బిజెపి దేశవ్యాప్త సేవా సంకల్ప అభియాన్..ఆశీర్వాద దీపాన్ని వెలిగించండి

దేశ ప్రధానమంత్రి అంటే అది ఒక హోదా, దర్పం కాదు ప్రధాన సేవకుడిగా దేశ ప్రజలకి నిరంతర సేవలు అందిస్తూ, దేశ పురోగతికి పాటుపడే బృహత్తర బాధ్యతగా అభివర్ణించిన ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు దేశ ప్రధానిగా 12 ఏళ్లు అంటే 2001 నుంచి ఈరోజు వరకు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా నిరంతరంగా నిరాఘాటంగా అనుక్షణం ప్రతినిత్యం దేశం కోసం దేశ ప్రజల కోసం వారి అభ్యున్నతి కోసం నవయుగ కృషి వల్లభుడు ప్రధాని నరేంద్ర మోడీ.
సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా భారతీయ జనతా పార్టీ 15 రోజులు పాటు సేవ సప్తాహం పేరుమీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్టోబర్ 7, 2001న నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఓ పక్క ప్రధాని మోడీ పుట్టినరోజు మరోపక్క ప్రజా సేవలో వారి రజితోత్సవం. ఈ రెండు మంచి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించుకోవటానికి బిజెపి దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాల “సేవ సంకల్ప అభియాన్” కి శ్రీకారం చుట్టింది.
ఆశీర్వాద దీపం: 140 కోట్ల దేశ ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావించి 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రధాని మోడీ కి సంఘీభావంగా దేశ ప్రజలు సెప్టెంబర్ 17వ తారీకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు మీ ఇళ్లల్లో ఒక దీపాన్ని వెలిగించి ప్రధాని మోడీ కి సంఘీభావం తెలియజేయాలని వారిని ప్రోత్సహించాలని ఆశీర్వదించాలని, ఆ ఫోటోను మీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు: రక్తదాన శిబిరాలు, వైద్య పరీక్ష శిబిరాలు, కంటి పరీక్ష శిబిరాలు, పాఠశాలలో చిత్రలేఖనం వక్తృత్వ పోటీలు వంటి వివిధ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది దీనిలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా సంకల్ప అభియాన్ని విజయవంతం చేయాలని ప్రధాని మోడీ కి బాసటగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

పెద్దిరెడ్డి రవికిరణ్
(బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్ర ప్రదేశ్)
