కర్ణాటకలోని సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది
నిర్వాహకులు లోకేష్ పై ఉన్న ప్రేమతో, వేదికపై ఆయన కోసం ప్రత్యేకంగా ‘రాజసం’ ఉట్టిపడేలా ఒక పెద్ద సోఫాను ఏర్పాటు చేశారు. అయితే, పక్కనే కేంద్రమంత్రి కుమారస్వామి సాధారణ కుర్చీలో కూర్చుని ఉండటం చూసిన లోకేష్, ఆ పెద్ద సోఫాలో కూర్చోవడానికి ససేమిరా అన్నారు.
పక్కనే కేంద్రమంత్రి కుమారస్వామి సాధారణ కుర్చీలో కూర్చుని ఉండటం చూసిన లోకేష్, ఆ పెద్ద కుర్చీలో కూర్చోవడానికి ససేమిరా అన్నారు.కుమారస్వామి స్వయంగా లేచి, పట్టుబట్టి ఆ కుర్చీలో కూర్చోమని కోరినా.. లోకేష్ మాత్రం ఆయనకు నమస్కారం చేస్తూ సున్నితంగా తిరస్కరించారు.
చివరికి ఏమైందంటే.. మొండిఘటం లోకేష్ పట్టుదల చూసి చేసేదేం లేక, నిర్వాహకులు ఆ భారీ సోఫాను అక్కడి నుండి తొలగించి, అందరిలాగే లోకేష్ కి కూడా ఒక సాధారణ కుర్చీని వేశారు.
అసలే సన్నబడిన లోకేష్.. తన ప్రవర్తనతో తన వ్యక్తిత్వాన్ని మరింత ‘పెద్దది’ చేసుకున్నారు!