ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రకం “ల్యాబ్ టెస్ట్” మొదలైంది. తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఓపెన్ అయితే.. అక్కడ సైంటిస్టుల కంటే ముందే మన “సాక్షి” స్క్రోలింగ్ టీమ్ “క్రెడిట్” శాంపిల్స్ పట్టుకుని రెడీ అయిపోయింది.
(సాక్షి స్క్రోలింగ్) సాక్షి కథనం: టీటీడీలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ – వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ – జగన్ తెచ్చిన ల్యాబ్‌ను బాబు ఖాతాలో వేసుకుంటూ ప్రచారం – తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటు – వైఎస్ జగన్ హయాంలో ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం – 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు – రూ.20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు అంగీకారం – నాటి నిర్ణయం మేరకు తిరుమలలో అందుబాటులోకి ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ – వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతం
సాక్షి గారి లాజిక్ ఎలా ఉందంటే: “2023లో ఒకాయన వచ్చి తిరుమలలో గాలి పీల్చి.. ‘ఇక్కడ ఒక ల్యాబ్ ఉంటే బాగుంటుంది’ అని మనసులో అనుకున్నారు. ఆ మనసులో మాట మా జగన్ అన్నదే! కాబట్టి ఆ ల్యాబ్ లో ఉన్న ఫ్రాన్స్ మిషన్లు, ఆ గోడలు, ఆ రిబ్బన్, చివరికి అక్కడ పనిచేసే స్టాఫ్ వేసుకున్న యాప్రాన్లు కూడా మావే!”
అమ్మాయిని చూడకనే పంతులు గారు పెళ్లి ముహూర్తం పెడితే.. ఆ పుట్టే పిల్లలందరూ పంతులు గారికే పుట్టారు అన్నట్టుంది ఈ వ్యవహారం. 2023లో ‘ల్యాబ్ పెడదాం’ అని ఒక మీటింగ్ పెట్టుకోవడం ఒకటయితే.. 2024లో అడ్డగోలుగా నెయ్యి కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన SIT మొట్టికాయలు వేసిన తర్వాత, కళ్లు తెరిచి, కోట్లు ఖర్చు పెట్టి, విదేశీ టెక్నాలజీ తెచ్చి, బిల్డింగ్ కడితే.. “అబ్బే.. ఆ స్కెచ్ మాదే” అనడం భలే తమాషాగా ఉంది.
నిజమైన ట్విస్ట్ ఇక్కడే ఉంది: సాక్షి చెప్పినట్లు జగన్ గారి హయాంలో ల్యాబ్ గురించి “చర్చలు” జరుగుతున్నప్పుడే.. కింద వంటశాలలో మాత్రం 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి ప్రవహించిందని SIT తేల్చి చెప్పింది. అంటే, అప్పట్లో ల్యాబ్ కేవలం “మనసులో” ఉంది, కానీ కల్తీ నెయ్యి మాత్రం “లడ్డూల” మీద ఉంది!
చంద్రబాబు గారి ‘హైటెక్’ కఠిన ఆదేశాలు: చంద్రబాబు గారు వచ్చాక సీన్ మారింది. కేవలం ల్యాబ్ కాదు, అడ్డగోలు కల్తీని అరికట్టే “డిజిటల్ డిటెక్టివ్‌లను” రంగంలోకి దించారు:
e-Nose & e-Tongue: ప్రసాదం సువాసనలో ఏమాత్రం తేడా వచ్చినా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు కనిపెట్టేస్తుంది. అంటే.. ఇకపై “రాజకీయ వాసనలు” కాకుండా కేవలం “శుద్ధమైన నెయ్యి వాసన” మాత్రమే భక్తులకు దక్కుతుంది.
కఠిన ఆదేశం: “నాణ్యతలో రాజీ పడితే బ్లాక్ లిస్టే!” అని సీఎం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గతంలో లాగా “నేతిలో పామాయిల్” కలిపే బ్యాచ్ కి ఇక తిరుమల కొండ మీద నో ఎంట్రీ!
ఆ e-nose మిషన్ కి కూడా పిచ్చి పడుతోంది. అది నెయ్యిలో కల్తీని పట్టుకోవడానికి డిజైన్ చేస్తే.. సాక్షి మీడియా ఏమో అందులో “క్రెడిట్” వాసన చూస్తోంది. జగన్ గారు ల్యాబ్ రావాలని “కల” గన్నారు.
చంద్రబాబు గారి హయాంలో ఆ నిర్మాణం చేసి, టెక్నాలజీని జోడించి, రిబ్బన్ కట్ చేశారు. భక్తుడికి కావాల్సింది స్వచ్ఛమైన లడ్డూ.. కానీ సాక్షికి కావాల్సింది మాత్రం టీవీ స్క్రీన్ మీద పడే “క్రెడిట్” స్క్రోలింగ్ మాత్రమే!
కల్తీ రిపోర్ట్ వచ్చినా చర్యలు తీసుకోక దాచి పెట్టిన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డినీ.. వెనకేసుకు వచ్చే వైకాపాకు సిగ్గా.. ఎగ్గా?