– ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉండకూడదా? అమరావతి ఎదగకూడదా?
– అమర్ వ్యాఖ్యల వెనుక అహంకారం
– తెలంగాణ జాతిపిత దొర పాలనలో జరిగిన దారుణాలపై ఒక్క వ్యాసం ఎందుకు రాయలేదు?
– ఒక్క ప్రశ్న ఎందుకు వేయలేదు?
– ఫక్తు తెలంగాణవాది ఆంధ్రుల రాజధానిపై నేడు ఇన్ సైడర్ అని వాగటం నీది జర్నలిజమా ? జగనిజమా?
– రేవంత్ ఫ్యూచర్ సిటీ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యాఖ్యాలు ఎందుకు చేయలేదు ? రేవంత్ రెడ్డి చీరి చింతకు కడతారని భయమా?
– ఉయ్యాలలో పసిగుడ్డు అమరావతి పై నీ విషప్రయోగం ఎందుకు?
( మేడసాని శుభకర్)
దేవులపల్లి అమర్ ది ముసుగు జర్నలిజం. దూరేది మాత్రం తాడేపల్లికొంపలో! ఒక జర్నలిస్టుగా ఈనాడు దినపత్రికలో జీవితం ప్రారంభించి, పలు పత్రికలు తిరిగిన అమర్.. చివరికి వైసీపీ ఆస్థాన మీడియాలో కీలక భాధ్యతలు వెలగబెట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన అనంతరం, ఈ పచ్చి తెలంగాణ వాదనలో.. ఆంధ్ర ద్రోహిని జగన్ ప్రభుత్యం జాతీయ మీడియా సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టి, ఆంధ్రుల సొమ్మను నెలనెలలా లక్షల్లో అమర్ కు ధారాదత్తం చేసింది. ఆంధ్రుల సొమ్ము తెగమేసిన దేవులపల్లి అమర్.. ఆంధ్రుల తల్లిలాంటి అమరావతిపై విషం చిమ్మారు. అది కూడా కేంద్రం అమరావతిపై చట్టం చేసిన తర్వాత.. జగన్ అనే వికృత సీమ పాలెగాడు మవిగన్ అనే పిచ్చి కారు కూత కూసిన తర్వాత.
జగన్ మోహన్ రెడ్డికి పూర్తి స్థాయి పాలేరుగామారి ” మన తెలంగాణ” అనే పత్రికలో భళా .. బాబుగారి ఊహాలోకం ! అనే పేరుతో ఆంధ్రుల రాజధానిపై విషం చిమ్మాడు.
కొద్ది రోజుల క్రితం విజయవాడ వేదికగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వేదిక మీద ఉన్న అమర్ తో చంద్రబాబు ఏంటయ్యా నువ్వు వచ్చావు? నువ్వు రాజకీయ నాయకుడివి కదా! అని చంద్రబాబు స్పందించారు. ప్రతి స్పందనగా జగనన్నియ్య లెక్క.. అమర్ షిక్కటి చిరునవ్వు షిందించారు.
చంద్రబాబు స్థానంలో జగన్ ఉండి ఉంటే ఏం జరిగేదో ఊహించండి. యూనియన్ నాయకుడు శ్రీనివాసరెడ్డికి తీవ్ర అవమానం జరిగేది. అక్కడ వుంది చంద్రబాబు కాబట్టి , అందరికి ఒత్త బుద్ది అవుతుంది. ఆ ఒత్తబుద్ది వక్రంలో భాగమే అమరావతిపై కాలకూట విషం చిమ్మడం. ఇక దేవులపల్లి అమర్ వృత్తి జీవితం- విలువలు- విశ్వసనీయత అత్యంత నిజాయితీ- మాటల్లో చెప్పలేనంత భీభత్సమైన నిజాయితీ.
అది తెలుసుకోవాలంటే ముందుగా చంద్రబాబు, వైఎస్ఆర్- ఆ తరువాత జగన్. వీరు ముగ్గురు మాత్రమే ఈ పరమ నిజాయితీపరుడి గురించి చెప్పగలిగిన వ్యక్తులు. పొరుగు రాష్ట్రానికి చెందినవాడై ఉండి, అమరావతిపై మేతావి వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చింది? దేవులపల్లి అమర్ న్యాయానికి , ధర్మానికి కట్టుబడ్డ అత్యంత నిజాయితీ జర్నలిస్టు కాబట్టి.. ఆంధ్రుల రాజధాని మవిగన్ కు మద్దతుగా చక్కటి వ్యాసం రాశాడు అని సరిపెట్టుకుందాం. స్వాగతిద్దాం.
మరి తెలంగాణ వాదిగా అనేక మంది త్యాగాలను పునాదులుగా చేసుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, 9 ఏళ్ళ తెలంగాణ జాతిపిత దొర పాలనలో జరిగిన దారుణాలపై, ఒక్క వ్యాసం ఎందుకు రాయలేదు ? ఒక్క ప్రశ్న ఎందుకు వేయలేదు ? కోదండరామ్ లాంటి వారు అరెస్టులు, నిర్భంధాలు వేధింపులకుగురయ్యారు కదా? ఇదే అమర్ స్వరాష్టంలో నోరు ఎందుకు విప్పలేదు?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ – అమర్ మధ్య అరెయ్ ఒరేయ్ అనుకునే చనువు ఉంది. తెలంగాణ గడ్డ మీద ఏబీఎన్ సంస్థపై దాడిని అమర్ ఎందుకు ఖండించలేదు? అమర్ జర్నలిస్టా ? రాజకీయ నాయకుడా ? వారం క్రితం అమర్ ఫేస్ బుక్ పోస్ట్ ఒకటి చూద్దాం. చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యగ్యంగా.. తెలంగాణా నా బ్రెయిన్ చైల్డ్. 1969 లో ఉద్యమం జరిగి 350 మందికి పైగా అమరులయ్యారని, 2001 నుండి 2014 దాకా రెండో విడత ఉద్యమం జరిగి అనేక మంది అసువులు బాశారనీ, సకల జనులు ఉద్యమిస్తే తెలంగాణా సాకారం అయిందనీ కట్టుకథలు ప్రచారం లో ఉన్నాయి, నమ్మకండి . -మిస్టర్ గోబెల్స్ ఆఫ్ అవర్ టైమ్స్.
ఇంతటి ప్రాంతీయ తత్వం విషాన్ని నిలువెల్లా నింపుకున్న అమర్, ఆంధ్రుల రాజధాని గురించి పిచ్చి రాతలు రాయడమా? అమర్ లాంటి అత్యంత నిజాయితీ పరులు తెలుకోవాల్సింది ఏంటంటే.. అమరావతి ఊహాలోకం కాదు! అవమానించినవారికే మాయాలోకం! అమరావతి గురించి మాట్లాడేటప్పుడు, కొందరి కలం నుంచి కారేది సమాచారం కాదు. అసహనం,అసూయ, జీర్ణించుకోలేని మనస్తత్వపు కడుపు మంట.
అమర్ ఆటవిక ఆ క్రోశం లో రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలకు .. ఇప్పుడు అమరావతికి చట్టబద్దత కల్పించుకోవాలన్న ఆలోచన కూటమి ప్రభుత్యానికి ఎందుకొచ్చింది అని అమర్ ప్రశ్నించారు. ప్రశ్నించిన అమర లింగానికి తెలియదా ? తన యజమాని మూడు రాజధానుల పల్లవి! వైజాగ్ మాత్రమే రాజధాని ఒకసారి.. కాదు కాదు మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం అని ఒకసారి.. అమరావతే రాజధాని అని కోర్టుకు తెలపడం.. నాగార్జున యూనివర్సిటీ దగ్గర సరిపోతుంది అని.. అనేక కారు కూతలు కూయడానికి ముందు. నిండు సభలో అమరావతిని మనసూర్తిగా రాజధానికి ఒపుకుంటున్నాం అని ఎందుకు ప్రకటించాడు.?
రాష్ట్రంలో ఎవరికీ లేనంత పెద్ద కొంప అమరావతిలో కట్టుకున్నాం.. చంద్రబాబు అద్దె కొంపలలో ఉంటున్నాడు కాబట్టి , మేము అమరావతికి కట్టబడి ఉన్నాం. భూములు ఇచ్చిన రైతులకు ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం. నాకు ఓటేయ్యండి అన్న జగన్ చిలక పలుకులు. ఆనక నేటి మనిగన్ అశుద్దాన్ని బ్రెయిన్ కు పట్టించిన దేవులపల్లి అమర్ మాత్రమే చెప్పాలి ఇప్పుడు చట్టబద్ధత అవసరం ఎందుకో ? ఎవరి బారి నుండి కాపాడటానికో అనే నిజం అమర్ కే తెలియాలి.
అత్యంత నిజాయితీపరుడైన దేవులపల్లి అమర్ మరో వ్యాఖ్య పరిశీలిద్దాం భారత రాజ్యాంగానికి మించినది మన దేశానికి ఇంకోటి లేదు అన్నారు. మరి మేతావి అమర్ గాని, తన యజమాని జమోరె గాని రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించడం లేదు.? 2029 లో వైసీపీ అధికారంలోకి వస్తే శాసనసభలో ఒక తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపి చట్టం చేసుకోవడం సాధ్యం కాని పని ఏమీ కాదుకదా అన్నారు.
ఇప్పుడు ఒక్క వైసీపీ తప్ప, అన్ని పార్టీలు అమరావతిపై చట్టం చేయడానికి ఓటు వేశాయి. 2029 ఎన్నికల్లో జగన్ గెలిచి కేంద్రంలో బీజేపీ లేదా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. వైసీపీ మద్దతు అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వుంటే మార్చేస్తాం అనేది వైసీపీ వాదన. పేటియమ్ బ్యాచ్ ది కూడా అదే వాదన. అమరావతే రాజధాని అన్న హైకోర్టు తీర్పును ఏం చేద్దాం? వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను ఏం చేస్తారు? అదే దేవులపల్లి అమర్ పరమ నిజాయితికి- ప్రవర్తనకు నిలువెత్తు నిదర్శనం. లోక్‌సభలో వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డి అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణ మీద నిగ్గు తేల్చాలి కదా అని, నిజాయితీపరుడైన అమర్ ప్రశ్నించాడు. ఇతను ఒక జర్నలిస్టు! నమ్మండి ప్లీజ్!! ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు. షేర్ మార్కెట్ పద ప్రయోగం ఇక్కడ కుదరదు. ఇక్కడ అటువంటిది ఏం జరగలేదు అని హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది.
అమర్ యజమాని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వెలగబెట్టరు కదా? అమర్ తన యజమానిని ఈ విషంపై ఐదేళ్ళ అపరిమిత అధికారం వెలగబెట్టి ఏం పీకి కట్టలు కట్టాడని అడిగాడా? ఫక్తు తెలంగాణవాది ఆంధ్రుల రాజధానిపై నేడు ఇన్ సైడర్ అని వాగటం నీది జర్నలిజమా ? జగనిజమా అని ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు. అమర్ మరో కారుకూత ఏంటంటే.. అమరావతి హైదరాబాద్ + అవుతుందో, భవిష్య నగరంగా ( ఫ్యూచర్ సిటీ) భాసిల్లుతుందో ముందు ముందు తెలుస్తుంది అని రాసుకొచ్చాడు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది. దానికి ఆనుకుని సైబరాబాద్ అభివృద్ది చెందింది. ఇప్పుడు దానికి ఆనుకుని రేవంత్ ఫ్యూచర్ సిటీ దూసుకు వెళుతుంది అనే అర్ధం వచ్చేలా అతి తెలివి ప్రదర్శించాడు.
రేవంత్ ఫ్యూచర్ సిటీ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యాఖ్యాలు ఎందుకు చేయలేదు ? రేవంత్ రెడ్డి చీరి చింతకు కడతారని భయమా? చంద్రబాబు భయస్తుడు, అసమర్జుడు అని భరోసానా ? ఈ నిజాయితీ అమరలింగం హైదరాబాద్ పాయా రుచులు గురించి కూడా ప్రస్తావించారు. హైదరాబాద్ మరి కొంత కాలానికి అభివృద్ధిలో మరిన్ని అంగలు వేయడం తప్పనిసరి. అమరావతి ఇంకా ఉయ్యాలలో బిడ్డే. అందుకే పోలికలు అనవసరం పోటీ వ్యర్ధం అని రాసుకొచ్చాడు.
నిజమే మరి! ఉయ్యాలలో పసిగుడ్డు పై నీ విషప్రయోగం ఎందుకు? కేవలం ఈర్ష్య – ద్వేషం- పగ- కసి అకారణంగా నిలువెల్లా చంద్రబాబుపై విషం నింపుకున్న నిజాయితీ జర్నలిస్టు ఈ దేవులపల్లి అమరలింగం. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండే ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో జరిగే తప్పులను ఎత్తిచూపి వార్తలు రాసిన విలేకరులను ‘మీ మైండ్ సెట్ మారాలి’ అన్న హెచ్చరిక చంద్రబాబు నుంచి వినడం..
యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు ఊడగొట్టుకోవడం కానీ అనుభవం లోకి వచ్చాయో లేదో అని ముగించాడు. దేవులపల్లి అమర్ ఒక సంస్థలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అందుకు కారణం అతని నిజాయితీ. అమర్ పనిచేసే సంస్థలో ఎడిటర్ కు దక్కాల్సిన నిజాయితీ, ఎడిటర్ పేరుతో ఆ నిజాయితీని అమర్ కొట్టేయంతో విషయం బయటకు పొక్కి నాడు ఉద్యోగం ఊడింది. ఇది అమర్ చెప్పాలకున్న నిజాయితీ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న కథ. నిజాయితీ అసలు అర్ధం. దేవులపల్లి అమర్ కు బాగా ఇష్టమైన పదం నిజాయితీ… అమర్ లాంటి కుక్కమూతి పిందెలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు వేరు… రాష్ట్ర గౌరవం వేరు.
ఒక పార్టీకి నచ్చకపోవచ్చు. ఒక నాయకుడికి అభ్యంతరం ఉండొచ్చు కానీ… రాష్ట్ర రాజధానిని- ప్రజల నిర్ణయాన్ని త్యాగాన్ని తేలిగ్గా తీసుకోవడం రాజకీయ విమర్శ కాదు. అది రాష్ట్రానికి అవమానం. హైదరాబాద్‌తో పోలిక అవసరమే లేదు. తెలంగాణ పోరాటం గొప్పది. హైదరాబాద్ చరిత్ర గొప్పది.
అందుకని ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉండకూడదా? అమరావతి ఎదగకూడదా?
అమర్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్నది అహంకారం. వైసీపీ వస్తే “చట్టం మార్చేస్తాం” అనే సంకేతం రాష్ట్ర రాజధాని ప్రతి ఎన్నిక తర్వాత మారుస్తారా? అమర్ లాంటి వారిది జర్నలిజమా లేక జగనిజమా అని పశ్నించేవారికి దేవులపల్లి అమర్ సమాధానం చెప్పాలి.
