రాత్రి అటు హార్టికల్చర్ హబ్ రాయలసీమ నుండి ఇటు ఏఐ డాటా సెంటర్ హబ్ ఉత్తరాంధ్ర వరకు వరుణ దేవుడు కరుణించి వర్షం కురిపించాడు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అని నమ్మి, జన జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా, తెలుగు జాతిని ప్రపంచ పటంలోనే గర్వపడేలా నిలబెట్టాలని తపించే ఒకే ఒక్క పార్టీ… తెలుగుదేశం.
ఆ పార్టీ ‘మహానాడు’ అంటే కేవలం ఒక సభ కాదు; అది కోట్లాది మంది తెలుగువారికి ఒక మహాపండుగ! రాష్ట్రవ్యాప్తంగా తోరణాలు కట్టి, పసుపు జెండాలు ఎగురవేసి ఏర్పాట్లన్నీ సర్వాంగ సుందరంగా పూర్తి చేశారు.
నిన్నటి వరకు భానుడి భగభగలు, నిప్పులు చెరిగే సెగలతో జనం అల్లాడిపోయారు. కానీ రాత్రి కురిసిన వర్షం చూస్తుంటే… ఆ పసుపు దేవాలయాలన్నీ తానాలు (స్నానాలు) ఆడి, సరికొత్తగా పసుపు పారాణి అద్దుకుని ముస్తాబయ్యాయా అన్నట్లుగా ఉంది!
రాత్రి తీసిన ఈ చిత్రంలో రాత్రి కురిసిన వర్షానికి తడిసిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఆ పసుపు కాంతుల వెలుగులో ఒక పవిత్ర దేవాలయంలా ఎంత శోభాయమానంగా ప్రకాశిస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ, గతంలో ఇదే ఆలయంపైకి జొరబడి విధ్వంసం సృష్టించింది ఒక రాక్షస మూక. ఆ పాపాలను చూసే, సమాజంలోని దేవుళ్లు వారి స్క్రిప్ట్‌ను కేవలం ‘పదకొండు’కే పరిమితం చేస్తూ తీర్పు రాశారు. ఫలితంగా, ఆ మూకలు ఇప్పుడు తమ ప్రధాన కార్యాలయానికి అద్దె కట్టడం కూడా దండగనుకుని, ప్యాలెస్ గోడల వెనక్కి సర్దుకోవాల్సి వచ్చింది.
జన శ్రేయస్సును కాంక్షించే పసుపు ఆలయాలకు రాత్రి ప్రకృతి స్వయంగా జలాభిషేకం చేయించింది. రాష్ట్రవ్యాప్తంగా పసుపు పండుగ సంబరాలు మిన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఈ మహోత్సవాన్ని ఎంతో గర్వంగా, కళ్లారా తిలకిస్తున్నారు!