- కూటమి విజయానికి ఇలాంటి అన్నపూర్ణమ్మలే కారణం
- విజయం తమ వల్లే అనుకుంటే పొరపాటే
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పడిగలఅన్నపూర్ణమ్మ. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన ఆమె వయస్సు 76సంవత్సరాలు. అంత వయస్సులో కాళ్లకు చెప్పులు లేకుండా ఆమె వెళ్తుంది ఎక్కడికో తెలుసా?
గత ఏడాది ప్రజా కంటక వైసీపీని బుద్ది చెప్పి తెదేపా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టడంతో స్వగ్రామమైనజయంతి నుంచి జమలాపురం వరకు కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు ఆమె. అది కూడా పార్టీ నుంచి ఎటువంటి లాభం ఆశించకుండానే.
ఎన్నికల ముందు రెండు రోజులు హడావిడి చేసి.. పార్టీ తమ వల్లనే అధికారంలోకి వచ్చిందంటూ, అందుకు తమకే పదవులు దక్కాలని హంగామా చేసే నాయకులు ఆమెను చూసి సిగ్గు పడాలి. తెదేపా తిరిగి అధికారం లోకి వచ్చిందంటే అది కేవలం అన్నపూర్ణమ్మ లాంటి అభిమానుల సంకల్ప బలమే.
ఈ నెల 27 న పార్టీ మహానాడు సందర్భంగా ఇటువంటి నిజమైన కార్యకర్తలను స్థానికంగా అయిన సన్మానించాలి!