- మనోభావాలు కాదు మనోవికాసం కావాలి
- ముస్లిమ్ ఫకీర్ అయిన సాయిబాబాను ముస్లిములు పరిగణించడం లేదు
- సాయిబాబా హిందువులకే ఎందుకు పట్టాడు?
- సాయిబాబాను హిందువులే ఎందుకు పూసుకున్నారు?
(సాయిబాబా – హైందవానికి విపత్తు – 11)
ఉండాల్సిన తెలివి, ఉండాల్సిన తెలివిడి, ఉండాల్సిన విజ్ఞత, ఉండాల్సిన చదువు, ఉండాల్సిన ‘సనాతన స్పృహ’ లేకపోవడంవల్ల మన సనాతనం లేదా హైందవంలో ‘సాయిబాబా కల్మషం’ కలిసిపోయిందని చాల బలంగా తెలియవస్తోంది.
‘సాయిబాబాకు వైదికత్వాన్ని పులమడం అన్నది కొందరు హిందువులు మానసికంగా ఎంతో పతనమైపోయారు అన్న బాధాకరమైన వాస్తవాన్ని తెలియజెబుతోంది’ ఒక ఫకీర్ సాయిబాబా. సాయి అని అంటే ఫకీర్ అనే అర్థం. (వ్యాసం 2లో సరైన వివరణ ఇవ్వబడింది) సాయిబాబా ముస్లిముగానే బతికి ముస్లిముగానే గతించాడు అని సాయి చరిత్ర ద్వారా తెలియవస్తోంది. “అల్లాహ్ మాలిక్” అని అలవాటుగా అంటూండే సాయిబాబాకు “సర్వం బ్రహ్మ మయం” అని అనే అలవాటు లేకపోవడం తన ముస్లిమ్ పుట్టుకకో, తన ముస్లిమ్ నైజానికో సాయిబాబా గట్టిగా కట్టుబడి ఉండడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ముస్లిమ్ ఫకీర్ అయిన సాయిబాబాను ముస్లిములు ఎంత మాత్రమూ పరిగణించడం లేదు. సాయిబాబా హిందువులకే ఎందుకు పట్టాడు? సాయిబాబాను హిందువులే ఎందుకు పూసుకున్నారు?
క్రమక్రమంగా సాయిబాబా పిచ్చి, సాయిబాబా ఉన్మాదం హిందువులకు ముదురుతూ వస్తోంది. హైందవానికి సాయిబాబా అన్నది శాపం అవుతోందా? అయిపోయిందా? హిందువుల మానసిక బలహీనత, చిత్త చాంచల్యం, బుద్ధి మాంద్యం, మానసిక రోగం, అమాయకత్వం వల్లే హైందవానికి సాయిబాబా వ్యాధి సోకి వ్యాపిస్తోంది అని అనిపిస్తోంది.
చదువు, విజ్ఞత, జ్ఞానం, వైదికత్వంపై భక్తి, మర్యాదలు లేని మానసిక రోగులైన కొందరు హిందువులు “ఓం సాయి” అంటూ ఓం కారం పవిత్రతను, ప్రామాణికతను, ప్రాధాన్యతను, పవిత్రతను భ్రష్టు పట్టించేశారు. సనాతన లేదా వైదిక ఆలయాల్లోకి ముస్లిమ్ ఫకీర్ సాయిబాబాను చొప్పించి ఆగమ, వైదిక ద్రోహం చేశారు కొందరు హిందువులు.
1965 తరువాత హిందువుల్లో సాయిబాబా పిచ్చి, ఉన్మాదం ముదురుతూ, ముదురుతూ వస్తోంది. ఋషిప్రోక్త వైదికాన్ని సాయిబాబా పిచ్చి, ఉన్మాదం చెల్లాచెదురు చేసెయ్యగల స్థితికి వచ్చేసిందేమో అన్న భయం కలుగుతోంది. సాయిబాబా పేరుతో కొందరు మన వైదికత్వాన్ని, పూజా విధానాల్ని, వైదిక సంప్రదాయాల్ని, సాటి వ్యక్తుల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. సాయిబాబా ప్రచారకులు, అనుయాయుల నుంచి సత్వరం మనం మన వైదికత్వాన్ని రక్షించుకోవాలి. హైందవంలో కలిసిన సాయిబాబా కల్మషాన్ని మనం త్వరిత గతిన తొలగించేసుకోవాలి.
మనోభావాలు కాదు మనోవికాసం కావాలి. నమ్మకాలు కాదు తెలివిడి కావాలి. వ్యక్తిగతమైన నిదర్శనాలు కాదు తాత్త్విక నిగ్గులు కావాలి, సత్యం కావాలి. సాయిబాబా ఉన్మాదం కాదు సనాతన స్పృహ కావాలి.
వైదికత్వంలో లేదా హైందవంలో సాయిబాబా సత్యం కానేకాదు.
“సాయిబాబా విషయంలో మాకు నిదర్శనాలు ఉన్నాయి” అని అనేవాళ్లు సరైన ఆలోచన చెయ్యాలి. 100యేళ్ల క్రితం హిందువుల జీవనంలో సాయిబాబాకు స్థానం ఏమిటి?
“సాయిబాబా విషయంలో మాకు నిదర్శనాలు ఉన్నాయి” అని అనేవాళ్ల ముత్తాతల కాలంలో సాయిబాబా లేడు; సాయిబాబా వెర్రి లేదు. అప్పుడు వాళ్లకు ఏ నిదర్శనాలు ఉండేవి? వాళ్లు ఏ దైవ నిదర్శనాలూ లేకుండానే బతికేశారా? సాయిబాబా నిదర్శనాలు లేని వంశాలలోనే వీళ్లు పుట్టారు. సాయిబాబా భక్తులు హైందవ కుటుంబాలకు చెందిన వారు కారా?
100యేళ్ల క్రితం లేని సాయిబాబా నిదర్శనాలు హైందవంలోకి ఇప్పుడు రావడం ఏమిటి? మన వైదిక ప్రజా జీవనం ఎప్పటిది? సాయిబాబా ఎప్పటి వ్యక్తి? ఎప్పటి నుంచో ఉన్న వైదిక జీవనంలోకి ఒక ముస్లిమ్ సాయిబాబా నిదర్శనం కొత్తగా రావడం ఏమిటి? సాయిబాబా నిదర్శనం అన్నది చిత్తభ్రమ లేదా భ్రాంతి. సాయిబాబా ప్రభావం అన్నది చిత్తభ్రమ లేదా భ్రాంతి (hallucination).
Saibaba effect is a hallucination, a misconception, a false idea, a mistaken belief, and a mental disorder.
‘సాయిబాబా భక్తుల మాట, తీరు, ఆలోచన, మనస్తత్వం, ప్రవర్తన మామూలుగానూ, తిన్నగానూ, సహజంగానూ, సరిగ్గానూ ఉండవు’ అన్న వాస్తవాన్ని మనం విరివిగా గమనించవచ్చు! సాయిబాబా భక్తులు, అనుయాయులు, ప్రచారకులు ‘అదోలా’ ఉండడమూ, ‘ఏదోలా’ ఉండడమూ, విడ్డూరంగా ఉండడమూ మనకు అనుభవంలోకి వచ్చేవే కదా?!
సాయిబాబా విషయంలో చదువు, తెలివి, తెలివిడి, విజ్ఞత వీటి ఆధారంగానూ, పిచ్చికి, ఉన్మాదానికి, మనోభావానికి అతీతమైన మనోవికాసంతోనూ, సరిగ్గానూ మనం ఉండాలి. సనాతనం లేదా హైందవానికి ఇకపై ఎంత మాత్రమూ సాయిబాబా అపాయకరంగానూ, హానికరంగాను పరిణమించకుండా మనం అప్రమత్తం అవాలి.
“సనాతనంలోంచి సాయిబాబాను పరిహరించుకొందాం;
సాయిబాబా అన్న సమస్యను
మనం శాశ్వతంగా పరిష్కరించుకొందాం”
- రోచిష్మాన్
9444012279