- ఏసీ రూముల మేధావితనం.. క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్!
- (గటిక క్రాంతి కుమార్)
పంతుల్లకు జీతాలు ఎక్కువ అన్నడు, పదవతరగతి పబ్లిక్ పరీక్ష ఒద్దన్నడు, ఇంటర్ మిడియట్ ను హైస్కూల్ లో కలుపుత అన్నడు, ఇంటిగ్రేటెడ్ బడులన్నడు, మండలానికి మూడు మోడల్ బడులన్నడు, బస్సులన్నడు, ఆటోలన్నడు, రేషనలైజేషన్ అన్నడు, ఎందుకో పాపం తుస్సుమన్నడు…
ఇంకో 20 రోజుల్లో బళ్ళు మొదలయ్యే టైం లో చేతులెత్తేశాడు.
కెసిఆర్ నెలకొల్పిన 1000 గురుకులాలను ముండమోపిచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గం లో 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెద్దాం అనుకుండు, అది వీలుకాకపోగా మంత్రులు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నరు,
200×119=23800కోట్లు, వామ్మో! ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలే 10,000 కోట్లు ఇవ్వక సుమారు వంద మంది చనిపోయారు.
కొత్త PRC లేదు, డి ఎ లేవు, కనీసం హాస్పిటల్ లో చూపెట్టుకుంటే బిల్లు కూడా రాటల్లే. సుమారు 50 వేల మంది అదనపు టీచర్స్, రేషనలైజేషన్ చేసే ఓపిక లేదు. ఇన్ని సమస్యలు ఉంటే నాకెందుకు సియం గారే పట్టించుకోంది అని పాపం మురళి IAS గారు జెండా ఎత్తిన్రు.
నిజానికి ఇక్కడ అసలు విచిత్రం ఏంటంటే… వ్యవస్థను మార్చడం అంటే ఏసీ రూముల్లో కూర్చుని విమర్శలు చేయడం కాదు, బాధ్యత తీసుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వం విద్యావ్యవస్థను మార్చాలని, పేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఒక పెద్ద బాధ్యతను అప్పజెప్పితే… తన పదవీ కాలం పూర్తి కాకముందే, కనీసం ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేయకుండా మధ్యలోనే చేతులెత్తేసి పారిపోవడం ఈయన అసమర్థతకు అద్దం పడుతోంది.
ఒక వ్యవస్థలో మార్పులు తెచ్చేటప్పుడు సవాళ్లు, బడ్జెట్ సమస్యలు ఉండటం సహజం. వాటిని అధిగమించడానికి పరిష్కారాలు చూపించాల్సిన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, క్షేత్రస్థాయిలో పని చేయలేక, ఆ సవాళ్లను తట్టుకోలేక ఇప్పుడు నెపాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేసి పక్కకు తప్పుకోవడం ఎంతవరకు సమంజసం?
నాడు క్షేత్రస్థాయిలో అద్భుతాలు చేసి చూపించిన ఆఫీసర్లను అవహేళన చేసిన ఈ మేధావి గారు.. ఈరోజు తనకు అవకాశం వస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క మార్పు కూడా చేయలేక, పదవి కాలం కాకముందే రాజీనామా ఇచ్చి పక్కకు తప్పుకున్నారు. చేతకాక మధ్యలోనే పారిపోయి, మళ్లీ తానేదో గొప్ప త్యాగం చేసినట్లు బిల్డప్ ఇవ్వడం చూస్తుంటే నవ్వు వస్తోంది. ఇలాంటి వాళ్లు పదవుల్లో ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే.