(సాయిబాబా – హైందవానికి విపత్తు – 12 )
వైదిక ఆరాధనా పద్ధతులకు, ఆగమ విధులకు, హైందవ ఆలయ పూజా విధానాలకు, హిందు భక్తి సంప్రదాయాలకు, ధూపం, దీపం, హారతి, అర్చన, అభిషేకం, అష్టోత్తరం, భజన వంటి వైదిక దైవ కైంకర్యాలకు, శాస్త్రోక్త, సాంప్రదాయిక దైవ పూజా విధి విధానాలకు సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల గత కొన్ని దశాబ్దులుగా తీవ్ర దోషాలు, అవమానాలు జరుగుతున్నాయి.
హైందవ ఆగమ విధులు, హైందవ సంప్రదాయాలు, హైందవ ఆరాధనా పద్ధతులు సాయిబాబా భక్తుల వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి. సాయిబాబా భక్తుల వల్ల నిజమైన హిందువులు తీవ్రంగా మతం, సంప్రదాయం పరమైన ఆవేదనకు, దాడికి గురౌతున్నారు.
‘సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల వైదిక ఆరాధనా విధానం పెను అపాయం లేదా ఆపదలో ఉంది’ ఈ అపాయం లేదా అవరోధం నుంచి హైందవాన్ని తక్షణమే చట్టరీత్యా కూడా రక్షించుకోవాలి.
సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల హైందవ ధార్మికత కలుషితం అయింది; అవుతోంది. ఈ సమస్యకు చట్ట రీత్యా కూడా శాశ్వత పరిష్కారాన్ని సాధించాలి.
సాయిబాబా అన్న అవైదిక శక్తికి భారతీయ వేద, పురాణ, ఇతిహాస, తంత్ర, మంత్ర వాఙ్మయంలో మూలం లేదు; ప్రస్తావన లేదు; స్థానం లేదు. సాయిబాబా ఎంత మాత్రమూ హైందవ దైవం కాదు. ఈ కారణాల వల్ల హైందవ లేదా సనాతన ఆగమ, పూజ, ఆరాధనా పద్ధతులు, హారతి, దీపం, ధూపం, అభిషేకం, భజనలు వంటివి సాయిబాబాకు జరగడం సరికాదు; అవి వైదికం, హైందవం కాదు’.
సాయిబాబా అన్న అహైందవ, అవైదిక, అధార్మిక, అసనాతన వ్యక్తికి వైదిక పద్ధతులలో పూజలు, ఆరాధనలు జరగడం సనాతన ధర్మ విరుద్ధం; సనాతన ధర్మ హాని. సాయిబాబా వల్ల, సాయిబాబా భక్తుల వల్ల హిందూ మతం ఛిద్రం అయ్యే అపాయం ఉంది.
కాబట్టి దేశ, రాష్ట్ర హైందవ, ధార్మిక సంఘాలు, చట్ట నిపుణులు ‘హిందూ స్పృహతో’ పూనుకుని న్యాయస్థానాలలో కేసులు వేసి సాయిబాబా నుంచి, సాయిబాబా భక్తుల నుంచి వైదిక ధర్మాన్ని, హైందవ ఆరాధనా విధానాన్ని, హైందవ భక్తి జీవనాన్ని, హిందూ మతాన్ని, హిందువుల్ని రక్షించుకోవాలి. హిందూ మతం సాయిమతం అయిపోకుండా చట్టపరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి.
- హైందవ దైవాల ఆలయాల్లో సాయిబాబా అన్న అవైదిక వ్యక్తి విగ్రహాన్ని నిషిద్ధం చెయ్యడం;
- సాయిబాబాకు ‘ఆలయాలు’ అన్న అహైందవ విధానాన్ని నిషేధించడం;
- సాయిబాబా శిల్పాలకు, చిత్రాలకు హిందూ దేవి దేవతల ఆహార్యాన్ని నిషేధించడం;
- సాయిబాబా శిల్పాలకు, చిత్రాలకు హైందవ సాంప్రదాయిక విబూది రేఖలు, బొట్లు నిషేధించడం;
- సాయిబాబా అవైదికం, అపౌరాణికం కాబట్టి హైందవ దైవాలకు జరిగే కైంకర్యాలు సాయిబాబాకు నిషిద్ధం చెయ్యడం;
- సాయిబాబాకు భారతీయ తంత్ర శాస్త్రానికి సంబంధం లేదు కాబట్టి సాయిబాబాకు వైదిక తాంత్రిక విధానం అయిన మంత్రాలు, యంత్రాలు, అర్చనలు, అష్టోత్రాలు, అభిషేకాలు, హారతులు, దీపారాధనలు, భజనలు, ధూపాలు నిషిద్ధం చెయ్యడం;
- వివాహం, సత్యనారాయణ వ్రతం, శ్రాద్ధ కర్మలు, గృహప్రవేశం కార్యక్రమాల్లో సాయిబాబా చిత్ర పటాలను, సాయిబాబా ఫోటోలకు దీపారాధనలు, అర్చనలు నిషేధించడం;
- సాయిబాబాను హైందవంలో కలిపెయ్యాలన్న కుట్రలో వచ్చిన అసత్య, దుష్ట సాహిత్యం, రచనలను నిషేధించడం;
- హిందూ దేవీ దేవతలతోనూ, హిందూ మత చిహ్నాలతోనూ సాయిబాబా చిత్రపటాల ప్రచారాన్ని నిషేధించడం;
- బహిరంగ ప్రదేశాల్లో హిందూ దైవాల సరసన సాయిబాబా బొమ్మల ప్రదర్శనను నిషేధించడం;
- సాయిబాబా హిందువు కాదు అని ఆధికారికంగా షిర్డీ సాయి సంస్థాన్ ప్రకటించింది అని తెలియవస్తోంది కాబట్టి షిర్డీతో సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న సాయిబాబా ఆలయాలు అనబడుతున్న వాటిల్లో హైందవ అర్చకుల్ని నిషేధించడం;
- హిందూ మత విశ్వాసాలకు సాయిబాబా భంగం, పెను విఘాతం కనుక సాయిబాబా ప్రచారకులపై, సాయిబాబాకు హైందవ ఆరాధానా పద్ధతుల్ని అన్వయిస్తున్న అర్చకులు, పూజారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ సాయిబాబా పరంగా సకల ప్రమోషన్లపై నిషేధం…
ఇటువంటి ప్రధాన అంశాలతో ముఖ్యమైన కోర్టుల్లో సరైన కేసులు వేసి వాటిని చట్టబద్ధంగా నిరోధించాలి; వెనువెంటనే వాటిపై స్టే అయినా తీసుకోవాలి.
ఈ విషయంగా హిందూ సంఘాలు, చట్ట నిపుణులు
చట్టపరమైన కార్యాచరణ చెయ్యాలి. హైందవ ధర్మానికి సాయిబాబా అపాయం నిర్మూలనం అవ్వాలి; హిందూ సంఘాలు సాయిబాబా విషయంలో చట్టం, కోర్టుల ద్వారా విజయం సాధించాలి.
హిందూ సంఘాలు, చట్ట నిపుణులు వైదిక ధర్మాన్ని, ఆగమ సంప్రదాయాల్ని, పూజ, ఆరాధనాది సంస్కారాల్ని సాయిబాబా రహితం చేసి సంరక్షించాలి. సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల హిందువులకు, సనాతనానికి కలుగుతున్న తీవ్ర ఆవేదన, అవమానాల నుంచి విముక్తి కలిగించాలి.
హైందవం ఎదుర్కొంటున్న సాయిబాబా అన్న వికృత సమస్యకు చట్ట పరమైన చర్యలతో శాశ్వత పరిష్కారాన్ని సాధించాలి. ఎట్లా అయితే చట్టపరంగా అయోధ్య రామాలయాన్ని హిందూ సమాజం సాధించిందో అట్లా చట్టపరంగా సాయిబాబా రహిత హైందవాన్ని కూడా హిందూ సమాజం సాధించాలి.
“సాయిబాబాను తొలగించి వైదికత్వాన్ని శుద్ధి చేసుకుందాం;
సాయిబాబా రహిత హైందవాన్ని సత్వరం సాధిద్దాం”
- రోచిష్మాన్
9444012279