అనంతపురం ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ (FCRA) రెన్యువల్ అయినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా కి కృతజ్ఞతలు చెప్పి జగన్ ఆపేసి ఉంటే బాగుండేది. కానీ, అనవసరంగా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని, ఇది తమ పోరాటం అని చెప్పుకోబోయి జగన్ మరోసారి అభాసుపాలయ్యారు. అలా అబద్ధాలు చెప్పకుండా ఉంటే తాను ‘ఎర్రిపప్ప’ అయ్యేవాడు కాదని జగన్ తెలుసుకోలేకపోయారు.
అసలు వాస్తవాలు ఇవే:
ఏడాది ఆలస్యం ఎందుకు?: అసలు ఏడాది క్రితం ఆర్డీటీ ఎఫ్.సి.ఆర్.ఏ కోసం దరఖాస్తు చేసుకోలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అంటే 2021లోనే ఆర్డీటీకి పర్మిషన్లు రద్దయ్యాయి.
మూడేళ్ల మౌనం: జగన్ హయాంలో మూడేళ్ల పాటు ఆర్డీటీ ఇబ్బందుల్లో ఉన్నా, ఒక్క వైసీపీ నాయకుడు కూడా కనీసం నోరు మెదపలేదు. నాడు కేంద్ర పెద్దలను ఎన్నోసార్లు కలిసిన జగన్, ఆర్డీటీ ప్రస్తావన తీసుకురావడానికి భయంతో వణికిపోయారు. ఆనాడు పిరికి సన్నాసిలా వ్యవహరించిన జగన్, ఇప్పుడు పోటుగాడిలా బిల్డప్ ఇవ్వడం హాస్యాస్పదం.
లోకేష్ చొరవ – జగన్ డ్రామా: లోకేష్ కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించగానే.. ఏప్రిల్ ఫూల్ కంటే ముందే క్రైస్తవుల చెవుల్లో పువ్వులు పెట్టాలని జగన్ ఈ ‘క్రెడిట్ పాలిటిక్స్’ మొదలుపెట్టారు.
కేవలం లోకేష్‌ను మాత్రమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కూడా మాంఛో ఫెర్రర్ కలిసి కృతజ్ఞతలు తెలపడంతో.. జగన్ ఆడిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పని చేసిన వాడు ఎవరో, మేకప్ వేసుకుని మైక్ ముందుకు వచ్చిన వాడు ఎవరో ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. చివరికి జగన్ ‘సెల్ఫ్ ఫూల్’ అయ్యారు!
-చాకిరేవు