అమ్మో 1977 నంబర్ 19..

- దివిసీమకు పెను ఉప్పెన.. కాళరాత్రి..
- దివిసీమ లో పెను ఉప్పెన కు 49 సంవత్సరాలు,
- దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలంలోని వందలాది గ్రామాలు జలమయం..
- పదివేల మంది పైగా, మృత్యువాత..
- వేల సంఖ్యలో ముగజీవాలు జలసమాధి..
- ఒక ప్రక్కన ఆకలి –మరోక పక్కన కుటుంబసభ్యులు మృతదేహాలకోసం వెతుకులాట??..
- గుప్పెడు మెతుకులు, గుక్కెడు నీటికోసం , ఎదురు చూపులు..
కృష్ణా జిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గం…
నవంబర్ 19 అంటేనే దివిసీమ లో, కోడూరు, నాగాయలంక మండలంలోని తీరప్రాంతం గ్రామాల్లోని ప్రజలు గుండెలో భయాందోళనలు చెందుతున్నారు..
1977 నవంబర్ 19న సంభవించిన పెను ఉప్పెనకు గుర్తుకు వస్తుంది.. ఆరోజు కాళరాత్రి..
ఆరోజు ఉదయం నుంచి భారీవర్షం, సాయంత్రం మూడు గంటలనుంచి ఈదురు గాలులు, వీస్తున్నాయి.బలమైన గాలు, భారీవర్షాలు కు, కోడూరు మండలం సముద్ర తీరం ప్రాంతంలోని,పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లి పాలెం, ఉంటగుణం, బసన్నవానిపాలెం, రామకృష్ణాపురం, ఇరాలి, నాగాయలంక మండలం, ఎదురుమెండి, నాచుగుంట, సంగమేశ్వరం, ఉప్పకాలి పలుగ్రామాలలో ప్రజలు కు ఏమి జరుగుతుందోని తెలియని పరిస్థితి.
సాయంత్రం ఆరుగంటల సమయానికి ఈదురు గాలు భారీవర్షాలు,, ఒక్కసారిగా కారుచీకటి. గ్రామాలలోని ప్రజలు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసి, దేవాలాయలు, బలమైన గృహాల లోకి పరుగులు తీశారు. ఒక్కసారిగా సముద్రపు ఉప్పు నీరు గ్రామాల్లోని చేయటం, కళ్ళు మూసుకుని తెరిచే లోపే సమారు యాభై మీటరు ఎత్తులో సముద్రపు రాకాసి అలలు.. అరగంట వ్యవధిలోనే గ్రామాలు గృహాలునీటిలో కొట్టుకు పోవటం, వేలాది మంది మృతి, సుమారు మూగజీవాలు మృతి చెందాయి.
ఎటుచూసినా తీరప్రాంతాలు శవాలతో నిండిపోయి.. ప్రాణాలు లతో బయటపడిన వారు వారి కుటుంబ సభ్యులు కోసం వెతుకులాట. ప్రాణాలతో బయటపడిన తాడి చెట్టు పైన, నీటి లో కోట్టుకుపోయిన గృహాలు పైకప్పులు పైన కొన్న ఊపిరితో మరికొందరు..
త్రాగటానికి త్రాగునీరులేక, గుప్పెడు అన్నం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు..
మళ్లీ నవంబర్ నెలలో వాయుగుండం సంభవిస్తే ప్రతి ఒక్కరికీ 1977 నవంబర్ 19 గుర్తుకు వస్తుంది.
మళ్లీ ఈ తుపాను ఈనెల నవంబర్ 19న మచిలీపట్నం సమీపంలోని తుపాను తీరం దాటుతుంద ని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించటంతో, తీరప్రాంతం ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి.
- వల్లూరు ప్రసాద్ కుమార్
