November 14, 2026

మాట-తూటా (ఇకపై ఇది రోజూ వస్తుంది. కాబట్టి ఒక లోగా పెట్టి ఇవ్వండి)

ప్రధాని మోడీ ఆదేశాలతో అధికారులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు – నా దగ్గర వాటికి తగిన ఆధారాలున్నాయి

  • రాహుల్ గాంధీ
    ఇంతోటి నీ డోరోమాన్ డైలాగులు వినటానికే ఆళ్ళు ట్యాపింగ్ చేస్తన్నారంటే – ఆళ్ళెంత పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నారో !! నాకైతే నమ్మకం లేదు దొర!!!

ఫీజు రీఇంబర్సుమెంటుపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటమే. ఐదేళ్ళ పాలనలో జగన్ ఫీజు రీ ఇంబర్సుమెంటు ఇవ్వకుండా కేవలం పబ్లిసిటీ మాత్రమే చేస్కున్నాడు కాబట్టే 4-5 వేల కోట్ల బకాయలు ఉన్నాయ్

  • నారా లోకేష్
    మా అన్నియ్యంతే – కేవలం గుప్త దానాలు మాత్రమే చేస్తాడు. డబ్బా మీద గిఫ్టు రేపరుంటాది కానీ – డబ్బాలో గిఫ్టు మాత్రం ఉండదు !!

ప్రపంచ వ్యాప్తంగా వరుసగా రెండో రోజూ మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం. అనేక చోట్ల టీమ్స్ & ఔట్ లుక్ పనిచేయలేదని బోగట్టా
వేళాపాళా లేని పనికిమాలిన టీమ్సు కాల్సుకి విసుగెత్తి పోయిన ఏ కార్పొరేటు ఎంప్లాయో తీగ తెంపేసుంటాడు – మనశ్శాంతి కోసం !!


పూర్తి టికెట్ డబ్బులు తీసుకుని బెర్త్ ఇవ్వకపోవటంపై అభ్యంతరాలు రావటంతో – రైల్వేలో ఉన్న RAC విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో కేంద్రం
మహనుభావులొచ్చాక థర్డ్ ఏసీకీ – జనరల్ భోగీకి తేడా లేకుండా పోయింది . ఏదుంచితే ఏటి ? ఏది పీకితే ఏటి ??


రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ సంగతేమో నాకు తెలీదు కానీ – నా ఫోను కావలిస్తే ఎవరైనా ట్యాప్ చేసుకోవచ్చు . నేను బయటేం మాట్లాడతానో లోపలా అదే మాట్లాడతాను కాబట్టి నాకొచ్చిన నష్టమేం లేదు

  • రేవంత్ రెడ్డి
    బాగా తెగించేసావ్ – అవున్లే … వీడియోలకే భయపడనోడివి. ఆడియోలకి భయపడతావా??
    చేసినోడికి టైం బొక్క !
    .
    – అర్వపల్లి ఆంజనేయులు
Total Visitors: 3,424,839