- కాపు జాతి కోరికను నెరవేర్చండి
- సీఎంకు కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి శ్రీనివాస్ లేఖ
విజయవాడ: ప్రజల నాయకులు వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ ని రాజ్యసభ సభ్యులు గా ఎంపిక చేయాలని సిఎం చంద్ర బాబు నాయుడు ను కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి శ్రీనివాస్ కోరారు. ఇది రాష్ట్రంలోని కాపు జాతి డిమాండే కాదు. కోరిక కూడా అని స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు.
.కోట్లాది మంది పేద ప్రజల నాయకులు, వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం లో కీలకమైన పాత్రను పోషించారు అని సిఎం చంద్ర బాబు నాయుడు కి శ్రీనివాస్ గుర్తుచేశారు. 1989 లో విజయవాడ శాసనసభ్యులు రంగా పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో, రాజకీయ హంతకులు హత్య చేశారు.
రంగా హత్య వల్లే 1989 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. రంగా పేరు కృష్ణ జిల్లా కి పెట్టాలి అని సిఎం రాజశేఖర రెడ్డిని అనేక సార్లు కోరినా తిరస్కరించారు అని, రంగా వర్ధంతి, జయంతి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా నిర్వహించి, జిల్లా కి పేరు విషయంలో వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు.
అత్యంత నిజాయితీ నాయకుడు గా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ కు రాజ్యసభ సభ్యులు గా ఎంపిక చేయాలని, కూటమి ప్రభుత్వం సమిష్టి బాధ్యత వహించాలని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కి రాసిన మరొక లేఖలో విజ్ఞప్తి చేశారు