నువ్వు చచ్చి గీపెట్టినా ఓటరన్నో నేను మారనంటే మారనన్నో…

జగన్ మారాలి అంటున్న భక్తులు ….
పాట రూపంలో వేడుకోలు …
వైసీపీ సర్కిల్స్ లో వైరల్ (ట)….
చుట్టూ ఉన్నవారిని వదిలించుకోవాలంట…
జగన్ సోషల్ మీడియా దీనికి వత్తాసు ,,,,,
వీసమెత్తు కూడా మారని జగన్ ….
అదే కక్ష రాజకీయాలు ….
కూటమి పై అవే అసత్య ప్రచారాలు….
అదే “జగనిజం”…
‘జగన్’ అంటే … 2019 నాటి పబ్లిక్ పర్సెప్షన్ ఇప్పుడేదీ !? అప్పుడు – చట్టబద్ద జీవనం సాగించే పౌరులకు ఆయన ఒక భరోసా . ఒక ఆత్మీయత . ఒక రాజన్న కొడుకు . తండ్రి లేని బిడ్డ . కుల మతాలకు అతీతుడు . మనింటి మనిషి . ఇప్పుడు – .ఒక కక్ష . ఒక కార్పణ్యం. ప్రత్యర్థులపై ఒక దాడి . ఒక ఫ్యాక్షనిస్టు ….ఒక అరాచకం ….ఒక కరడు కట్టిన క్రైస్తవుడు …. అనే అభిప్రాయం జనం లో పాకిపోయింది . సమాజం పై ఒక క్రైస్తవ దండ యాత్రికుడు గానే ఆయన జనానికి ఇప్పుడు కనపడుతున్నారు . .\
ఒక రాజకీయ పార్టీ స్థాపకుడు , ఆ పార్టీ అగ్ర నాయకుడికి పొరపాటున కూడా ఉండగూడని ఇటువంటి “లక్షణాలు”వైసీపీ వ్యవస్థాపకుడు వై ఎస్ జగన్మోహనరెడ్డిలో నిలువెల్లా ….అణువణువునా ఉన్నాయనే తీవ్ర భయాందోళనలకు లోనైనందువల్లనే ; 151 సీట్ల తో కనకపు సింహాసనం పై ఆయనను 2019 లో కూర్చోబెట్టిన తెలుగు ఓటరు…ఐదేళ్లు తిరగక ముందే …2024 లో 11 సిట్లే విదిలించాడు . ఫలితం గా అసెంబ్లీ సమావేశ మందిరం లో కాసేపు కూర్చోడానికి కూడా వైసీపీ కి మొహాలు చెల్లకుండా పోయాయి .
అందుకే తమ అసత్యాలు , శాపనార్థాలు . ఆరోపణలు , అరాచక వ్యాఖ్యానాలను అసెంబ్లీ కి బయట చేస్తూ , “ మళ్లీ వస్తున్నాం . అందర్నీ జైల్ లో వేస్తాం . బట్టలూడ దీయిస్తాం అంటూ తమ స్వతః సిద్ధవైఖరినే చాటుకుంటూ వస్తున్నారు . నిజానికి , “జైలు”అనే పద ప్రయోగం లేకుండా ……జగం ప్రసంగం ముగియదు .
అసెంబ్లీ లోనే ఇవన్నీ చెప్పవచ్చు . కానీ ,ఇవే అసత్యాలు అసెంబ్లీ లో మాట్టాడితే , అసెంబ్లీ రికార్డుల్లో నమోదు అవుతాయి . సభా హక్కుల తీర్మానాలు వస్తాయి . సభా బహిష్కరణలు ఉంటాయి . సభ్యత్వాలు కూడా రద్దు కావచ్చు . అందుకే అసెంబ్లీ మొహం చూడరు .

151 నుంచి 11 కు వచ్చి రెండున్నరేళ్లు అయింది . ఎందుకు ఇలా జరిగింది ? తమలో ఏం లోపం ఓటర్లకు కనపడింది ? లేక ఓటర్లే పొరబడ్డారని జగన్ అనుకుంటున్నారా ? లేక ; జగన్ చుట్టూ చేరిన వారిని చూసి జనం దడుచుకున్నారా ? అసలేం జరిగింది ? ఈ విషయాలు ఎప్పుడైనా సమీక్షించుకున్నారా !? 151 నుంచి 11 కు రావడానికి దారితీసిన పరిస్థితులపై జగన్ మోహన్ రెడ్డి “విచారం “ అయినా వ్యక్తం చేశారా ?
తన చుట్టూ ఉన్నవారిలో …. నేర స్వభావం , నేర దృక్పథం , నేర నడవడిక ఉన్న వారిని ఇప్పటికైనా గుర్తించి , వారి నుంచి పార్టీని విముక్తి చేశారా ? వారిని దూరం చేశారా ? ఎన్నికల ముందునాటి జగన్ కు .. ఇప్పటి జగన్ కి మధ్య జగన్ మైండ్ సెట్ , వ్యవహార శైలి , రాజకీయ ప్రత్యర్థులపై ఆయన వైఖరి లో ప్రజలకు మార్పు లాటిది ఏమైనా కనపడుతున్నదా?
పోనీ ఆయన మద్దతుదారులైన ఓటర్లయినా ఆయన నడక తీరు పట్ల తృప్తి గా ఉన్నారా ? నడక తీరులో వీసమెత్తు మార్పు లేకుండానే ….. జగన్ మళ్లీ అధికారం లోకి రాగలరన్న ధీమాలో…., భరోసా లో ఆయన మద్దతుదారులు ఉన్నారా?
లేరు …..లేరు….లేరు అని చెప్పడానికి , జగన్ శిబిరానికి చెందిన “గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ “ అనే గాసిప్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన “నువ్వు మారాలి జగన్ “ అనే కథనం ఓ నిఖార్సైన ఉదాహరణ .
ఈ శీర్షికతో ఆయన అభిమానులు (?) ఒక పాటను సోషల్ మీడియా లో వదిలారంట . వైసీపీ వర్గాలలో ఆది వైరల్ అయ్యి , అదేపనిగా తిరుగుతున్నదట.
జగన్ ….. తన చుట్టూ చేరిన నేరగాళ్లను వదిలించుకోవాలని , ప్రజలను ఆయన పట్టించుకోవాలని , ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వారంతా జగన్ ను వినమ్రంగా అభ్యర్థిస్తున్నారనేది ఆ కథనం సారాంశం .
మరి ; విశ్లేషకులు అందరూ రెండేళ్ల నుంచి చెబుతున్నదీ, ఆయన విననిదీ అదేగా !
దిక్పాలకులు, ఇతర చిల్లర మల్లర , ఇతర దేవతల మధ్య సతీ సమేతం గా ఠీవిగా కూర్చుండే దేవేంద్రుడులాగా ….. జనం నేరగాళ్లుగా భయపడే పలువురి మధ్య ఆయన నిర్భీతిగా రాజకీయ జీవనం సాగిస్తున్నారు .
రాజకీయాలలో తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అనేది ఆయన ధీమా ….! 2023 ఏప్రిల్ 13 న మార్కాపురం లో జరిగిన ఒక బహిరంగ సభలో జగన్ ; అభినయ పూర్వకం గా …. తల వెంట్రుకలపై రెండు వేళ్లు పెట్టి మరీ అభినయ పూర్వకంగా ఈ విషయం చెప్పారు .
అందుకే ; ఆ చిరునవ్వులు , నమస్కారాల ఉద్ధృతిని రెట్టింపు చేశారు . అవన్నీ అధికారం కోసం తప్ప ; తమకోసం కాదనే విషయం జనానికి అర్థమై పోయింది . అందువల్ల ; “ జగన్ …. నెవర్ ఎగైన్…” అని ఎవరూ పనిగట్టుకుని ప్రచారం చేయనవసరం లేదు . ముఖ్యంగా ….. పబ్లిక్ లైఫ్ లోకి కొత్తగా అడుగు పెట్టిన ఏ బీ వెంకటేశ్వర రావు . ఆయనకు పెద్ద శ్రమ లేకుండా ……జగనే…” డోంట్ వర్రీ! ఐ విల్ నెవర్ ఎగైన్…” అనే విధం గా ప్రచారం చేసుకుంటున్నారు .
ఈ ప్రచారాన్ని మరింతగా జనం లోకి తీసుకెళ్లడానికి వీలుగా పాదయాత్రకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు . జగన్ ను మరింత దగ్గరగా చూడడానికి, ఆయన మైండ్ సెట్ ను మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి …. ప్రజలకు ఇదో సువర్ణావకాశం.
ఆంధ్రప్రదేశ్ కు శుభం కలుగు గాక !
భోగాది వేంకట రాయుడు
