ఆ కళ్ళలో చూడు —
మరో రెండు దశాబ్దాల కలలు కదులుతున్నాయి!
ఆ అడుగులో చూడు —
కోటికి పైగా కుటుంబాల క్వాంటం లెక్కలు దాగున్నాయి!
ఆ చూపులో చూడు —
కోటి తెలుగు యువతకు జవాబు ఉంది!
తెలుగు జాతిని
ప్రపంచం గర్వపడేలా నిలిపిన ఆయనే…
ఆంధ్రాను అగ్రస్థానంలో నిలపాలని,
పారిశ్రామిక ప్రదేశ్‌గా..
ప్రకృతి వ్యవసాయ పవిత్ర భూమిగా..
అత్యధిక తలసరి ఆదాయంతో తలెత్తుకోవాలని..
అంతర్జాతీయ రాజధాని నగరం నిర్మించాలని..
వడివడిగా అడుగులు వేస్తున్నారు
తన వెంట నడవాలంటే — పరుగు పెట్టాలి!
ఆయన ఆలోచనలు అందుకోవాలంటే — ఏఐ వేగంతో నేర్చుకోవాలి!
ఆయన కలల్లో పాలుపంచుకోవాలంటే — అదృష్టం వుండాలి!
ఈ అడుగులు కేవలం రాజకీయం కోసం కాదు, ఒక సమాజం యొక్క ఆలోచనా విధానాన్ని (డీఎన్ఏ) మార్చడం కోసం. సంక్షేమంతో పాటు ప్రజలను “ఉత్పాదకత, సంపద సృష్టి” వైపు మళ్లించే సరికొత్త మెంటార్షిప్ ఇందులో కనిపిస్తోంది.
సాధారణ నాయకుడు ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా పాలిస్తే… ఈ దార్శనికుడు జాతిని భవిష్యత్తు వైపు నడిపిస్తాడు.