November 14, 2026

పేదింటి మహిళకు ప్రజాప్రతినిధిగా పట్టం కట్టిన టీడీపీ

నామినేషన్ వేసిన రోజూ కూలి పనికి వెళ్లిన మహిళ… నేడు 3,650 ఓట్లలో 246 ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రజాప్రతినిధి!
ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, వణుదుర్రు గ్రామానికి చెందిన గూడవల్లి నాగమల్లేశ్వరమ్మ గారి కథ ఇది.

భర్త తాతయ్య. వృత్తి వ్యవసాయ కూలి. గౌడ సామాజికవర్గానికి చెందిన నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.

ఆ కుటుంబానికి గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో విడదీయలేని అనుబంధం ఉంది. పదవులు ఆశించలేదు… ఆర్థిక ప్రయోజనాలు కోరుకోలేదు. పార్టీ మీద అభిమానంతో, నమ్మకంతో నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు.
ఆ నిబద్ధతను గుర్తించిన తెలుగుదేశం పార్టీ, నాగమల్లేశ్వరమ్మ ని వణుదుర్రు MPTC అభ్యర్థిగా నిలబెట్టింది.
ఆమె జీవితంలో ఒక సంఘటన ఈ కథకు అసలైన అర్థాన్ని చెబుతుంది.

ఎంపీటీసీ నామినేషన్ వేసిన రోజు కూడా ఆమె కూలి పనికి వెళ్లారు!
ఎందుకంటే… ఆ రోజు పనికి వెళితేనే ఆ కుటుంబానికి పూట గడిచే పరిస్థితి!
అలాంటి ఒక సామాన్య వ్యవసాయ కూలీ మహిళకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఆమె వెనుక నిలబడింది. గ్రామ ప్రజలు ఆమెను అక్కున చేర్చుకున్నారు. చివరకు 3,650 ఓట్లలో 246 ఓట్ల మెజారిటీతో ఘన విజయం అందించారు.
ఇది కేవలం ఒక ఎంపీటీసీ విజయం కాదు.
ఇది ఒక సామాన్య మహిళకు దక్కిన గౌరవం.
నాలుగు దశాబ్దాల పార్టీ అభిమానం పొందిన గుర్తింపు.
కష్టపడే కార్యకర్తకు దక్కిన రాజకీయ అవకాశం.

బడా నాయకుల కుటుంబాలకే రాజకీయాలు పరిమితం కాకూడదు… సామాన్య కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులు కావాలన్న ఆలోచనకు నిదర్శనం నాగమల్లేశ్వరమ్మ గారి విజయం.

బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేసే సామాన్య కార్యకర్తలను చట్టసభలకు, స్థానిక సంస్థలకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన లక్ష్యం.
టీడీపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు… సామాన్యుడికి సైతం నాయకుడిగా ఎదిగే అవకాశం కల్పించే వేదిక!
ఇదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత.

ఇదే సామాన్య కార్యకర్తకు ఇచ్చే గౌరవం!

Total Visitors: 3,425,476