- ఫీజులు ఇవ్వమని ప్రభుత్వాలను బీసీలు ఎన్నేళ్లు అడుక్కోవాలి?
- మర్యాదగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే
- ప్రభుత్వానికి అఖిలపక్ష సమావేశం హెచ్చరిక
- ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం దోబూజలాడుతుంది
- సీఎంను చివరిగా హెచ్చరిస్తున్న.. బడుగు విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు
- జీవో నెంబర్ 7 ను రద్దుచేసి, పాత పద్ధతిలో ఫీజులు చెల్లించు
-బండారు దత్తాత్రేయ - బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను
- బీసీ పిల్లల ఫీజుల కోసం సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తా
- నాడు కాంగ్రెసే ఫీజుల స్కీమును పెట్టి, మళ్లీ కాంగ్రెసే ఫీజుల స్కీంను ఎగ్గొట్టొద్దన్న పేరొద్దు
- వి హనుమంతరావు
- ప్రభుత్వాలు ఏవైనా బీసీలపై చిన్న చూపే
- బీసీలు చదువుకోవాలని చిత్తశుద్ధి సీఎంకు లేదు
- విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం
- మధుసూదనా చారి
పాత పద్ధతిలో రియంబర్స్మెంట్ అమలు తర్వాతే అడ్మిషన్లు చేపట్టాలి
లేదంటే ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్ లను అడ్డుకుంటాం - బీసీ విద్యార్ది నేతలు విక్రం, మహేష్ ల హెచ్చరిక
హైదరాబాద్: జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలు, రాష్ట్ర బడ్జెట్ లో 60 శాతం పన్నులు చెల్లించి ఖజానా నింపితే, ఖజానా మీద కూర్చున్న అగ్రకుల పాలకులు, బీసీలు చదువుకోడానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఏండ్ల తరబడి అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని, ఇదే వైఖరి ప్రభుత్వాలు వివరిస్తే బీసీలు ఏకమై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అఖిలపక్ష బీసీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు
కాచిగూడ లో ఉన్న హోటల్ అభినంద్ గ్రాండ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ పై విధించిన జీవో 7 రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజుల పథకాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, బిఆర్ఎస్ శాసనసభ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, టీజేఎస్ నేత జస్వంత్ కుమార్ హాజరయ్యారు
మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్రంలోని 12 లక్షల పేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడోద్దాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని చివరిసారిగా హెచ్చరిస్తున్నామని, తక్షణమే పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఫీజుల పథకాన్ని అమలు చేయడం లేదని, ఇది పాత పథకమని దీనిని ఎత్తివేయడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేస్తుందని అందులో భాగంగానే కళాశాల యజమాన్యాలు కోర్టుకెళ్లిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగానే రాష్ట్ర హైకోర్టులో పేద విద్యార్థుల వ్యతిరేక తీర్పు వచ్చిందని, ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 7 తీసుకువచ్చి ఈ స్కీమును రద్దు చేయాలని కుట్ర చేసిందన్నారు, ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేని పరిస్థితులు ఉందా అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం ఏమైనా ధీవాల తీస్తుందా అని ఆయన మండిపడ్డారు తక్షణమే జీవో నెంబర్ 7 రద్దుచేసి, పాత పద్ధతిలో ఫీజుల స్కీమును అమలు చేయాలని దత్తాత్రేయ కోరారు
కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తనకు ప్రభుత్వ సమాధాలుగా నియమించి, అందులో బీసీ సంక్షేమ శాఖను తనకు అప్పజెప్పిందని, సీఎం రేవంత్ రెడ్డి నాకు పదవి ఇచ్చినందుకు నాకు ఒక్కనికి సంతోషం కాదని, మొత్తం బీసీలు సంతోషపడితేనే తాను సంతోషపడతానని ఆయన తెలిపారు
గతంలో 20O8లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతో గొప్పగా తీసుకువచ్చిందని, దానిని ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజుల స్కీం ఎగ్గొట్టిందని పేరు తీసుకురావద్దని ఆయన తెలిపారు
ఫీజు రీయింబర్స్ మెంట్ పై రోజురోజుకు తనపై బీసీల నుండి ఒత్తిడి పెరుగుతుందని, అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ను కలిసి పాత పద్ధతిలో పేదల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజుల బకాయిలను విడుదల చేయాలని కోరుతానని విహెచ్ తెలిపారు
బిఆర్ఎస్ శాసన మండలి పక్షనేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఏవైనా బీసీల పట్ల మొదటి నుండి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని, పన్నులు కట్టడమే బీసీల వంతు అయిందని, బీసీలకు నిధులు విడుదల చేయాలంటే అగ్రకుల ప్రభుత్వాలకు మనసు రావడంలేదని టిఆర్ఎస్ శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు
ప్రభుత్వాలు మారినప్పుడు ఆస్తులు పెంచడం, అప్పులు పంచడం సాధారణంగా జరిగేది అని, గత ప్రభుత్వం ఫీజులు బకాయిలు పెట్టిందని ఈ ప్రభుత్వం అసలు ఫీజుల రీయింబర్స్ మెంట్ నే రద్దు చేస్తామని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు మూసీ సుందరీ కరణ, ఫ్యూచర్ సిటీ పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, 12 లక్షల మంది పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం 7500 కోట్లు ఇవ్వలేడా అంటూ ఆయన ప్రశ్నించారు, బీసీలు ఇంకా ఎన్ని రోజులు అడుక్కోవాలని, ఫీజుల నిధులు ఇచ్చేవరకు బీసీ సంఘాలు చేస్తున్న పోరాటాన్ని అఖిలపక్షం మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ లు మాట్లాడుతూ, పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసిన తర్వాతనే రాష్ట్రంలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ చేపట్టాలని, ఫీజులపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం మొండిగా కౌన్సిలింగ్ నిర్వహిస్తే వేలాదిమంది విద్యార్థులతో కౌన్సిలింగ్ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు
ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ కో చైర్మన్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జెఎసి కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర, టీజేఎస్ పార్టీ ప్రతినిధి జస్వంత్ కుమార్, బీసీ జేఏసీ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, వేముల రామకృష్ణ, దీటి మల్లయ్య, కౌలే జగన్నాథం, గోద వరుణ్ కుమార్ గౌడ్, నరసింహ నాయక్, జిల్లెల నరసింహ, తారాకేశ్వరి, సమతా యాదవ్, సంధ్యారాణి, స్వర్ణ గౌడ్, కొప్పుల చందు గౌడ్, గజ్జల సత్యరాజ్ గౌడ్, సుజాత, గౌతమి, ఇంద్రం రజక, గూడూరు భాస్కర్ , నాగరాజుగౌడ్, మాదేశి రాజేందర్, నరసింహ చారి, బ్రహ్మచారి, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు