– బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్
హైదరాబాద్: రాష్ట్రంలో కార్మిక వర్గాలు ఆందోళనోలో ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ రాజ్యం పోయి సమ్మెల కాలం నడుస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మెకు పోతాం అని నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్టియు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. 33 జిల్లాల్లో మా బిఆర్ టియు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి నేను కోరుతున్న
విద్యుత్ ఆర్టిజెన్స్ సమ్మెలో ఉన్నారు. 33 జిల్లాల్లో వారు దీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు వారికి కూడా మేము మద్దతు ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎవరి సమస్యలు కూడా పరిష్కారం చేయడం లేదు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో లో త్రిశంకు స్వర్గం చూపించారు. ఎన్నికల తరువాత ఏం చేయడం లేదు. ఆర్టీసీ వాళ్ళకు అధికారంలోకి రాగానే మీకు పీఆర్సీ ఇస్తాం అన్నారు. మా కేసీఆర్ హయంలో ఉన్నప్పుడు అన్ని రకాల వసతులు కల్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తామని అన్నారు.అధికారంలోకి వచ్చారు అన్ని మరిచారు.అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మేము అన్ని సమస్యలు పరిష్కారం చేశామని కరపత్రం వేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.
రేవంత్ రెడ్డి.. నీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ టీ యూ 32 సమస్యలతో యాజమాన్యం కి నోటీస్ ఇచ్చారు. వాటి అన్నింటిపై గట్టిగా ఉండండి మీకు మేము అండగా ఉన్నాం. కేసీఆర్ హయంలో ఆర్టీసీ కార్మికులు అన్ని రకాల వసతులు కల్పిస్తూ భవన నిర్మాణ కార్మికులు,ఆటో కార్మికులకు అండగా భీమా పథకం తెచ్చారు…
ఇవాళ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే పిలిచి ఆర్టిజెన్స్ పై బెదిరింపులు చేశారు భట్టి విక్రమార్క. ఆశా వర్కర్లు హైదరాబాద్ లో ధర్నా చేస్తుంటే వాళ్ళను ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా అరెస్ట్ లు చేశారు.చర్చల పేరు మీద పిలిచి ప్రభుత్వం బెదిరింపులు చేస్తున్నది. బేషరతుగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి.
రవాణా శాఖ లో 600 కోట్ల స్కాం: బి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శి మారయ్య
కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తోంది. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి కార్మికులను సమ్మె చేస్తుంటే బెదిరిస్తున్నారు. కార్మికులు చేసే సమ్మెకు వారి హక్కుల సాధనకు మేము అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి కొత్త పథకం తెచ్చాడు. ధర్నాలకు అనుమతి ఇచ్చి అర్దరాత్రి అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు అనేక విషయాలు చెప్పాడు రేవంత్ రెడ్డి. రవాణా శాఖ లో 600 కోట్ల స్కాం చేస్తున్నారు. ఫిట్నెస్ కు వాహనము పోతే 60 రూపాయలు వసూలు చేసే వారు.ఇప్పుడు వేలల్లో వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు చివరకు కోర్టుకు వెళ్లారు వాహనదారులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం పని చేసిన స్కాం లు తప్ప ఇంకోటి లేదు.