నేటి కాలంలో చాలామంది ‘శారీరక ఆకలి’ (Physical Hunger) కి, ‘మానసిక ఆకలి’ (Emotional Eating) కి మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు.
వారి ఆరోగ్యం మరియు క్రమశిక్షణ కోసం అద్భుతమైన మరియు ఆచరణాత్మకమైన ఒక సూచన “30 సెకన్ల నియమం”.
* మైండ్‌ఫుల్ ఈటింగ్ : భోజనానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవడం వల్ల మెదడుకు, కడుపుకు మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఏర్పడుతుంది.
* ఒత్తిడి నియంత్రణ: విసుగు లేదా అలసటలో ఉన్నప్పుడు మన శరీరం ‘డోపమైన్’ కోసం ఆహారాన్ని కోరుకుంటుంది. ఆ సమయంలో ఆగి
30 సెకన్లు ఆలోచిస్తే, అనవసరమైన క్యాలరీలను అడ్డుకోవచ్చు.
* క్రమశిక్షణ: ఇది కేవలం బరువు తగ్గడానికే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడటానికి మరియు మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
అంతేకాకుండా, ఈ విధానాన్ని కంటిన్యూ చేస్తే.. మీ బరువు నియంత్రణలో ఉండి ఆరోగ్యంగా ఉంటారు.
– డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నం.