాలు గాల్లో కలిశాక.. డ్యామేజ్ కంట్రోల్ కోసం మన “పులివెందుల పుంగవుడు” పులివెందుల (వేంపల్లి మండలం, నందిపల్లి)లోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఒక కార్యక్రమం సెట్ చేశారు . కానీ అక్కడ కూడా తన మార్కు చేష్టలతో అభాసుపాలవ్వడం మన జగనన్నకే చెల్లింది.
పూజా సమయంలో పండితులు చేతికి అక్షింతలు ఇచ్చి, చాలా సమయం ఏమి చెయ్యాలో వివరించారు. వాటిని భక్తితో తల మీద చల్లుకోవడం లేదా కళ్ళకు అద్దుకోవడం లోకరీతి. వెనక వైపుగా మెల్లగా పెట్టాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్! అక్షింతలను అందుకుని, ఏదో కొత్త రకం సెంటు వాసన చూస్తున్నట్టు ముక్కు దగ్గర పెట్టుకుని, ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఎడమవైపు వెనక్కి విసిరేశారు.
శాస్త్రం ఏం చెబుతోంది? (జగనన్నకు తెలియనిది)
అక్షింతలను తల వెనక్కి వేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం చాలా గొప్పది
“భగవంతుడి ఆశీర్వాదం నా శిరస్సుపై ఉంది, నా అహంకారం మరియు పాపాలు నా వెనకాల పడిపోవాలి” అనే భావన అది. అహంకారాన్ని వీడి, శుభప్రదమైన వాటిని గౌరవంగా స్వీకరించడం దీని సంకేతం.
కానీ మన జగనన్నకి అటు భక్తి లేదు, ఇటు విజ్ఞత అసలే లేదు! అక్షింతలను అలా విసిరేయడం చూస్తుంటే, ఆశీర్వాదాన్ని స్వీకరించడం కంటే.. పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి మొఖాన కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. పవిత్రమైన పూజలో కూడా ఈ “వయ్యారాలు”, “వెటకారాలు” అవసరమా జగన్?
వెళ్లిన పని ఏమిటి…చదువుతున్న మంత్రాలు ఏమిటి?
అక్కడ వాళ్ళ ఆవిడ లేదు ( రాదు) ముఖ్యమంత్రి పదవి రావాలి అంట…దేశాన్ని పాలించాలి అంట…పవిత్రమైన తిరుమల లడ్డును క్షల్తీ చేసిన వ్యక్తికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి సిద్దిరస్తు అని మంత్రాలు అంట. ఇంకా ఎవరిని నాశనం చెయ్యాలని ఈ మంత్రాలు? హిందూ సంప్రదాయంలో నేను ఎక్కడ వినలేదు .ఇదేం విడ్డూరం?
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన వంటి అత్యంత ముఖ్యమైన వైదిక కార్యక్రమాల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాల్గొనడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరిగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు… దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు
గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఏ శుభకార్యమైనా దంపతులుగా (జంటగా) చేయడం శాస్త్రబద్ధం. భార్యను ‘అర్ధాంగి’గా పరిగణిస్తారు కాబట్టి, ఆమెతో కలిసి చేసే పూజలకు పూర్తి ఫలితం ఉంటుందని నమ్ముతారు.
ఒకవేళ ఆ వ్యక్తి అవివాహితుడైనా, లేదా అతని భార్య అనారోగ్యం వంటి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోయినా… సంబంధిత శాస్త్ర నియమాలను పాటిస్తూ ఒంటరిగా విగ్రహ ప్రతిష్టాపన చేయవచ్చు.
విగ్రహ ప్రతిష్ట అనేది కేవలం విగ్రహాన్ని ఉంచడం మాత్రమే కాదు; అది ‘ప్రాణ ప్రతిష్ట’ !!
ఆగమ శాస్త్రం మరియు సంప్రదాయ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం… గర్భాలయంలో జరిగే ప్రధాన విగ్రహ ప్రతిష్టా క్రతువులను (ప్రాణ ప్రతిష్ట) సాధారణంగా దీక్షాబద్ధులైన అర్చకులు, ఆ మతాన్ని అనుసరించే కర్తలు నిర్వహిస్తారు.
అన్యమతస్థులు పాల్గొన్నప్పుడు, వారు ఆలయ మర్యాదలను గౌరవిస్తూ కేవలం అతిథులుగా లేదా గౌరవార్థం హాజరవడం మాత్రమే చేస్తారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో, అన్యమతస్థులు కేవలం బయటి కార్యక్రమాల్లో (విగ్రహ ఆవిష్కరణ లేదా దర్శనం) పాల్గొనడం ఒకెత్తు, కానీ వైదిక క్రతువుల్లో (యజ్ఞయాగాదులు) నేరుగా భాగం చేయడం అనేది ఆయా ఆలయాల నిర్వాహకులు హిందూ సంప్రదాయాలను అవహేళన చేసినట్లే అవుతుంది.