2026 మే 18 నుంచి 21 వరకు అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రధాన సైనిక విన్యాసంలో భారత సైనికులు అసాధారణ సాహసం ప్రదర్శించారు. 70 దేశాల సాయుధ దళాల మధ్య భారత స్పెషల్ ఫోర్సెస్ తమ అద్భుతమైన, వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రపంచానికి చూపించాయి. ఈ కార్యక్రమం అమెరికాలో నిర్వహించిన “స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ వీక్” సందర్భంగా జరిగింది. ఫ్లోరిడాలో కొనసాగుతున్న అతిపెద్ద బహుళజాతి యుద్ధ విన్యాసం “ఎక్సర్సైజ్ సదర్న్ స్ట్రైక్”లో భారత సైనికులు చూపిన ధైర్యసాహసాలకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కమాండోలు సైతం ప్రశంసలతో సెల్యూట్ చేశారట..!
ఈ కార్యక్రమం ఫ్లోరిడాలోని టాంపా వాటర్‌ఫ్రంట్ వద్ద మే 18 నుంచి 21 వరకు జరిగింది. భారత సాయుధ దళాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్ నాయకత్వం వహించారు.
ఇప్పుడు అక్కడ ఏమి జరిగిందో చూద్దాం :100 గంటలకు పైగా నిరంతర యుద్ధ విన్యాసాల్లో భారత బృందం “జీరో ఎరర్” స్కోర్ సాధించిందట. అడవి యుద్ధం మరియు ఉగ్రవాద వ్యతిరేక మాక్ ఆపరేషన్లలో అమెరికా సైన్యాన్ని కూడా అధిగమించిందని చెబుతున్నారు. 40°C ఉష్ణోగ్రతలు, బురద నేల పరిస్థితుల మధ్య భారత సైనికులు అత్యధిక సహనశక్తిని ప్రదర్శించారట.
“హెల్ వీక్” పరీక్ష: 5 రోజులు, 120 గంటలు, నిద్ర లేకుండా యుద్ధ మిషన్లు. అమెరికా సైనికులు మూడో రోజుకే అలసిపోయారని, కానీ భారత బృందం చివరి రోజు వరకు పూర్తి వేగంతో కొనసాగిందని చెబుతున్నారు.
స్వాంప్ వార్ఫేర్: ఫ్లోరిడా బురద ప్రాంతాల్లో, 42°C ఎండలో, మొసళ్లతో నిండిన నీటిలో జరిగిన క్లోజ్-క్వార్టర్స్ యుద్ధ విన్యాసాల్లో భారత సైనికులు లక్ష్యాన్ని కేవలం 8 నిమిషాల్లో చేధించారట _ అమెరికా రికార్డు మాత్రం 12 నిమిషాలట..!
తుది పోరు: చివరి రోజు జరిగిన మాక్ యుద్ధంలో భారత-అమెరికా సంయుక్త బృందానికి ఒక భారత కెప్టెన్ నాయకత్వం వహించారు.
ఫలితం — శత్రు స్థావరాన్ని కేవలం 15 నిమిషాల్లో ధ్వంసం చేశారు.
ఒక అమెరికన్ బ్రిగేడియర్ జనరల్ బహిరంగంగానే ఇలా అన్నారట:
“భారత సైన్యం పరిస్థితులకు తగినట్లుగా మారుకునే సామర్థ్యం, మానసిక దృఢత్వం ప్రపంచంలోనే అత్యుత్తమాల్లో ఒకటి.”
విన్యాసాలు ముగిసిన తరువాత అమెరికా సైనికులే భారత జెండాను ఎత్తి పట్టుకుని “భారత్ మాతా కీ జై” నినాదాలు చేశారు.
ఫ్లోరిడా ఆకాశంలో మూడు రోజుల పాటు త్రివర్ణ పతాకం రెపరెప లాడిందట. ఒక అమెరికన్ కమాండర్ నేరుగా ఇలా అన్నాడు: “మేము ఎన్నో దేశాల సైన్యాలతో కలిసి శిక్షణ పొందాం. కానీ భారత సైనికుల ధైర్యసాహసాలు మరో స్థాయిలో ఉంటాయి.”
ప్రపంచం మొత్తం చూస్తోంది — ఇది నూతన భారతదేశపు వీరత్వం..!
జై జవాన్ జై హింద్
— జిబన్ ఆనంద్ మిశ్రా
(సుబ్బారావు పొనుగుపతి)