September 15, 2026

రక్తం నీరు కలసి ప్రవహించలేవు!

పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఫహల్గాం లో భారతీయుల మీద దాడి చేసిన తరువాత భారత్ పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి.

భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి కఠినంగా వ్యవహరించింది.

ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తో తటస్థ వేదికల మీద కూడా ఏ విధమైన క్రీడా పోటీలలో పాల్గొనకూడదని మెజార్టీ దేశీయుల భావన..కానీ ICC నిబంధనల ప్రకారం ఆడవలసి ఉన్నందున భారత్ ముందుకు వెళ్లడానికి నిర్ణయం తీసుకొని ఆసియా కప్ లో పాల్గొన్నప్పటికీ పాకిస్తాన్ క్రీడా కారులతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సుముఖత చూపలేదు.

ఆసియా కప్ ట్రోఫీ గెలిచిన భారత్ మెన్స్ జట్టు టఏసీసీ చీఫ్ & పీసీబీ చైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది.

దీంతో తీవ్ర అసహనానికి, కోపానికి గురైన మొహ్సిన్ నఖ్వీ, రన్నరప్ అయిన పాకిస్థాన్ ఆటగాళ్లకు మెడల్స్ కూడా ఇవ్వకుండా ఆ బాధ్యతను మరొకరికి అప్పగించి ట్రోఫీని తీసుకుని స్టేడియం నుండి కోపంగా వెళ్లిపోయాడు.

భారత్‌కు ట్రోఫీ కావాలంటే వారి కెప్టెన్ స్వయంగా దుబాయ్‌లోని ACC ఆఫీస్‌కు వచ్చి కలెక్ట్ చేసుకోవాలని ప్రకటన ఇవ్వడం.. భారత్ ఈ విషయంలో ICC జోక్యాన్ని కోరడం అంతా మనకు తెలిసిందే. ICC కూడా మొహ్సిన్ నఖ్వీ తీరును తప్పు పట్టింది. ట్రోఫీ భారత్ కు ఇవ్వాలి అని ఆదేశించింది.అయినా మొహ్సిన్ నఖ్వీ మొండి పట్టు వీడలేదు.

మళ్ళీ 2026 సెప్టెంబర్ లో ఇదే పునరావృత్తం అయ్యింది.అయితే ఈసారి భారత్ మహిళల జట్టు.
ఇప్పుడు కూడా భారత జట్టు తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోదని స్పష్టంగా తెలిసినప్పటికీ, మొహ్సిన్ నఖ్వీ వేదికపైనే ఉంటూ, తానే స్వయంగా ట్రోఫీ ఇవ్వాలని పట్టుబట్టడం చూస్తుంటే… భారత్ ఒత్తిడికి లొంగి ఆయన పక్కకు తప్పుకుంటే, అది పాకిస్తాన్ దేశానికి మరియు ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి ఓటమి అంగీకరించినట్లు అవుతుంది. ఇది అవమానంగా మారుతుందని బహుశా పాకిస్తాన్ భావించి ఉంటుంది.

ఈ విషయంలో నఖ్వీ సాధించింది ఏమిటి? భారత్ ఒత్తిడికి లొంగి తాను వేదిక దిగిపోలేదని పాకిస్తాన్ దేశీయ మీడియా ముందు చెప్పుకోవడానికి, ఆయనకు ఒక ఇగో సాటిస్ఫక్షన్ మాత్రమే దక్కింది. కానీ, క్రీడా స్ఫూర్తి పరంగా మరియు ఒక క్రికెట్ నిర్వాహకుడిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు.

ఈయన మీద ICC చర్య తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆపరేషన్ సింధూర్ లో దారుణంగా ఓడిపోయినా కూడా మేమే గెలిచాం అని అక్కడి ప్రజలను భ్రమల్లో ఉంచే ప్రయత్నం పాకిస్తాన్ ఈ నాటికి చేస్తూనే ఉంది.

ఇదే సమయంలో భారతదేశం తన జాతీయ ప్రయోజనాలు, రాజకీయ వైఖరి విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పింది. పాక్ అంతర్గత మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదనే తమ నిర్ణయానికి భారత్ చివరి వరకు కట్టుబడింది.

రక్తం నీరు కలసి ప్రవహించలేవు అని భారత్ చేస్తున్న వాదన కూడా నఖ్వీ వైఖరి తో స్పష్టం అయింది.

  • కౌండిన్యస
Total Visitors: 2,611,374