November 14, 2026

తెలంగాణ భూమి ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఉంటుంది

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీది చాలా పెద్ద పాత్ర
  • సోనియా ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన రాలేదు
  • అలుగునూరులో ఈ నెల 29 న దీక్షా దివాస్ బహిరంగ సభ
  • మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ .రమణ, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్ కుమార్

హైదరాబాద్: నవంబర్ నెల అనగానే తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష గుర్తొస్తుంది. దీక్షా దివాస్ తో కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచాడు. దీక్షా దివాస్ ను మరోసారి స్పూర్తిగా తీసుకుంటున్నాము. మానకొండూరు నియోజకవర్గం అలుగునూరులో ఈ నెల 29 న దీక్షా దివాస్ బహిరంగ సభ. దీక్షా దివాస్ బహిరంగ సభకు కేటీఆర్ హాజరవుతారు. దీక్షా దివాస్ సభను సక్సెస్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి.

నవంబర్ 29 వ రోజు 40 , 50 ఏండ్ల దరిద్రాన్ని వదిలించుకున్న రోజు. చరిత్ర మలుపు తిరిగిన రోజు నవంబర్ 29. ఆమరణ దీక్ష చేస్తున్న కేసిఆర్ ను అరెస్ట్ చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చెయ్యకపోతే ఢిల్లీ దిగి వచ్చేది కాదు. ఈ నెల 29 న అలుగునూరులో భారీ బహిరంగ సభ. కరీంనగర్ జిల్లా మొత్తం అట్టహాసంగా ఈ నెల 29 న సంబరాలు. తెలంగాణ రాష్ట్రానికి కారణమే కేసీఆర్. తెలంగాణ భూమి ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఉంటుంది

క్విట్ ఇండియా నినాదం మనందరికీ ఒక స్పూర్తి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో మనందరికీ స్పూర్తి. తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరా గాంధీ అణిచివేసింది. సీమాంధ్రులు అనేక కుటిల రాజకీయాలు చేశారు. అలాంటి సమయంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చాడో నిర్ణయం. కేసీఆర్ ఆమరణ దీక్షతో యావత్ తెలంగాణ ఒక తాటిపైకి వచ్చింది. ఆమరణ దీక్ష చేస్తున్న కేసీఆర్ అరెస్ట్ చేశారు. ఖమ్మం జైల్లో కేసీఆర్ ను నిర్బంధించారు.

నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ ను తరలించాలని డిమాండ్ చేశాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆందోళనలు. డిసెంబర్ 09 తెలంగాణ పక్రియ మొదలవుతుందనీ ప్రకటన. సీమాంధ్రుల కుటిల రాజకీయాలకు చిదంబరం ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకున్నప్పుడు అందరూ ఏకం అయ్యారు.

జేఏసీలు అప్పుడే మొదలయ్యాయి. ఆ తర్వాత పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము. అందుకే ఈ నెల 29 అలుగునూరులో భారీ బహిరంగ సభ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీది చాలా పెద్ద పాత్ర. సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన రాలేదు. కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ జరుగుతుంది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం పై తుపాకీ పట్టుకొని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరం.

ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కోరుకంటి చందర్ ,సుంకె రవి శంకర్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవీందర్ సింగ్ , చిరుమళ్ల రాకేష్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు రవీందర్ రెడ్డి ,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Total Visitors: 3,424,837