????????????????????????????????????
ఆర్ఎస్ఎస్ గురించి పట్టలేని ఆక్రోషంతో, ఏమి చేయాలో, ఎలా నిలువురించాలో నని నిత్యం ఆర్ఎస్ఎస్ ను ఆడిపోసుకునే మేధావులూ..మీకు మెదడుందా? ఉంటే కొంచెం వాడండి. నిజాలు తెలుసుకోండి.
ఆర్ఎస్ఎస్ పుట్టి ఇప్పటికి వంద సంవత్సరాలు అయింది ఎటువంటి పొరపొచ్చాలు, అరమరికలు,చీలికలు, వ్యతిరేక భావనలు, లేకుండా ఒకే తాటిపై ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ భారతీయ ప్రజల కోసం, నిత్యం తపనపడి సమస్య వస్తే పరిష్కారం చూసే సంస్తే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.
ఈ సంస్థ పుట్టినప్పటి నుండి దేశం కోసం సేవ చేయడమే పని దేశానికి ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి ఉపద్రవాలు జరిగిన శక్తి వంచన లేకుండా నిక్కరేసుకుని సొంత పనులు పక్కనపెట్టి సొంత డబ్బులతో కార్యరంగంలోకి దిగి పరిష్కారం అయ్యేంతవరకు అలుపెరుగకుండా పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్. వేల జీతాలు తీసుకుని పనిచేసే ఉద్యోగస్తులు కూడా కొన్ని పనులు చేయకపోతే, ఆ పనులను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే చేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కథ అవుతుంది. కనుక ఈ మధ్యన జరిగిన సంఘటనలు దేశానికి ఉపద్రవం వస్తుంది అని గ్రహించిన ఆర్ఎస్ఎస్ రెండో కంటికి తెలియకుండా తన శ్రేణులను ఎక్కడ నియమించాలో అక్కడ నియమించి విజయం సాధించిన సంస్థ ఆర్ఎస్ఎస్.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత 49 సంవత్సరాలుగా దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ.. బంగ్లాదేశ్ దేశానికి ఆనుకొని అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు నిత్యం రాకపోకలు జరిగే దేశం బంగ్లాదేశ్,రాష్ట్రం పశ్చిమబెంగాల్.
బంగ్లాదేశ్ నుండి, మయన్మార్ నుండి ముస్లింలు అధిక సంఖ్యలో (లక్షలలో ) ముఖ్యంగా అక్కడ సౌకర్యాలు సరిగా లేక, బ్రతకడానికి దారి లేక వ్యాపారాలు లేక ప్రక్కనున్న పశ్చిమబెంగాల్ కొచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని తమ ఓట్ల ద్వారా ఆకట్టుకొని ఇక్కడ ప్రజలను లోపర్చుకొని భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని.. అందుకు కావలసిన డాక్యుమెంట్ సదుపాయం కల్పించుకొని తద్వారా పశ్చిమ బెంగాల్ నుండి దేశం మొత్తం విస్తరించి దేశ వ్యతిరేక కార్యకలాపాలు, రవిడిజం, మానభంగాలు, దొమ్మీలు, దోపిడీలు, కట్మనిలు, టోల్ గేట్లు, పెట్టుకొని ఇస్టారాజ్యంగా వ్యవహారం చేయడం, తద్వారా వచ్చిన డబ్బులు కొంత డబ్బును అధికార పార్టీ నాయకులకు అందజేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ దేశానికే ముప్పు తెచ్చే పరిస్థితి వచ్చింది.
ఈ పరిస్థితిని గమనించిన ఆర్ఎస్ఎస్.. ఈ విధంగా కొనసాగితే ఈ దేశం ముక్కలవుతుంది దీనికి విరుగుడు కనుక్కోవాలి. పరిష్కారం చేయాలి. అనే ఒకే ఒక ఉద్దేశంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల జరిగే సమయానికి, సంవత్సరం ముందు నుంచి తన శ్రేణులను రకరకాల పేర్లతో రాష్ట్ర మొత్తం విస్తరింపచేసి ప్రజలను చైతన్యవంతం చేసి, మహిళలకు ఉన్న విషయాలు చెప్పి, దేశవసరాలు – రాష్ట్ర అవసరాలు చెప్పి.. గతంలో ఆ రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక రంగంలో మొదటి స్థానంలో ఉన్నది లాంటి విషయాలు, భద్రలోక్ ప్రాంతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నది? ప్రస్తుతం ఏవిధంగా ఉన్నది ఈ రాష్ట్రంలో పుట్టిన మేధావులు,రాజకీయ నాయకులు,ధర్మస్థాపకులు గురించి ఒక్కసారి గుర్తు చేసి వారి మనసులను మార్చారు.
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 లో అప్పటి భారత దేశ రాజధాని కలకత్తా నగరం దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరంగా తెలియజేసి మార్పు తీసుకొచ్చారు.
ఇది కేవలం ఈ దేశంలో ఇంకా ఏ సంస్థచేయలేని పనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు మాత్రమే చేయగలిగారు . ఈ విషయం ఈనాటి తరానికి ఈనాటి ప్రజలకు కళ్ళకు కనపడినట్టుగా బోధపడినందుకు సంతోషంగా ఉంది.
ఇది కేవలం బిజెపి రాజకీయం కోసం అధికారం కోసం మాత్రమే కాదు. దేశానికి ఉపద్రవం వచ్చింది.దేశంలో ఒక భాగం ఇష్ట ప్రకారం వ్యవహారం చేస్తుంది. రాజ్యాంగ ప్రకారం నడుచుకోవడం లేదు కనుకనే ఆర్ఎస్ఎస్ రంగం లోకి దిగి దేశాన్ని రక్షించింది.
ఈరోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి బిజెపి అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి గా సువేంద్ అధికారి ప్రమాణం చేసిన తర్వాత ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో, రవిడిజం మానభంగాలు దొమ్మీలు , దోపిడీలు, కట్మనీలు, టోల్ గేట్లు తగ్గి ఎవరి పని వారు చట్ట ప్రకారం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారు.
మీ కొక్క విషయం చెప్తాను. సాధారణంగా అక్కడ ఆటో రిక్షా వాళ్ళు టోల్గేట్ వసూలు చేసి ఆ డబ్బును స్థానిక ఎమ్మెల్యేకు తీసుకొచ్చి ఇచ్చే సంప్రదాయం ప్రకారం.. డబ్బు మూటలు తీసుకొస్తే ఆ ఎమ్మెల్యే ఏమిటి ఇది అని అడగగా వారు విషయం చెబితే… ఆ డబ్బును మీరు మీ అసోసియేషన్ అకౌంట్లో వేసి మీ రిక్షా కార్మికులకు ఏదైనా అవసరానికి ఉపయోగించుకోండి అని వెనక్కి పంపిన స్థితి.
దేశానికి ఏం చేసింది ఆర్ఎస్ఎస్ అని కూసే కుక్కలకు ఇదే నా సమాధానం. గుర్తుంచుకోండి, గ్రహించుకోండి,ఇంకెప్పుడూ ఆర్ఎస్ఎస్ గురించి తక్కువ చేసి మాట్లాడకండి.
కరణం భాస్కర్,
రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు,
7386128877