– మేధావుల వల్ల ప్రజకు, దేశానికి మేలు జరగదు
– తమిళ్ష్నాడుకు ఈ ఎన్నికల ఫలితం పెను హాని
తమిళ్ష్నాడులో పెద్దశాతం విజయం కాదు కదా కనీసం ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యా బలం కూడా సాధించలేని విజయ్ను గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఇంత వరకూ అవకాశం ఇవ్వనందుకు మేధావర్గం తెగ వాపోతోంది.
ఈ విషయంగా మేధావర్గం తన మేధను, అనన్యమైన తన విజ్ఞతను, విచక్షణా నైపుణ్యాన్ని అదేపనిగా వాంతి చేసుకుంటోంది. మన పాత్రికేయ మేధావులు అయితే విజయ్ ప్రభంజనం అంటూ వికృత పేలాపన చేసేశారు. తమిళ్ష్ పాత్రికేయులే ఆ మాట అనలేదు. ఎంతైనా తెలుగు మేధ తెలుగు మేధే.
మేధ… మేధ… మేధ…
దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన కలోనిఅల్ భావజాల మేధ, మత వాద మేధ, మతి పగిలిపోయిన మేధ, కమ్యూనిజమ్ మేధ, దేశ విరోధ మేధ, హిందూ జన విరోధ మేధ, విద్వేష వాద మేధ, చర్చ్ మేధ…
అదే విజయ్ ఒక క్రిస్టిఅన్ కాకపోయి ఉంటే, ఆ విజయ్ హిందువు అయి ఉంటే ఈ, ఇంత మేధ వాంతులుగా వచ్చేది కాదు. అసలు మన సీనిఅర్ పాత్రికేయులు ఎంత మాత్రమూ విజయ్ను
పరిగణించి ఉండేవారు కారు. ఈ దేశంలో క్రిస్టిఅన్, ముస్లిమ్ వ్యక్తులకు ఉన్న విలువ హిందువులకు ఎప్పుడు వస్తుందో?
గవర్నర్ తన ధోరణిలో, ఒక ఆలోచనా సరళిలో పని చేస్తున్నారు. ఇక్కడ గవర్నర్ తీరు ఎంత మాత్రమూ తప్పు కాదు; రాజ్యాంగ విరుద్ధం కాదు. ఆయన తన పరిధిలో ‘రాష్ట్ర ప్రయోజనాల’ కోసం తనకున్న అధికారాలతో అభినందనీయంగా, సరిగ్గా పనిచేస్తున్నారు.
‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అన్న నా మాట సరిగ్గా అర్థం కావాలంటే మామూలు మనుషులుగా మాత్రమే ఉండాలి. పాత్రికేయ మేధ, కమ్యూనిస్ట్ మేధ, జన విరోధ మేధ వీటికి అతీతంగా నేను ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అన్న మామూలు ఆలోచన చేశాను. తమిళ్ష్నాడు ప్రజలు చేసిన పెను తప్పును తన పరిధి మేరకు గవర్నర్ గొప్పగా సంబాళిస్తున్నారు.
‘కేంద్ర ప్రభుత్వం ఆజ్ఞల మేరకు గవర్నర్ పని చేస్తున్నారు’ అని మేధావర్గం నింద వేసింది. రాష్ట్రానికి మంచి జరగడం కోసం గవర్నర్ ఇలా పనిచేస్తూండడం ప్రశంసనీయమే!
‘తప్పు చేసిన ప్రజకు ముప్పును తప్పించి వీలైనంత మంచి జరిగేందుకు గవర్నర్ సరిగ్గా పని చేస్తున్నారు’ అని మామూలు మస్తిష్కం గ్రహిస్తుంది. మేధావుల వల్ల ప్రజకు, దేశానికి మేలు జరగదు.
మేధావుల్ని అసహ్యించుకుని వాళ్లను వదిలించుకుందాం.
తమిళ్ష్నాడు గవర్నర్ ప్రవర్తన విషయంగా రిపబ్లిక్ టీ.వీ.లో ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే మంచి వివరణ ఇచ్చారు; సరైన బుద్ధితో విషయ వివరణ చేశారు. ఆ వివరణ:
https://www.facebook.com/share/v/1NEUyELDAk/
తమిళ్ష్నాడుకు ఈ ఎన్నికల ఫలితం పెను హాని కలిగించింది. ఈ పెను హాని ప్రభావం ఏ మేరకు ఉండబోతోందో? తదుపరి రోజుల్లో ఏం జరగబోతోందో?
బెంగాల్ ఫలితాలను సరిగ్గా సాధించిన హిందూ – ఓటు తమిళ్ష్నాడులో ఘోరమైన తప్పు చేసింది. అందుకు తమిళ్ష్నాడు భారీ మూల్యం చెల్లించుకోనుందా? తమిళ్ష్నాడు మరో బెంగాల్ కానుందా? ఏ అద్భుతమో జరిగి తమిళ్ష్నాడుకు మత హాని, హిందూ క్షయం, అభివృద్ధి లోటు, మత దాష్టీకం, ఎకో సిస్టమ్ పనితనం తప్పిపోతాయా?
ప్రస్తుతానికి kudos to his excellency.
– రోచిష్మాన్
9444012279