- సింగరేణిలో స్కాముల తప్ప స్కీములు లేవు
- ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యే పై కేసు పెట్టారా?
- నరుకుతా అన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పై కేసులు పెట్టారా?
- ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడారు.
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
హైదరాబాద్: నా పైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్లు తెలిసింది. నేను సింగరేణి కార్మిక సంఘం మీటింగ్ లో మాట్లాడిన మాటలను వక్రీకరించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం అయిందని హరీష్ రావు చెప్పారు. సింగరేణిలో స్కాముల తప్ప స్కీములు లేవు.
హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రజల దృష్టి మరల్చడానికి నేను మాట్లాడిన మాటలను బయట పెట్టారు. నాపైన కేసు పెట్టాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. నా పైన పెట్టే దృష్టి సింగరేణిపై పెట్టండి. సింగరేణిని సీఎం బామ్మర్దికి అప్పగించారు నాపైన తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు ఉన్నాయి. సీసీఎస్ డార్క్ సెల్ తో సహా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్నాను
సింగరేణి కార్మికులు, ప్రజల ఓట్లతో నేను రెండు సార్లు గెలిచాను. ప్రజల దృష్టిని మరల్చడానికి నా వ్యాఖ్యలను చీప్ ట్రిక్ కింద వాడారు. నా పైన కేసు పెడితే పెట్టుకోండి. సీఎం కార్యాలయం డైరెక్షన్ మేరకు నన్ను ట్రోల్ చేస్తున్నారు. మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో.
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నన్ను ఇబ్బందులు పెట్టి జైలుకు పంపారు. ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యే పై కేసు పెట్టారా.? నరుకుతా అన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ పై కేసులు పెట్టారా? .నిజంగా కేసులు పెట్టాలంటే సీఎంతో సహా అందరిపై కేసులు పెట్టాలి
ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. సింగరేణి ఏరియాకు, రైతుల కొనుగోలు కేంద్రానికి వెళ్దామా పొన్నం ప్రభాకర్? రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ఏ వర్గం సంతృప్తిగా లేదు. నేను మాట్లాడిన అంశాలపై కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. నా పైన పెట్టే శ్రద్ధ, రైతులపై పెట్టండి. నాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది.నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తోంది.
శ్రీలంకలో, బంగ్లాదేశ్ లో ప్రజలు తిరగబడునట్లు తెలంగాణలోను ప్రజల తిరుగుబాటు వస్తుం. సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించే లోగా రైతుల సమస్యలు తీర్చాలి. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పొన్నం ప్రభాకర్ అనడం హాస్యాస్పదం. నేను కార్మికులు,రైతుల ఆక్రోశం,ఆవేదన గురించి మాట్లాడాను.
ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,పల్లె రవికుమార్ , కురువ విజయ్ కుమార్ , తుంగ బాలు , పడాల సతీష్ రాజేష్ , రవీందర్ రెడ్డి , హరిబాబు తదితరులు పాల్గొన్నారు.