- రేవంత్ రెడ్డికి అడ్వైజర్,గైడ్ ఎవరు?
- రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం
- కలెక్టర్ పై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాము
- తెలంగాణలో టీడీపీ ఆఫీసు ఎందుకు?
- అమయ్ కుమార్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు?
- ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
హైదరాబాద్: హరీష్ రావు వెయ్యి కోట్ల భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. తేలు కుట్టిన దొంగల్లా ప్రభుత్వం వైఖరి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాటవేత ధోరణికి పాల్పడ్డారు. తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే సీఎం, రెవిన్యూ శాఖా మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? జిల్లా కలెక్టర్ ను కవచ కుండలాలుగా వాడుకుంటున్నారు. హైకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పింది అని కలెక్టర్ ఒప్పుకున్నారు.రెవిన్యూ చట్టాన్ని తుంగలో తొక్కి ఎమ్మార్వో ఆర్డర్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తే ఒక్కరు సమాధానం చెప్పడం లేదు.
వేల కోట్ల భూమి ఎమ్మార్వో సంతకంతో కేటాయింపులు చేస్తారా? హైకోర్టు వెకేషన్ పూర్తి అయిన తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధైర్యంతోనే రాష్ట్రంలో భూ దోపిడీ జరుగుతోంది. ఎమ్మార్వో,కలెక్టర్ కుమ్మక్కు అయ్యి షాపూర్ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి, కలెక్టర్, ఎమ్మార్వో ఎవరిని అయినా వదిలిపెట్టం.
కలెక్టర్ పై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాము. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం నడుస్తోంది. రాష్ట్రంలో డ్రామా, దోపిడీ ప్రభుత్వం నడుస్తోంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి తాయిలాలకు లోబడి పని చేస్తే అధికారులు దోషులు అవుతారు. భయం, భక్తి ఉన్న ముఖ్యమంత్రి ప్రజలకు భయపడతారు. రేవంత్ రెడ్డికి ప్రజలు అంటే లెక్క లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విషం పెట్టుకుని పరిపాలన చేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి అడ్వైజర్,గైడ్ ఎవరు? ఇప్పుడు సునీల్ కనుగోలును ప్రభుత్వ పబ్లీసిటీ అడ్వైజర్ గా పెట్టుకుంటారు అంట. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సలహాదారులను నియమిస్తే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ఇళ్ళు కూలగొట్టడం, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేయడం రేవంత్ రెడ్డి పరిపాలన. రేవంత్ రెడ్డికి, సునీల్ కనుగోలకు బెస్ట్ ఆఫ్ లక్.
రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతోంది. టీడీపీ నేత బక్కని నర్సింహులు షాద్ నగర్ లో పుట్టి, చంద్రబాబు నాయుడు మెప్పు కోసం తెలంగాణ గురించి మాట్లాడారు.
తెలంగాణలో టీడీపీ ఆఫీసు ఎందుకు? ఆంధ్రా పెద్దల మెప్పు కోసం బక్కని నర్సింహులు మాట్లాడారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధిస్తామని యనమల రామకృష్ణుడు అంటే కేసీఆర్ పట్టుబట్టి చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి.
భూమికి సంబంధించిన అంశాల్లో రెవిన్యూ మంత్రికి భాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించాము కానీ రెస్పాండ్ కాలేదు. ఎమ్మార్వో ను ట్రాన్స్ఫర్ చేశారు. కలెక్టర్ సంజాయిషీ ఇచ్చారు. అంటే తప్పు జరిగినట్లే కదా? కరీంనగర్ లో కండక్టర్ మక్కలు కొనమంటే సస్పెండ్ చేశారు. ఎమ్మార్వోను ఎందుకు డిస్మిస్ చేయలేదు?
మైనారిటీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ (టీంరిస్ )చైర్మన్ పేరు చెప్పమని అంటున్నారు. కానీ సిగ్గుతో పేరు చెప్పడం లేదు. ఆ వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఎలా కాపాడుతున్నారు సిగ్గు లేదా? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆయన ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు అంట.ఆ లీడర్ ను ఎందుకు కాపాడుతున్నారు? ఆ లీడర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ లీడర్ హోంమంత్రిగా చెలామణీ అవుతున్నారు.
నేను అనేక ముఖ్యమంత్రులను దగ్గర ఉండి చూశాను. క్కడైనా సీఎం దగ్గర ఉన్న వాళ్ళు తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. అమయ్ కుమార్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు. అమయ్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న లింక్ ఏంటి? కచ్చితంగా మహేశ్వరం నియోజకవర్గంలో భూదాన్ భూముల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి.