– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టే బీఆర్ఎస్ పార్టీ నిజాయితీకి నిదర్శనం. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తు రైతులను ఆగం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేస్తు సాగునీటిని విడుదల చేయాలి.
రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదికని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవ్వాళ అక్షరాలా నిజమని తేలిపోయింది.
భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది.
ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయింది.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజిలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలి. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారును రైతులు ఉరికించి కొట్టే రోజులు తప్పవని హెచ్చరించారు.
ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది , రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.