November 10, 2026

23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఆత్మీయ కలయిక

  • ఈసారి చార్మినార్ నుంచి అమరావతికి

23 ఏళ్ల క్రితం హైదరాబాద్ చారిత్రక చార్మినార్ సాక్షిగా ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తాతో కలిసి అప్పటి రాజకీయాలు, అభివృద్ధి, జీవితంలోని అనేక అంశాలపై సాగిన సంభాషణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత అదే శేఖర్ గుప్తాకు మరోసారి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈసారి వేదికగా నిలిచింది నవ్యాంధ్ర భవిష్యత్ రాజధాని అమరావతి. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో ఇద్దరూ కలిసి పర్యటిస్తూ నగర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలపై ముచ్చటించారు. 23 ఏళ్ల క్రితం చార్మినార్ వద్ద ప్రారంభమైన ‘వాక్ ది టాక్’ ప్రయాణం.. నేడు అభివృద్ధి చెందుతున్న అమరావతి వీధుల్లో మరోసారి కొనసాగింది. ఈ ప్రత్యేక ముఖాముఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Total Visitors: 3,329,238