విన్నపం: అడ్డంగా కమీషన్లు అడిగి, ఇవ్వలేదంటే జాకీ నుండి సింగపూర్ దేశాల పెట్టుబడుల వరకు అందరినీ తరిమేయడం ‘హారిజంటల్’.. మా నాయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు అనంతపురంలో అడుగుపెట్టారని లెటర్లు రాసి, సంతకాలు పెట్టించి, కియా చుట్టూ అనుబంధ పరిశ్రమలు రాకుండా భయపెట్టడం ‘వర్టికల్’.. తాడేపల్లి నుండి ఇవన్నీ పర్యవేక్షించడమే ‘ఎకోసిస్టమ్’ అని నమ్మే సైకోల కోసం కాదు ఇది.
ముంబయిలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా – 2026’ సదస్సులో మంత్రి నారా లోకేష్ గారు ఏపీ అభివృద్ధి మంత్రాన్ని వివరించారు. ఆయన మాటల్లో అభివృద్ధి అంటే కేవలం బిల్డింగులు కట్టడం కాదు, ఒక సమగ్ర వ్యవస్థను (ఎకో సిస్టం) సృష్టించడం!
లోకేష్ అభివృద్ధిని రెండు కోణాల్లో అద్భుతంగా వివరించారు:
1. వర్టికల్స్ : ఒకే రంగంలోని అన్ని విభాగాలను కొన్ని కిలోమీటర్ల పరిధిలోకి (రేడియస్) తీసుకురావడమే ఈ క్లస్టర్ విధానం.
ఉదాహరణకు: ‘ఫార్మా’ లేదా ‘ఎలక్ట్రానిక్స్’ రంగాలను తీసుకుంటే.. కేవలం ఒక పెద్ద కంపెనీ మాత్రమే కాదు, దానికి విడిభాగాలు సరఫరా చేసే చిన్న సంస్థలు, అసెంబ్లీ యూనిట్లు అన్నీ ఒకే చోట ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తి వేగం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి.
2. హారిజంటల్స్ : పరిశ్రమలకు కావాల్సిన అసలైన బలం ‘నైపుణ్యం’. విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు ఆయా పరిశ్రమలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడం, వస్తువులను పరీక్షించే టెస్టింగ్ ఏజెన్సీలు, క్వాలిటీ సర్టిఫికేషన్ సెంటర్స్ అన్నీ అక్కడే ఉండేలా చూడటం. ఇదే అసలైన ‘వైబ్రెంట్ ఎకోసిస్టమ్’.
“మేము ఇచ్చే భూమి విలువ కంటే, ఆ కంపెనీలు సృష్టించే ఎకోసిస్టమ్ ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం చాలా పెద్దది.” – నారా లోకేష్
గత ఐదేళ్లలో ఎప్పుడైనా.. ఎవడైనా రాష్ట్రం దాటి ఒక్క వైకాపా వాడైనా ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేసి, మన రాష్ట్రం గురించి చెప్పారా?