ఆ 4 రాష్ట్రాల్లో బ్యాలెట్ తో ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధమా?

- కాంగ్రెస్ సీఎంలారా…మీరు రాజీనామా చేసి రండి
- జ్ఝానేశ్ కుమార్ కు, బీజేపీకి ఏం సంబంధం?
- సర్ వల్లే గెలిచామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పారు కదా
- మచ్చార్ ధైర్య సాహసాలపై తెలిసినా స్పందించిన వాళ్లంతా దేశద్రోహులే
- హిందూ ఆలయాలపై దాడి చేసిన వాళ్లకు పిచ్చోడని ముద్ర వేయడం ప్రభుత్వానికి అలవాటైంది
- పిచ్చోళ్లు మందిరాలపైనే దాడులు చేస్తారా?…ఇతరుల ప్రార్ధనా స్థలాలు కన్పించవా?
- అనివార్య కారణాలవల్ల అమిత్ షా టూర్ వాయిదా
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎం యంత్రాలపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ‘‘ఈవీఎంల వల్లే కాంగ్రెస్ పార్టీ కేరళ, తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ రాష్ట్రాల్లో గెలిచింది కదా? మరి ఆ నాలుగు రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్దమా? పదేపదే ఈవీఎంల గురించి, సర్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి.’’అని అన్నారు.
ప్రపంచమంతా కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్య సాహసాలను కొనియాడతుంటే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. స్మిత్ మచ్చార్ పై దాడి చేసిన వ్యక్తి సామాజికవర్గం ఓట్లు పోతాయోననే భయంతోనే కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదన్నారు. స్మిత్ మచ్చార్ సాహసం, తెగువ తెలిసినా స్పందించని వాళ్లంతా తన ద్రుష్టిలో దేశద్రోహులు, దిమాగీ నక్సల్సేనని అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి, సంగప్ప, శ్రీవర్దన్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి తెలంగాణకు రావాల్సి ఉన్నప్పటకీ అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. దిల్ సుక్ నగర్ లో సంతోషీమాత దేవాలయంలో దాడి హేయనీయం. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దాడి చేసిన మతం వాళ్లు బాధపడతారనే కారణంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలు ప్రశ్నిస్తే… దాడి చేసినోడిని పిచ్చోడిగా చిత్రీకరించడం ప్రభుత్వానికి అలవాటైంది. పిచ్చోడికి మందిర్, మసీదు అనే తేడా తెల్వదు. కానీ మందిరాలపైనే ఎందుకు దాడి చేస్తున్నారు.
హిందువుల ధీటుగా స్పందించకపోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పద్దతి మార్చుకుని దాడి చేసిన వాళ్లపై కఠినాతికఠినంగా వ్యవహరించాలి. లేకపోతే యువత రోడ్లపైకి వచ్చి తిరగబడితే వాళ్లను ఆపే పరిస్థితి ఉండదు. ఆలయాలపై దాడుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
సీఈసీ జ్ఝానేశ్ కుమార్ కు, బీజేపీకి ఏం సంబంధం?. ఆయన ఎన్డీఏ మంత్రి కాదు… సీఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అసలు ఇండీ కూటమికి జనాదరణ లేదు. వాళ్ల ఆందోళన కార్యక్రమాలకు పట్టుమని పది మంది కూడా రావడం లేదు. ముంబై, ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు జనం పెద్దగా రాకపోవడమే నిదర్శనం.
సర్ ప్రక్రియలో భాగంగా సీపీఎం దొంగ ఓట్లను తొలగించడంవల్లే కేరళలో అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పారు కదా. మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారు? ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస నేతలకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ పాలిత సీఎంలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించండి. బ్యాలెట్ తో ఎన్నికల్లోకి వెళదాం. ఎవరు గెలుస్తారో చూద్దాం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ జరిపి చర్యలు తీసుకోదు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పోరాడదు. కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే.. .బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఉద్యమాలు ఎందుకు చేయడం లేదు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయలేదు.
కేసీఆర్ కుటుంబానికి పూర్వమే చింతమడకలో వందల ఎకరాలున్నాయనడం పెద్ద జోక్. ఆనాడు వాళ్లకు అసలు హైదరాబాద్ లో అసలు ఇల్లే లేదు. అధికారంలోకి వచ్చాకే ఇన్ని హోటళ్లు, ఆస్తులు ఎట్లా వచ్చాయి. టీచర్లు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత అంతా బీజేపీ పక్షానే ఉంది. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాం… ప్రజల్లో బీజేపీకి సానుకూలత ఉంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యం.
కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్య సాహసాలను ప్రపంచమంతా కొనియాడుతోంది. మోదీ నేరుగా వీడియో కాల్ చేసి మచ్చార్ తో మాట్లాడి అభినందించారు. రాహుల్ గాంధీకి కనీసం ట్వీట్ చేసే టైం కూడా లేదా. మచ్చార్ ధైర్య సాహసాలపై తెలిసినా స్పందించిన వాళ్లంతా దేశద్రోహులే. దిమాగీ నక్సల్సే. మచ్చార్ ను హత్య చేసేందుకు యత్నించిన కో పైలెట్ సామాజికవర్గం వాళ్లు ఇక్కడున్నారు. మచ్చార్ ను అభినందిస్తే… ఆ ఓట్లు ఎక్కడ పోతాయోననే భయంతోనే రాహుల్ గాంధీ స్పందించడం లేదు.
