– రేపటి తెలంగాణ కోసం ‘రైజింగ్ తెలంగాణ’వైపు అడుగులు
– 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా తరతరాల సామాజిక వివక్షకు శాశ్వత ముగింపు పలికేలా అడుగులు
– శాసన మండలి లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్: గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పండించిన ‘ప్రగతి’కి సజీవ సాక్ష్యం. , గవర్నర్ ప్రసంగం ‘రేపటి తెలంగాణ’ను అంత Insightful గా మన కళ్లకు కట్టింది. ఇది ఈ రెండేళ్లలో మేమేం చేశామనే రిపోర్ట్ కార్డ్ మాత్రమే కాదు. కోటి రతనాల తెలంగాణ ప్రపంచ పటంలో ‘రైజింగ్’ అయ్యేలా మా ప్రభుత్వం గీసిన ఒక Visionary Blueprint.
గతంలో అభివృద్ధి అంటే ఏదో ఒక ప్రాంతానికి, కొందరికే పరిమితమైన Privilege లా ఉండేది.
మేం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్… రూపంలో Natural Resources to Intellectual Resources అనే సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాం. మన యువతను కేవలం డిగ్రీ హోల్డర్స్ అనే ట్యాగ్ లైన్ కే పరిమితం చేయకుండా… ప్రస్తుత మార్కెట్ డిమాండ్ ను అందుకునేలా ‘స్కిల్లింగ్… రీ స్కిల్లింగ్… అప్ స్కిల్లింగ్’పై ఫోకస్ పెట్టాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా Industry-Ready Curriculum ను రూపొందిస్తున్నాం.
దాశరథి అన్నట్లు… నా తెలంగాణ.. కోటి రతనాల వీణ… ఆ వీణ అద్భుతంగా పలకాలంటే, అందులోని ప్రతి తీగకూ సరైన స్థానం దక్కాలి. లేదంటే… ఆ రాగం అసంపూర్ణం. వినసొంపుగా ఉండు. అలాగే…. సమాజంలోని ఏ ఒక్క కులం లేదా వర్గం వెనుకబడినా, ఆ ప్రగతి రాగం అసంపూర్ణమే. అందుకే, ప్రతి తీగ స్థితిని తెలుసుకుని సరి చేసేందుకు కుల గణన అనే ‘సోషల్ ఇంజనీరింగ్’కు శ్రీకారం చుట్టాం. 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా తరతరాల సామాజిక వివక్షకు శాశ్వత ముగింపు పలికేలా అడుగులు వేశాం.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఒక గొప్ప సంకల్పంతో అడుగు ముందుకు వేస్తోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యం అసాధ్యమైనది కాదు, అది అత్యంత శాస్త్రీయంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూపాంతరం చెందించేందుకు రూపొందించబడిన సమగ్ర ప్రణాళిక. ఫ్యూచర్ సిటీ నుంచి ‘గ్రీన్ ఎనర్జీ’ వరకు మేము వేస్తున్న ప్రతి అడుగు తెలంగాణ కోసమే. మన భావితరాల భవిష్యత్తు కోసమే.
రైతు రుణమాఫీ నుంచి మహాలక్ష్మి పథకం వరకు…. యువతకు ఉద్యోగాల నుంచి మహిళా సాధికారత వరకు మా ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత, చిత్తశుద్ధి గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబించింది. విపక్ష సభ్యులకు నేను ఒకటే మనవి చేస్తున్నా..ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా, ‘రేపటి తెలంగాణ’ కోసం ఈ ప్రభుత్వం వేసే అడుగుగా చూడండి.
తెలంగాణ అంటే ఒక పోరాటం.. ఒక తెగువ… అజేయమైన విజయం… ఆత్మ గౌరవం… కాళోజీ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు…. అన్యాయాన్ని ఎదిరించినవాడే నా వాడు అని… ఆయన స్ఫూర్తితోనే, 2014 నుంచి 2023 వరకు జరిగిన తప్పులను సరిదిద్దుతూ… రేపటి తెలంగాణ కోసం ‘రైజింగ్ తెలంగాణ’వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. రాజకీయాలకు అతీతంగా… రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చే ఈ చారిత్రక ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని విపక్షాలను సాదరంగా ఆహ్వానిస్తున్నా.