– కేశినేని చిన్నికి అసలు కొంచెమైనా సిగ్గుందా?
– దేవుడికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు గొడవపడతారా ?
– కళ్యాణంలో స్థానిక ఎమ్మెల్యేనే పట్టువస్త్రాలు ఇస్తారు.
– చిన్ని చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయింది
– చిన్ని ఎన్టీర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఫైర్
విజయవాడ: కేశినేని చిన్ని వంటి వ్యక్తి ఎంపీగా దొరకడం విజయవాడ ప్రజల దౌర్భాగ్యం. ఎంతో గొప్ప గొప్ప నాయకులు విజయవాడ పార్లమెంట్ నుంచి పనిచేశారు. ఢిల్లీ స్థాయిలో మాట్లాడి విజయవాడ అభివృద్ధి కార్యక్రమాలు గత ఎంపీలు పనిచేశారు.
కేశినేని చిన్ని విజయవాడకు ఎంపీ కావడం మా ఖర్మ. కేశినేని చిన్ని ఎంపీ అయిన దగ్గర్నుంచి అంతా దోపిడీనే. ఇసుక , మట్టి , భూదందా , దేవదాయ భూముల కబ్జా, వసూళ్లు , పంచాయతీలే చిన్ని పని. దేవుడి కళ్యాణంలో కూటమి ఎంపీ , ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా కొట్టుకునే పరిస్థితికి వచ్చారు.
కేశినేని చిన్నికి అసలు కొంచెమైనా సిగ్గుందా? దేవుడికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు గొడవపడతారా? నెమలి వేణుగోపాలస్వామి గొప్పతనాన్ని , పేరును నాశనం చేస్తున్నారు. వేణుగోపాల స్వామి కళ్యాణంలో స్థానిక ఎమ్మెల్యేనే పట్టువస్త్రాలు ఇస్తారు. కానీ కేశినేని చిన్ని చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయింది.
రౌడీయిజం , గూండాయిజం చేయడమేనా ఎంపీగా నీ బాధ్యత. ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పై రుబాబు చేస్తున్నావ్. అతన్ని పనిచేయనివ్వవు…అధికారులను సహకరించనివ్వవు. ఆఖరికి దేవుడి కార్యక్రమంలో కూడా తలదూర్చి ఇబ్బంది పెట్టేస్థాయికి దిగజారిపోయావు.
హిందూ ధర్మానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లం అని చంద్రబాబు , పవన్ చెప్పుకుంటున్నారు. నిన్నటి ఘటనకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెబుతారు? పూజలు , దేవుడి కళ్యాణాలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? గత దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవాలను పెట్టారు.
అమ్మవారి ఉత్సవాలు చెడగొట్టే విధంగా ఎంపీ నీచమైన కార్యక్రమాలు చే నీచమైన కార్యక్రమాలు ఎంపీ చేశాడు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏరోజైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? కానీ ఈ రెండేళ్లలో దేవుడికి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా ఉంటే తొక్కసలాట…లేకపోతే ప్రాణాలు పోవడం.
ప్రసాదంలో పురుగులు ,ఈగలు , దోమలు వస్తాయి … అవి చూపిస్తే తప్పుడు కేసులు.నిన్నటి ఘటన పై ఎంపీ కేశినేని చిన్ని ఎన్టీర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు , పవన్ పరువు పోయింది. వైసీపీ పై నెపం వేయాలనుకున్నారు. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి చంద్రబాబు , పవన్ కు బుద్ధి వచ్చేలా నిజాన్ని నిరూపించారు.
పైనున్న దేవుడు , ప్రజలు కూటమి నేతలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎంపీ కేశినేని చిన్ని గూండా , రౌడీ మాదిరి రెచ్చిపోతున్నారు. నిన్నటి ఘటన పై ఎంపీ , ఎమ్మెల్యే ఇద్దరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలి