November 10, 2026

పాలమూరు ప్రజల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ

  • పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది
  • ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు చేసుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి
  • ఒక్కచుక్క నీరు కర్ణాటక వదిలింది లేదు
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి .శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తల్లి చనిపోతే దినాలు, కర్మ చేసుకోవడానికి నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి కరంటు లేదు, నీళ్లు లేవు అని శాసనసభలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నాడు. ఇది కాంగ్రెస్ పరిపాలన అని ఎద్దేవా చేసింది రేవంత్ రెడ్డి. నువ్వు మరిచిపోయావని గుర్తుచేస్తున్నాం. పాలమూరు పచ్చబడ్డదే కేసీఆర్ నాయకత్వాన. కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో పాలమూరును కలపకుంటే అప్పర్ కృష్ణా, భీమా, ఆర్డీఎస్, తుంగభద్ర హై లెవెల్ కాలువల ద్వారా 1960 దశకం నాటికే పాలమూరులో 20 లక్షల ఎకరాలు గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాలో పారి ఉండేది.

కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రతో కలపడం, నిజాం కాలం నాటి ప్రాజెక్టుల ప్రతిపాదనలను కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పక్కనపెట్టి పాలమూరు ప్రజల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజే గ్రావిటీ ప్రాజెక్టులు కట్టుకుని ఉంటే ఈ రోజు పాలమూరు రైతాంగం లిఫ్టుల కోసం ఎదురు చూడాాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కాంగ్రెస్ చేసిన దుర్మార్గం, విధ్వంసం మూలంగా మూడు తరాల పాలమూరు కోలుకోకుండా చేసింది.

దానిని సరిచేసే ప్రయత్నం కేసీఆర్ చేసుకుంటూ వచ్చారు. దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా అన్ని అడ్డంకులు అధిగమించి కేసీఆర్ రూ.35 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశారు. పాలమూరు నీళ్లను వినియోగించుకుంటే ఈ రోజు పాలమూరు ముఖచిత్రం మారిపోయి ఉండేది. ఇప్పుడున్న నీళ్లను వాడుకోమన్నా పట్టించుకోవడం లేదు

పంటలు వేయొద్దని చెప్పిన మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి నిలబడిపోతాడు. ఆరుతడి పంటలు వేయమని చెప్పారు. మరి వాళ్ల నీళ్లు, కరంటు సంగతి ఏంటి అన్న విషయం ఎందుకు చెప్పడం లేదు? రేవంత్ రెడ్డికి అలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు .. ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు చేసుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అయి ఉంటాడు.

ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన వేదికల మీద తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, అక్కడ రాజకీయాలు మాట్లాడడం, అందులో ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని దూషించడం రేవంత్ కే చెల్లింది. సమాజం గమనిస్తుంది అన్న విషయాన్ని కూడా బేఖాతరు చేస్తూ.. ఎవ్వడేమన్న అనుకోని నేను ఇట్లే మాట్లాడతా ఒక అజ్ఞానంతో కూడిన అహంకార పూరితమైనటువంటి ప్రదర్శిస్తున్నాడు రాష్ట్ర ఖ్యాతిని, పరువును మాత్రమే కాకుండా, ముఖ్యమంత్రి స్థానానికి ఉండే మర్యాదను కానీ ఏనాడు కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయకపోవడం బాధాకరం

రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన తిప్పడు తిరునాళ్లకు పోయిండు .. రానే వచ్చిండు అన్నట్లుంది. సొంత నియోజకవర్గానికి వెళ్లడంలో ప్రత్యేకత ఏంటి ? కొడంగల్ పర్యటనకు పాలమూరుకు ఏం సంబంధం ? మిగిలిన 13 నియోజకవర్గాలకు చేసింది ఏంటి ? కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడంతో పాటు, రాష్ట్రంలోని అయిదు, ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేసి సాగునీరు అందించారు.

తిట్లు తిండిపెట్టవు, ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వవు, రైతన్నలకు మనోధైర్యం ఇవ్వవు. 35 నెలలలో పాలమూరుకు పట్టుమని రేవంత్ రెడ్డి చేసిన పనులు ఏంటి ? పాలమూరు ప్రజలకు వచ్చిన ఉపాధి ఏంటి చూయించాలి ? కనీసం అదనంగా ఒక్క ఎకరాకు అయినా సాగునీళ్లు వచ్చాయా ? పదే పదే ప్రశ్నిస్తే మొక్కుబడిగా పాలమూరు ప్రాజెక్టులు సందర్శించి చేతులు దులుపుకుని వెళ్లారు

పచ్చని పాలమూరు మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు .. జూరాలలో 9 టీఎంసీల సాగునీళ్లు ఉన్నా రైతులకు ఇవ్వకుండా వేధించారు. తాగునీళ్ల పేరుతో రైతుల పొలాలు ఎండబెడితే రైతులే స్వయంగా నీళ్లు వదులుకున్నారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు వచ్చాయి. తెలంగాణ మంత్రులను కర్ణాటక నుండి నీళ్లు విడుదల చేయాలని పంపించారు. వాళ్లు వెళ్లి వచ్చినా ఒక్కచుక్క నీరు కర్ణాటక వదిలింది లేదు. కర్ణాటకలో 17 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. కిందకు నీళ్లు వస్తాయి అని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.

కర్ణాటక నుండి నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వం కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు. వచ్చిన నీళ్లను ఎలా వినియోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, చిత్తశుద్ది లేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువల టెండర్లను రద్దు చేశారు . కొండగల్ అభివృద్ధి మీద ఈర్ష పడుతున్నారు అని రేవంత్ అంటున్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు తప్ప మాకెవ్వరికీ ఈర్షలేదు
నీళ్లు లేవు. కరవు వచ్చింది అని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డినే కావాలా. రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్న వాళ్లని ద్వేషిస్తూ తిరుగుతున్నాడు. ఈయన నఫ్రత్ చూసేనా కాంగ్రెస్ పెద్దలు కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదా?

కొడంగల్ లో రైతుసభ అని పెట్టి ఎండిన పంటలకు ఏం ఇస్తారో ఎందుకు చెప్పలేదు ? యాసంగి రైతుబంధు గురించి ఎందుకు చెప్పలేదు ? రైతుబీమా గురించి ఎందుకు చెప్పలేదు ? ఆగస్టు 14తో రైతుబీమా ముగిసింది కదా .. మరి ఆ తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు ఏం ఇస్తారు ? ఇందిరమ్మ బీమా ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది ? ఈ విషయాలు చెబుతావని రైతులు ఎదురుచూస్తే కేసీఆర్ మీద విమర్శలు చేయడం ఏంటి ?

ఉస్మానియాకు వెళ్లి వెయ్యి కోట్లు అని హామీ ఇచ్చాడు. ఏడాది దాటినా ఇప్పటి వరకు దిక్కు లేదు. రేవంత్ విద్యను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన ఆచార్యులు ముక్కున వేలేసుకున్నారు. స్వభజన, పరభజన, పరస్పర భజన చాలా ముందుకు వెళ్లింది. మరి వెయ్యికోట్లు ఎక్కడికి పోయాయి ? కళ్యాణ లక్ష్మి, తులంబంగారం, స్కూటీ, విద్యార్థుల పారితోషికాలు ఎక్కడికి పోయాయి?

సీఎం స్థాయి వ్యక్తి గడ్డం, మీసాల గురించి మాట్లాడతాడా ? కేటీఆర్ గడ్డాలు, మీసాలు రేవంత్ రెడ్డికి దేనికి అడ్డం వచ్చాయి ? దేశంలో గడ్డం పెంచుకున్నది మొదట రేవంత్ రెడ్డేనా ? గడ్డం పెంచుకున్న వారిలో పోటీకి పెడితే రేవంత్ రెడ్డికి అందాల పోటీకి వచ్చినవా ? వ్యక్తిగత ఆహార్యం గురించే దిగజారుడు స్థాయి ఏంటి ?

నువ్వు ఏం చేసినా కేటీఆర్ రేవంత్ రెడ్డి కాలేడు అంటున్నావు. కేటీఆర్ పొరపాటున కూడా రేవంత్ రెడ్డి కాడు. కేటీఆర్ కేటీఆరే. రేవంత్ రాక్షస భాష మార్చుకుంటే బాగుంటుంది. గతంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు నిధులన్నీ తీసుకుపోతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇపుడు ఏం చేస్తున్నారు? పాలమూరు జిల్లాకు ఏడాదికి 20 వేల కోట్లు ఇస్తామన్నారు… మూడేళ్లు అయింది 60వేల కోట్లు కాదు. ఆరు కోట్లు అయినా వచ్చాయా? కృష్ణా నుంచి కనీసం 30 టీఎంసీలు కూడా ఎత్తిపోయలేదు? ఏపీ నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోకుండా పాలమూరుపై కక్ష గట్టింది కాంగ్రెస్ మాత్రమే. ఉద్యోగులు పీఆర్సీ, డీఏలు ఇస్తామన్నందుకు ఓట్లు వేశారు.

ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Total Visitors: 3,329,240